సినాన్ అంటూన్ కవితలు మూడు

మూలం : సినాన్ ఆంటూన్
అనువాదం: ఇంద్రావతి

సినాన్ అంటూన్ ప్రముఖ ఇరాకీ కవి. ప్రస్తుతం న్యూ యార్క్ లో నివసిస్తున్నాడు. మొదటి గల్ఫ్ యుద్ధం 1991 లో ప్రారంభమైనప్పటినుండీ యుద్దానికి వ్యతిరేకంగా తీవ్రమైన నిరసనతో, క్రోధంతో బలమైన కవిత్వం రాస్తూనే ఉన్నాడు. ఇరాక్ లో ని యుద్ధ బీభత్సం, కాలిపోతున్న శవాల గుట్టలూ, తల్లి కడుపులోనే చితికిపోయి విగతజీవులౌతున్న పసిపాపల ప్రేతాత్మలూ, యుద్ధ విధ్వంసాన్ని వినోదిస్తున్న నియంతలూ, పసిపాపల నెత్తురుతో కొత్తగా గీయ బడుతున్న ఇరాక్ దేశపటాలు సినాన్ అంటూన్ కవితల్లో గుండెల్ని మెలిపెడుతూ అత్యంత శక్తివంతంగా ప్రతిధ్వనిస్తాయి. రావణ కాష్టం లా మండుతూ, మరుభూమిలా మారిన ఇరాక్ లో యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉన్నది. నియంతల పైశాచిక నృత్యమింకా సాగుతూనే ఉన్నది. నికృష్ట నియంత బుష్ యుద్ధ దాహానికీ, ధన దాహానికీ అంతులేకుండా ఉన్నది. ఇరాక్ లో సాగుతున్న నిరంతర మారణ హోమానికి నిరసనగా ‘ప్రాణహిత’ సినాన్ అంటూన్ కవితలు మూడింటిని మీకందిస్తున్నది.

ఒక ఇరాకీ పసిపాప కోసం

ఓ పాపా
నీకు తెలుసా
నీ తల్లి చన్మొనలు
ఎండిపోయిన బొమికలని

తెలుసా నీకు
ఆమె స్థనాలు
అణుధార్మిక యూరేనియంతో
పొంగి పొర్లుతున్నాయని?

నీకు తెలుసా
నీ తల్లి గర్భం కిటికీలోంచి
కనుచూపు మేరా
నీ దేశపు భూమిని
ముష్కరులాక్రమించారని

తెలుసా నీకు
నీ రేపు కసలు రేపనేది లేదని
నీ రక్తం
నీ దేశపు కొత్త పటాలకు
సిరా గా మారిందని

నీకు తెలుసా
నీ తల్లి
నీరసమైన తన కదలికలని
నీకు విషాదగీతంగా అల్లుతుందని
అప్పుడే నిన్ను పోగొట్టుకున్న
దుఃఖం లో కనలుతోందని

సిగ్గు పడకు పాపా
నీ అంతిమ యాత్ర ఐపోయింది
కన్నీళ్ళు ఎండిపోయినై
అంతా వెళ్ళిపోయారు

ముందుకురా పాపా
చాలా తక్కువ దూరమేలే ఇది
ఆలస్యం చేయకు
నీ సమాధి
మాటి మాటికీ గడియారం కేసి
చూసుకుంటోంది

భయపడకు పాపా
నువ్వు కోరుకున్నట్టే
నీ బొమికలని
సమాధిలో పరుస్తాం
నీ పుర్రెను మాత్రం
పైన ఒక పువ్వులా
అలంకరిస్తాం

ముందుకురా పాపా
చాలా మంది
నీ స్నేహితులు
ఎదిరి చూస్తున్నారు
ఇంకా ప్రతిరోజూ
మరింత మంది
వచ్చిచేరతారు
… … …
మీ ప్రేతాత్మలన్నీ
కలిసి ఆడుకోవచ్చు
రా పాపా !

యుద్ధాలు

యుధ్ధం నన్ను
నిలువునా చీల్చినప్పుడు
ఒక కుంచె తీసుకుని
మృత్యువులో ముంచి
యుధ్ధం గోడ మీద
ఒక కిటికీ ని గీసా!

ఏదయినా దొరుకుతుందేమోనని
కిటికీ తెరిచి చూస్తే
మరో యుధ్దం కనబడింది

గర్భంలోనే చనిపోయిన
కొడుకు మీద
కప్పేందుకు కఫన్
అల్లుతూ ఒక తల్లి
కనబడింది

(న్యూ యార్క్ డిసెంబర్ 2003)

యుద్ధంలో తడిసిన గాజు పట్టకం

ఇది ఒక
విధ్వంసపు అధ్యాయం

ఇదే మన ఒయాసిస్

ఇక్కడే యుద్ధాలు
ఒక దాన్నొకటి కలుస్తాయి

క్రూర నియంతలు
మన కళ్ళ చుట్టూ గుమిగూడుతారు

సంకెళ్ళ వరండా లో
చప్పట్లు కొట్టేందుకు
ఇంకా కొంచెం జాగా ఉంది

రండి మెచ్చుకోలుగా
కరతాళధ్వనులు చేద్దాం

నగరపు కొవ్వొత్తులపైకి
మరో సాయంత్రం ఎగబాకుతుంది
రాత్రిని సాంకేతిక గిట్టలు
తొక్కి నలిపేస్తాయి
షార్ట్ వేవ్ మీద ప్రజలు
ఊచకోతకోయబడుతారు
మన స్థానిక రేడియో మాత్రం
అబద్ధాలు వాంతి చేసుకుంటుంది
మనని మెచ్చుకోలుగా
చప్పట్లు కొట్టమని ఆదేశిస్తుంది

మండుతున్న గొడుగు అస్తిపంజరంతో
మనమీ వానని స్వీకరిస్తాం
ఒక దేవుడు మన జండా మీద పడుకుని ఉంటాడు
మన దిగంతమ్మీద మాత్రం ప్రవక్తలుండరు
మనం చప్పట్లు కొడితే వస్తారేమో

రండి ప్రశంసిస్తూ చప్పట్లు కొడదాం

శవాలగుట్టల మీంచి లేస్తున్న పొగతో
మన పసిపాపలని ఉమ్మా కు ఆహ్వానిద్దాం
వాళ్ళ నాలికల మీద
మండుతున్న యుద్దగీతాలని దున్నుదాం
వాళ్ళ చెవుల్లో
యుద్ధనినాదాల ఓండ్రగింపుల్ని
ఆదాన్ చేద్దాం

వాళ్ళని
అనివార్య విధ్వంసంలో
కాలిపోతున్న తల్లుల చన్మొనల పక్కన
వదిలేసి
చప్పట్లు కొడదాం

నియంతలకోసం
ఒక హేమంతాన్ని అల్లే ముందు
మనమీ ముళ్ళతీగల నక్షత్రవీధులని
దాటుతూ

“నూతన యుద్ధ శుభాకాంక్షలు” అంటూ
నిరంతరం పాడుతూనే ఉండాలి!

( బాగ్దాద్ మార్చి 1991)

Click here to watch Sinan Antoon’s interview in Democracy Now.

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో