నన్నెక్కనివ్వండి బోను

Diksuchi - Chera
Diksuchi - Chera
నల్లకోట్లు నీలిరంగునోట్లతో
ఒక దేశం ఒక కోర్టులో
ఫైసలా అయ్యేకేసు కాదు నాది
నన్నెక్కనివ్వండి బోను


నలుగురి నమ్మికతో ‘అమ్మా’ అని పిలవటంతప్ప
నవమాసాలు మోసిందెవరో
ఎవరికైనా ఏమి తెలుసంటున్నాను
సృష్టికర్తనే వెక్కిరిస్తున్న పాపిష్టిని
మీలో మిమ్మల్ని ప్రశ్నించుకొమ్మంటున్నాను
అంటున్నాను అంటాను
అనుకుంటూనే వస్తున్నాను

మనిషిమీద నమ్మకం పోగొడుతున్న మీరు
దేవుడిమీద ప్రమాణం చేయమంటారెందుకు?
దోషికి నిర్దోషికి ఒకటే సూత్రం
వల్లించిందే వల్లించి వాదిస్తారు
ఫీజు కుడితి కుండలో
న్యాయాన్ని ఎలుకలా ముంచేస్తారు
మీ ఉద్యోగాలకు ప్రమాణాలేమిటి?
ఎక్కనివ్వండి నన్ను బోను

కలాలు కాగితాలు సర్దుకోండి
లా బుక్కుల్లో నా సందేహాలు వ్రాసుకోండి
న్యాయానికి దేశాలేమిటి? ఎల్లలేమిటి?
మనిషీ, రక్తం, ప్రాణం ముఖ్యం
లింగ భేదాలు వాదాలు తప్పితే
మందిర్ , మజ్జిద్, చర్చి,
మతాధికారుల మతాలు ఎందుకు?
ఆకలి, కామం, కలలూ, కన్నీళ్ళు
మనిషిలోని మర్మజ్ఞానమంతా ఒక్కటే
దేశమేదైతేనేం? మట్టంతా ఒక్కటే
అమ్మయెవరైతేనేం? చనుబాలతీపంతా ఒక్కటే
బిక్క ముఖాలతో చూస్తారేం?
పిచ్చివాణ్ణిగా కేసు పుటప్ చెయ్యండి
నన్నెక్కనివ్వండి బోను

తిన్నయింటి మర్యాదెంచని నాకు
బుద్ధుల్లో పెద్దల సహజాతాలేమై యుంటాయ్ ?
మంచి మనసు పరిమళాలు
విశ్వ వ్యాప్తి కాకపోవు
భావితరం గుర్తించకపోదు
జగత్ప్రళయ కావ్యంలో
తపనాగ్ని జ్వాల నిలుస్తోంది
అణువణువున అగ్నికణం
చల్లారక రగులుతోంది
నన్నెక్క నివ్వండి బోను

తీర్పు మీది జైలు మీది
భయపడతారెందుకు
మీ మనస్సౌధాలనిండా
తరగని తరతరాల బూజు
అనుక్షణం చచ్చే ప్రియత్వం
కాపురాల గోపురాలలో తిరిగే పావురాళ్ళారా!
నరుక్కోరెందుకు తలలు
గది నాల్గు గోడలు కూల్చివేసి
దిశలు నాల్గుగా మార్చుకోండి
ప్రపంచ పౌరులు కారెందుకు అప్పుడు?
నాకు తెలుసు
మీ రాత్రి చొక్కాలు పగళ్ళు నిలవవు
పగటి చొక్కాలు రాత్రుళ్ళుండవు
మీ పెళ్ళాలు పిచ్చివాళ్ళు
పాతిక చీరతో స్వర్గాన్ని కప్పుకొని
వంటగదిలో ఆలోచనలకు
ఎసర్లు పెడుతున్న వాళ్ళు
మీ వాగ్దానాలు పుచ్చుగింజలు
మీ బిడ్డలు కృత్రిమ నాగరికత షోలో
మోడల్ గా పనికొస్తున్న వాళ్ళు

ఛీ, ఛీ యెవరు మీరు?
నవ్వుతారెందుకు?
నీవు నేను కలిసి యెదుటివాని పిలుపుకు
‘మీరు’గాక ఏమౌతాం?
నీ గుండెలు నా గుండెలు
మూతబడిన కొండగుహలు
ఎక్కనివ్వండి నన్ను బోను

ఈ సువిశాల ప్రపంచ జీవశాలలో
సిసలైన న్యాయస్థానం యెక్కడైనా వుంటే
నన్నెక్కనివ్వండి బోను

నాగుండెలు పిండుకునే
కొండల్లాంటి సందేహాలు…
విశ్వశాంతి మన ధ్యేయం
యుద్ధాలకు పరిమితమా?
అబద్ధమా యీ వేదన?
మాంసం ముద్దలుగా మనుషులు
శిశువులుగా జన్మించుట ఏదేశంలో లేదు
ఏ దేశంలో నైతేనేమి?
అర్థరాత్రి పడగ్గదుల
అంతరార్ధమొకటేగదా !

ప్రపంచమొక నగ్నశిలా
ఫలకము వలె కనిపిస్తున్నది
భగవంతుడి అసలు పేరు నగ్నప్రియుడంటాను
అంటాను అంటున్నాను
అనుకుంటూనే వస్తున్నాను
నన్నెక్కనివ్వండి బోను

ఒక అభిప్రాయం »కవితలు, క్లాసిక్స్

One Response to “నన్నెక్కనివ్వండి బోను”

  1. 1
    B.S.RAJU Says:

    “Praanahita” naalo maruguna paduthunna CHERA jnaapakalaku thirigi praanam posindi.Naa eravayyo padilo Bengulurulo chaduvu muginchukuni parugu paruguna Digambara kavulanu kalavadaniki vachaanu hyderabaduku.Vedukaga telisindhi veeru sayamkalalappudu abids lo GPO keduruga irani hotello paina dorukutaarani.Hyderabad ki kotha.Vaallani vediki kalusukovadam o anubhuthi.
    Aaroju munduga nikhileswar, jwalamukhi kalisaru.Kugalinchu konnaru.Inthalo pallasandulu chuputhu premathonidina navvutho vachi cheyyi kalipado vyakthi.Parichayamayyaka kugalinchu kunnadu.Akkadanunchi virasam erpade varaku nityam eppudu sayamkalamuthundonani chuse vadini.veerini kalavadaniki.
    Eppudu banda baarina naa edalo dhukhanni nimpindi Pranahita..Nenu dhukkisthunnanu. Boruna vilapisthunnanu.Neenu entha adrusthavanthunno antha duradrusthavanthunni.
    Ennenni goppa parichayalu, sannihityalu.Amulya hrudayalu.Enthamandi nelakorigaru.
    Enthamandi tyagadhanulu.Veeri parichayalu goppa adrustam.Endarino aapthulanu goppa mitrulanu kolpoina Duradrustam.
    Tirigi velugu rekhalu chudagalugutu, dhukkani paradoluthu prajahita PRANAHITA ku naa cheyuta nivvadaniki santhosamga—–

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో