Jul2007
జులై సంచిక
సూచిక :
- ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక ప్రాణహితకు స్వాగతం!
- చెరబండరాజు నేపథ్యం – వరవరరావు
- నన్నెక్కనివ్వండి బోను – చెరబండరాజు
- యువతరమా … – చెరబండరాజు
- కొండలు పగలేసినం – చెరబండరాజు మొత్తం చదవండి »
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రిక
Jul2007
సూచిక :
Jul2007
ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యానికి వేదిక కాదల్చుకున్న ప్రాణహిత మొదటి సంచిక ఇది.
ప్రముఖ ప్రజాకవి చెరబండరాజు అమరుడై ఈ నెల సరిగ్గా ఇరవై ఐదేళ్ళవుతున్నది. తన చివరి ఊపిరి వరకు పీడిత ప్రజల పక్షం వహించిన కవిగా, రచయితగా దోపిడీ వ్యవస్థపై నిరంతర పోరాటం నెరపిన మొక్క వోని కలం యోధుడు చెరబండరాజు సంస్మరణలో ప్రాణహిత మొదటి సంచికను మీ ముందుకు తెస్తున్నాం.
Jul2007

చెరబండరాజు మరణించి అప్పుడే ఇరవయి అయిదేళ్లు అయింది. అంటే ఒక తరం మారింది.
ఈ తరానికి చెరబండరాజు తెలుసా?
బాల నరసిమ్మకు మొక్కుకుంటే బక్కారెడ్డి పుట్టిండు. పది నెలలయినా ఆ ఉగ్రనరసింహుడు బయట పడకపోతే, ఆ శిశువును మోయలేక తల్లి ఆపసోపాలు పడుతుంటే ఆ పల్లెటూళ్లో ఆమెను కోదండమేసిన్రు. అవి పురుటినొప్పులు మాత్రమే కాదు. దేవకీదేవి చెరసాలలో పడిన కష్టాల వంటివి. అందుకే తండ్రి ఆయనను శెరబందిరాజు అని పిలుచుకున్నాడు. మొత్తం చదవండి »
Jul2007
ఓ నా ప్రియమైన మాతృదేశమా
తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా
దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలంనీది
Jul2007

Jul2007
కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
Jul2007
పతనమవుతోన్న భూస్వామ్య సామ్రాజ్యవాద
అరాచక శిథిల వ్యవస్థనుండి
సమతా మమతలు పండే
మహోన్నత మానవత్వపు పొలాల్లోకి
Jul2007
బహుశ
తగిన సమయంలోనే మనం
గత కాలం గురించి మాట్లాడుకుంటున్నాం..
గత వర్తమానాల మీదుగా భవిష్యత్తు ఎలా వీస్తుందో..
Jul2007
ఈ నేలను సెజ్‌ల పేర అమ్మనిద్దమా?
పరదేశపు కంపెనీలకప్పగిద్దమా?
మన నెత్తురు మన నేలను కాల్వలుగా తడిపేసిన…
నందిగ్రామ్ సింగూర్లను సాగనిద్దమా?
మన భూములు శ్మశానంగా మారనిద్దమా? మొత్తం చదవండి »
Jul2007
ఇమిగ్రేషన్ ప్రవాహంలో తరలుతున్న
ఈ కొత్తతరం పాదాలకింది-
నేల చిరునామా ఏదీ?
Jul2007
స్టీరింగు ముందు తనకు తెలియకుండానే వణికిపోతున్న చేతులతో ఖాసిం, ఆ ప్రాంతాలకు ఎన్నిసార్లు వచ్చినా కొత్తగానే ఉంటుంది. మట్టిరోడ్డంతా గతుకులు గతుకులు. ఒక్కొక్కసారి స్టీరింగు జారిపోయేంతగా ఎగిరిపడుతోది జీపు. మొత్తం చదవండి »
Jul2007
పూలమ్మిన చోటనే కట్టెలమ్మాల్సి వస్తుందని అందరూ చెప్పారు నేను పూల దుకాణం పెడుతుంటే. నేను పట్టిన కుందేలుకు మూడు కాళ్లనే మొండివాణ్ని కాదు. నా మేలు కోరి చెప్పిన వాళ్ల మాట కాదనలేను. అలాగని నా పుర్రెలో పుట్టిన ఐడియాను చంపుకోలేను. మొత్తం చదవండి »
Jul2007
గాలికి కిటికీలు టపటప కొట్టుకుంటాంటె దెబ్బకు తెలివికొచ్చింది.

రేకుల మీద రాల్లు పడ్డట్టు పడ్తాంది వాన, జర గట్టిగ ఇంకో గాలొస్తె ఎగిరిపోతయా అన్నట్టు ఉన్నయా రేకులు. “ఇయ్యాలేందో జోరుగ పడ్తాంది వాన!” అన్నది పక్క అర్రల నుంచి మా అత్త, గిప్పుడామె తోటి మాట్లాడుడు నా తోటి కాదని ఏం సప్పుడు జెయ్యలే. మొత్తం చదవండి »
Jul2007
మార్చి 14-16 మధ్య నందిగ్రాంలో జరిగిన భయానక మారణకాండ పూర్తి వాస్తవాలు బహుశా ఎప్పటికీ బయటకు రాకపోవచ్చు. మొత్తం చదవండి »
Jul2007
వచన కవిగా వరవరరావు తెలుగు సాహిత్య లోకంలో చిర ప్రముఖులు. చలి నెగళ్ళు నుండి ఉన్నదేదో ఉన్నట్టు వరకు అనేక కవితా సంపుటులని ప్రకటించిన వరవరరావు ప్రజల ప్రజాస్వామిక ఆకాంక్షలని సాహిత్యం ద్వారా ఆచరణ ద్వారా నిరంతరం ప్రవహించే జీవనది. మొత్తం చదవండి »