Jul2007
‘ఇమిగ్రేషన్’ ప్రవాహం!
ఇమిగ్రేషన్ ప్రవాహంలో తరలుతున్న
ఈ కొత్తతరం పాదాలకింది-
నేల చిరునామా ఏదీ?
డాలర్ల వేటలో వొదిగిపోతున్న-
యవ్వనాల గమ్యమెక్కడ?
స్వదేశీ విదేశీ ప్రశ్నలకు తావు లేదిక్కడ
ప్రవాసుల అవకాశాల నిరీక్షణలో
‘కెరియర్’కు అంకితమైన నైపుణ్యమంతా
తీరిక లభిస్తే సుఖాన్వేషణలో!
ఇక్కడ మరచిన రోడ్ల మీద
కార్లవేగంలో ఆవిరవుతున్న వయస్సు,
భారతీయ మేధాసంపత్తి
పరదేశీ పంటకు ఎరువై
బహుళజాతి వ్యాపార సంస్కృతిలో
స్వంత సాంప్రదాయాలకోసం ఆరాటం
లేదంటే సొంత నీతినియమాలతో రెండో తరం!
ఆఫ్రికన్ అమెరికన్స్,
ముస్లీం అమెరికన్స్ మొదలు
అనేక రకాల అమెరికన్ల మధ్య
నేటివ్ అమెరికన్స్ ఎక్కడో మారుమూల,
‘డైస్పోరా’లో యన్. ఆర్. ఐ ముద్రతో
ఇండియన్ అమెరికన్స్ మధ్య ప్రవాసాంధ్రుల ఆత్మసంతృప్తి!
జాతివర్ణవిభేదాల అదృశ్య హస్తాలలో
స్థానికుల నిరుద్యోగ నీడలకింద
ఎంతమంది ‘నీలిమ’లు
ఉపాధి కోల్పోడం లేదు?
అయినా ఇమిగ్రేషన్ ప్రవాస తరాలు
‘ఏ దేశమేగినా ఎందుకాలిడినా’
ఆ దేశమే సొంత నేలగా మారితే
మాతృభూమిలో తీరనివ్వని వ్యధలకే
ప్రపంచాన్నే మార్చేస్తున్న-
భారతీయులంటే,
విశాలవిశ్వ వాణిజ్యానికి-
ఎంత గర్వం!!
July 2nd, 2007 at 10:31 pm
చాలా బాగున్నది. ఇది యదార్థం
July 3rd, 2007 at 12:28 am
ప్రత్యామ్నాయ సాహిత్య పత్రికకు సాదర స్వాగతము..ప్రాణహిత రూపకర్తలకు హ్రుదయపూర్వక అభినందనలు.ప్రత్యామ్నాయ పత్రికలే ఈనాటి తక్షణావసరము.ప్రధాన స్రవంతి పత్రికలకు ప్రజల గోడు, ప్రజల సమస్యలు పట్టించుకుకే మానవీయకోణమ్ లేకుండాపోయింది.ప్రజల పక్షాన నిలబడే ప్రాణహితకు మనమంతా అండగా నిలబడాల్సిన అవసరమ్ చాలా ఉంది.మంచి ప్రయత్నాన్ని మనస్పూర్తిగా ఆహ్వానిస్తున్నాను.
July 4th, 2007 at 1:27 pm
చాలా బాగున్నది.
August 16th, 2007 at 4:17 am
చాల బాగున్నది.
దూరపు కొండలు నునుపు – అని తెలిసే…కొందరూ,
తాము GRE / TOEFL వగైరా, వగైరా ప్రయత్నించ(లే)క, వీసా దొరకక
“खट्टे अंगूर” (అమెరికా పోనిది – అందలేకనా..)
అన్న అపప్రథమూటగట్టుకోకుండా ఉండడానికి కొందరూ….