సెజ్‌లపై సమరగానం

ఈ నేలను సెజ్‌ల పేర అమ్మనిద్దమా?
పరదేశపు కంపెనీలకప్పగిద్దమా?
మన నెత్తురు మన నేలను కాల్వలుగా తడిపేసిన…
నందిగ్రామ్‌ సింగూర్లను సాగనిద్దమా?
మన భూములు శ్మశానంగా మారనిద్దమా? ||ఈ నేలను||

పాత జమిందార్ల మీద పోరు నడిపి సాధించిన
పోడు నరికి పొదలు కొట్టి మేడిపట్టి దున్నుతున్న
బంగారపు మన భూములు వదులుకుందమా?
నయా జమీన్‌దార్ల దాడి సాగనిద్దమా? ||ఈ నేలను||

పోర్చుగీసు, ఫ్రెంచి, డచ్చి, ఆంగ్లేయులు వరుసగొచ్చి
ఈ నేలను ముక్కలుగా తలకింతగా పంచుకొనిరి
ఈ దేశపు గత చరితను మరిచిపోదామా?
విదేశాల తొలి కుట్రలు సాగనిద్దమా? ||ఈ నేలను||

ఈస్టిండియా, డచ్చిండియా, ఫ్రెంచిండియా నాటి పేర్లు
హీరో హోండా, సలీమ్‌కో, ఎన్రానులు నేటి పేర్లు
గత రీతిన చొరబాట్లను అనుమతిద్దమా?
వలస నీతి విస్తరణకు తల ఊపుదుమా? ||ఈ నేలను||

జాహంగీర్ల చుట్టు తిరిగి వ్యాపారపు ఆజ్ఞ పొంది
మెట్టు మెట్లు గెదిగి తుదకి రాజ్యాన్నే ఏలినారు
మరోసారి గత ఎత్తులు పారనిద్దమా?
మన తాతలు తండ్రులోలె మోసపోదమా? ||ఈ నేలను||

మూట ముల్లె బేరగాళ్లు మన రాజుల చెంత చేరి
వ్యాపారపు అనుమతికై నక్కజిత్తులెన్నో జేసె
మరోసారి డ్రామాలను ఆడనిద్దమా?
ఈ కాలపు కొత్తెత్తులు సాగనిద్దమా? ||ఈ నేలను||

పరులనమ్మి గత రాజులు తమ రాజ్యాల్‌ కోల్పోయిరి
సెజ్‌లనమ్మి నేటి దొరలు గద్దెలపై తెగబలిసిరి
నయా వలస దేశంగా మారనిద్దమా?
మన రాజ్యం మరో ఇరాక్‌ అవ్వనిద్దమా? ఈ నేలను

నగ్జల్బరి గడ్డనుండి నందిగ్రామ్‌ పోరుదాక
ఎర్రజెండ ముసుగులోన రైతన్నల కాల్చిచంపె
ప్రజల చంపు సర్కారును ఏలనిద్దమా?
ఎర్రజెండ ముసుగు చించ కదలకుందుమా? ||ఈ నేలను||

భూమాతను నమ్మినోళ్ళు తల్లి ఒడిని విడువలేరు
లాఠీలతో తూటాలతో భూబంధం తెంచలేరు
మన నేలను కంపెనీలు మింగనిద్దమా?
రైతన్నలు కదమెత్తితే గెలవకుందుమా? ||ఈ నేలను||

సెజ్‌లంటే అక్షరాల మినీ వలస రాజ్యాలే
కుక్క చింపు విస్తరాకు ఈ దేశపు భవితవ్యం
కూలినాలి జనులందరు లేవకుందురా
దేశభక్తులంత తోడు నడవకుందురా ||ఈ నేలను||

భూమి మనది లేమి మనది కలిసి లేస్తె కలిమి మనది
జయం మనది భవిత మనది తిరగబడితె చరిత మనది
గురుగావుల సమరత్వపు జెండ పట్టరా |
నందిగ్రామ్‌ అమరత్వం గుండె నింపరా | ||ఈ నేలను||

బలం మనదిరా…. జయం మనదిరా….
భవిత మనదిరా…. చరిత మనదిరా ….

ఈ భూమి మనదిరా…. ఈ తల్లి మనదిరా….

3 అభిప్రాయాలు »పాటలు

3 Responses to “సెజ్‌లపై సమరగానం”

  1. 1
    chitanya Says:

    sez pai prasad rasina pata eppativaraku vacchina patalakanta chala parinithi chendinadiga undi, pata chadivite sez durmarga samskruti arthamavuthundi rachayitha ku viplava abinandanalu

  2. 2
    రాకేశ్ తెలంగాణ్ Says:

    ఏం జబర్-దస్త్ రాసినవన్నా……..
    ఈ పాట చదివి తరించాం.
    వినే అవకాశముందా?
    ఎవరైనా మంచి కంఠమున్నవాళ్ళు పాడదలుచుకుంటే,
    Sanchara Bookmart
    APHB – HIG – OG – BLOCK No 5
    Shop 5/29, Near Sundaraiah park
    Bagh lingampally
    Ph: 040 – 27679998 (Mr V . Shanker)
    వారిని సంప్రదించండి.
    నేను, తెలంగాణ సంబురాలప్పుడు వీళ్ళ CDs / Cassettes కొని, అడ్రెసు తీసుకున్నాను.

  3. 3
    ramulu Says:

    కాంగ్రేసాంధ్ర దొరలు, రాయలసేమరెడ్డి దొరలు, తెలుగు దేశపు కమ్మ దొరలు,సీపీఎమ్ చిన్నదొరలు అందరు అందరే. తెలంగాణను ముంచేటోల్లు,తెర్లు తెర్లు చేసినోళ్ళు.
    వీళ్ళే తెలంగాణ పాలిటి ఈస్టిండియా , డచ్చిండియా , ఫ్రెంచిండియాలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో