Jul2007
కొండలు పగలేసినం
కొండలు పగలేసినం
బండలనూ పిండినం
మానెత్తురు కంకరగా
ప్రాజెక్టులు గట్టినం
శ్రమ ఎవడిదిరో
సిరి ఎవడిదిరో
బంజర్లను నరికినం
పొలాలనూ దున్నినం
మా చెమటలు ఏరులుగా
పంటలు పండించినం
గింజెవడిదిరో
గంజెవడిదిరో
మగ్గాలను పెట్టినం
పోగు పోగు వడికినం
మా నరాలె దారాలుగా
గుడ్డలెన్నొ నేసినం
ఉడుకెవడిదిరో
వణుకెవడిదిరో
యంత్రాలను తిప్పినం
ఉత్పత్తులు పెంచినం
మా శక్తే విద్యుత్తుగ
ఫ్యాక్టరీలు నడిపినం
మేడెవడిదిరో
గుడిసెవదిరో
కారణాలు తెలిసినం
ఆయుధాలు పట్టినం
మా యుద్ధం ఆపకుండ
విప్లవాలు నడిపెదం
చావు మీదిరో
గెలుపు మాదిరో
6 అభిప్రాయాలు »కవితలు, క్లాసిక్స్
August 16th, 2007 at 2:43 am
ఇది చదువుతుంటె,
నేపధ్యంలో ఎవరో లయబద్దంగా పదాలను పాడుతున్న అనుభూతి……..
అద్భుత భావన…..
June 19th, 2010 at 12:50 am
ఈ పాటను పాడిన గద్దర్ ఆడియో ఫైల్ ఎవరివద్దనైనా ఉంటే తెలుపుతారని ఆశిస్తున్నాను.
rohihttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=zp-CmGLk8J2umnmwOAfcZto3Eld9sWIk2MZ7Ilq_j-8=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@yahoo.com
June 19th, 2010 at 11:56 am
లోకం పుట్టుక దేవుడెరుగు. కానీ ఈ లోకంలో దరిద్రాన్ని ఎవరు స్రుస్టీస్తారో రాజు చెప్పినాడు.
రాజు ని ఎవరూ మర్చిపోలేరు.
June 22nd, 2010 at 10:02 pm
కమ్యూనిస్ట్ మానిఫెస్టో కు తెలుగు పాట…
June 25th, 2010 at 3:21 am
చెరా నీ పేరు ఎన్నటికీ చెరిగిపోదు…!
నీ రాతలు మా గుండెల్లో పదిలం !!
-పసునూరి రవీందర్
June 29th, 2010 at 9:12 am
రాకేశ్ గారూ, మీరన్నది నిజం. ఈ పాట చదివినప్పుడంతా అలాగే అనిపిస్తుంది, మన వెనుక ఎవరో పాడుతున్న అనుభూతి కలుగుతుంది. కేవలం పదాలలో కాకుండా, భావాల్లోనే ఒదిగిపోయిన లయ. పాడడం రాకపోయినా, హృదయస్పందన వాద్యంగా, పాడుకోగలిగే గొప్ప గేయం. .