ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక ప్రాణహితకు స్వాగతం!

ప్రజల పక్షం నిలబడ్డ సాహిత్యానికి వేదిక కాదల్చుకున్న ప్రాణహిత మొదటి సంచిక ఇది.

ప్రముఖ ప్రజాకవి చెరబండరాజు అమరుడై ఈ నెల సరిగ్గా ఇరవై ఐదేళ్ళవుతున్నది. తన చివరి ఊపిరి వరకు పీడిత ప్రజల పక్షం వహించిన కవిగా, రచయితగా దోపిడీ వ్యవస్థపై నిరంతర పోరాటం నెరపిన మొక్క వోని కలం యోధుడు చెరబండరాజు సంస్మరణలో ప్రాణహిత మొదటి సంచికను మీ ముందుకు తెస్తున్నాం.

‘ముంజేతిని ఖండించిన నా పిడికిట కత్తి వదల’ నన్న చెర కవితా ప్రస్థానం దిగంబర కవిత్వోద్యమం నుండి విరసం దాక సాగింది. దిగంబర కవిత్వోద్యమంలో నుండి విరసం లో చేరిన నలుగురు కవుల్లో చెర ఒకరు. 1982 లో గాంధి ఆసుపత్రిలో చివరి శ్వాస వదిలే దాకా, ప్రభుత్వమూ, పోలీసులూ, అనారోగ్యమూ ఎంత వెంటాడి వేధించినా, చిత్రహింసల పాల్జేసినా తాను నమ్మిన విశ్వాసం కోసం నిలబడ్డ చెరబండరాజు ఈ తరానికి గొప్ప స్ఫూర్తి.

ప్రపంచీకరణ నల్దెసలా వ్యాపిస్తూ అణగారిన ప్రజల హక్కులని ఆకాంక్షలని కాలరాస్తున్న సందర్భంలో చెరను సంస్మరించుకోవడం సమయోచితమైనదని ప్రాణహిత భావిస్తోంది.

ఇరవైఏళ్ళ తన సుదీర్ఘ కవితాప్రస్థానం లో చెర దిగంబర కవిత్వ కాలంలో రాసిన ‘నన్నెక్కనివ్వండి బోను’ కవిత, విప్లవ కవిత్వోద్యమ కాలం లో రాసిన, ‘పల్లవి’ కవిత, ‘యువతరమా …’, ‘కొండలు పగలేసినం’ పాటలు, ‘చిరంజీవి’ కథ మీకందిస్తున్నాం.

చెర అమరుడైన వార్త వినగానే అనేక మంది తెలుగు కవులు ఆయనకు జోహార్లు చెబుతూ కవిత్వం రాసారు. వాటిల్లో లక్నా రెడ్డి రాసిన ‘మృత్యు శిఖరంపై యుద్ధ ఫిరంగి’ కవిత గొప్ప ప్రభావం నెరపింది. ప్రముఖ హిందీ కవి సర్వేశ్వర్ దయాళ్ సక్సేనా చెర అమరత్వంపై అద్భుతమైన కవిత రాసారు. దాని తెలుగు అనువాదం 1983 సృజన లో అచ్చయింది. దాన్ని మీకందిస్తున్నాం. వీటితో పాటు చిరకాల సహచరుడు వరవరరావు రాసిన చెర జ్ఞాపకం కూడా మీ కందిస్తున్నాం.

అలాగే ప్రముఖ కవి శివారెడ్డి రాసిన ఒక దీర్ఘ కవితనూ, నిఖిలేశ్వర్ రాసిన ‘ఇమిగ్రేషన్’ ప్రవాహం కవితనూ, మొత్తం భారతదేశాన్ని కుదిపేస్తున్న సెజ్ ల వ్యవహారంపై పి. ప్రసాద్ రాసిన సెజ్‌లపై సమరగానం పాటను, తనిక సర్కార్ రాసిన ప్రతిఘటనకు జేజే వ్యాసాన్నీ మీకందిస్తున్నాం.

ఈ మధ్య కాలంలో కూర్మనాథ్ గొప్ప భావుకతతోనూ, సున్నితత్వం తోనూ కథలు రాస్తున్నారు. ఆయన రాసిన ‘పూలగుర్తులు’ గుండెని మెలిపెట్టే అంశాన్ని గొప్ప సున్నితత్వంతో చెప్పిన కథ. కొత్తగా రాస్తున్నా కథ చెప్పడంలో మంచి ఒడుపుతో జయప్రకాష్ రాసిన తొవ్వ కథ స్త్రీ సమస్య గురించి తెలంగాణ హృదయంతో ప్రకటిస్తుంది.

వరవరరావు రాసిన ‘పాలపిట్టల పాటలు’, ‘తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట’ అనే రెండు పాటల సంకలనాలను ఇటీవల సి.డి.లుగా వెలువరించారు. ‘తెలంగాణ వీరగాధ – బతుకమ్మ పాట’ కు వేణుగోపాల్ రాసిన ముందుమాటను మీకందిస్తున్నాం.

ఇరాక్ లో సాగుతున్న నిరంతర మారణహోమానికి నిరసనగా  ఇరాకీ కవి సినాన్ అంటూన్ రాసిన కవితలకు ఇంద్రావతి చేసిన అనువాదాలు మూడింటిని ప్రచురిస్తున్నాం.

ప్రాణహిత మీది మాది మనందరిది. దీన్ని ప్రత్యామ్నాయ సాహిత్య వేదికగా తీర్చిదిద్దాలనేదే మా లక్ష్యం. ఇది నిరంతర సంభాషణ ద్వారానే సాధ్యమని మా నమ్మకం. ఈ సంచికలో ప్రచురించిన సాహిత్యం పై మీ నిర్మొహమాట అభిప్రాయాలని రాయండి. నిర్మాణాత్మక చర్చలో క్రియాశీలంగా పాల్గొనండి. ప్రాణహితను అక్కున చేర్చుకోండి.

2 అభిప్రాయాలు »సంపాదకీయం

2 Responses to “ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక ప్రాణహితకు స్వాగతం!”

  1. 1
    Pasunoori Ravinder Says:

    చక్కని ప్రయత్నం.
    ఫలించాలని ఆశిస్తున్నాను.
    ప్రచారాన్ని పెచండి.
    అందరికి తెలిసేల ఇప్పటికే నెట్ లో పేరున్న పత్రికల్లో ప్రాణహిత గురించి తెలియజేయండి.

  2. 2
    Jaabilli Says:

    మీ పత్రిక ప్రత్యామ్నాయ సాహిత్య వేదిక అన్నారు. దేనికి ప్ర్త్యమ్నాయా? సాహిత్యానికా? అయితే ఎలాంటి సాహిత్యానికి? రాజకీయాలకా? ఎలాంటి రాజకీయాలకు?
    చెరబండరాజ గారి గేయాలు ఆడియో లో వుంటె వెదికి మీ వెబ్ సైట్ లో వుంఛండి..
    మంచి సాహిత్యాన్ని అందిస్తారని ఆశిస్తాను.
    జాబిల్లి
    అమెరికా.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో