తగిన సమయంలోనే

బహుశ
తగిన సమయంలోనే మనం
గత కాలం గురించి మాట్లాడుకుంటున్నాం..
గత వర్తమానాల మీదుగా భవిష్యత్తు ఎలా వీస్తుందో..


బహుశ
తగిన సమయంలోనే మనం చరిత్రను తవ్వి తలకెత్తుకుంటున్నాం
ఒక వారసత్వాన్ని ఒక అమూల్య విలువని, రక్తంలో జీర్ణించుకున్న, ధ్వనిస్తున్న
జాతి జీవన సారాన్ని తగిన సమయంలోనే మననం చేసుకుంటున్నాం
సమీప గతం తెలియని ఒక తరం
విరిగి ముక్కలు ముక్కలవుతున్న ఒక తరం మనముందు కదిలిపోతూ ఉంది
ఒక పోరాట చరిత్రని
కొన్ని వేల సంవత్సరాల మానవ స్వేచ్ఛా ఆకాంక్షకి రూపం ఇచ్చిన ఘటనని
ఇప్పుడు దోసిట్లోకి తీసుకుని, అద్దంలోలా
మన ముఖ ప్రతిబింబాల్ని చూసుకుని కనుబొమలు దిద్దుకుంటానికో
గాలికి ఊగుతున్న అలకల్ని సర్దుకుంటానికో
విరిగిపోతున్న కలలకు ఒక సంజీవనీ స్పర్శ యివ్వటానికో

దేనికీ ఒక కేంద్రం కనబడటం లేదు
దేనికీ ఒక మూలం కనబడటం లేదు
దేనికీ ఒక ఆసరా కనబడటం లేదు
అంతా ఒక మట్టి కుండలా .. కాలని మట్టి కుండలా ఇసుక విగ్రహంలా
క్షణం సజీవంగా కనిపించి మరుక్షణం విరిగిపోతుంది
చేతివేళ్ళ సందుల్లోంచి జలమంతా జారిపోతుంది
ఒక్క బొట్టు నిలవటం లేదు
నోటి దగ్గరికి వచ్చే లోపల జారిపోతుంది
కలలు లేని ఊహలు
ఊహల స్వప్నాల్లేని రాత్రులు.. జీవధార ఎక్కడ?
గుక్కెడు నీళ్ళు తాగి పునర్జన్మ పొందటానికి
ఒళ్ళు విరుచుకొని మేల్కొంటానికి.. ఆయుధం అందుకుంటానికీ
చేతులెత్తి సూర్యుణ్ణో చంద్రుణ్ణో
ఎగిరే పక్షుల ఆకాశాన్నో
వేలవేల ఇంద్రధనుస్సుల రోదసినో కౌగిలించుకుంటానికి
జీవధార ఎక్కడ?

జీవధార ఇక్కడ..1857 కేంద్రంగా.. నది జన్మస్థలంగా..
చరిత్రని మలుపుతిప్పిన కేంద్రం దగ్గరే..
ఈ బిందువు వద్ద జన్మించినట్లు కన్పించినా
ఇది అంతకుముందు ఎప్పుడో ఎప్పుడో
మానవ ఊహ మొదలైన దగ్గరనుంచి కదులుతూనే ఉంది
కాలవలు కాలవలుగా పారుతూనే ఉంది

మనిషి పుట్టుక నది దగ్గరే
నది పుట్టుక మనిషి పుట్టిన దగ్గరే
మనిషి నిటారుగా నుంచున్నాడు
రాయందుకున్నాడు కాయను కొట్టాడు
రాయందుకున్నాడు క్రూర జంతువుల్ని వధించాడు
దోసిలి పట్టి నదిలో నీళ్ళు తాగాడు
నది తన వెంట నడచిరాగా
ఒక అనంత యాత్రకి నాంది పలికాడు
చరిత్ర ఒక నది మనిషి ఒక నది
మనిషి చరిత్ర ఒక ఆత్మార్పణాల చరిత్ర
నేడు
రక్త తర్పణాల చరిత్ర నీ ముందు నుంచుంది
కొన్ని వేల వీరుల కంఠాల తీగెల్ని మీటుకుంటూ
చెట్ల మీదుగా సూర్యోదయాల్ని వంచి
నీ ముందు పెట్టి ఒక మాట మాట్లాడమంటుంది
ప్రపంచం ప్రతిధ్వనించేట్టు ఒక పాట పాడమంటుంది
ఒక వందనాల పాట పాడమంటుంది
ఎక్కడో ఒక స్వార్ధపు చట్రంలో ఇరుక్కు పోయిన
నువ్వు బద్దలయ్యి బయటకు రావాల్సిందే
నదిలో మునగాల్సిందే మునిగి పునీతుడవై
జన సమూహాల్ని కౌగిలించుకోవాల్సిందే
నీ వేలుతెగి రక్తం కారుతుంది
కారుతున్న రక్తం నీ చరిత్ర
నీలో నినదించే శతకోటి సంవత్సరాల యుద్ధభేరీల
వీరుల కంఠాల ఉద్విగ్న చరిత్ర
చెట్టునుంచి ఒక్క ఆకు రాలుతుంది..అది నీ పుస్తకం
చెట్టునుంచి మరో ఆకు రాలుతుంది.. అది నీ అద్దం
నీ భుజమ్మీంచి జారి నీ వెనక జీరాడుతున్న చేలాంచలం

ఎన్ని తరాలు నీ వెనక ఎన్ని తరాలు నీ ముందు
చరిత్ర మధ్య ఇరుక్కున్న మనిషి ఒక వారధి
కాళ్ళు నేల్లోకి తల ఆకాశంలోకి విస్తరిస్తున్న మనిషి

బహుశా మాట్లాడాల్సిన సమయంలోనే మాట్లాడుతున్నాం
కేంద్రం కొన్ని వేల చీలికలుగా చీలిన సందర్భంలో
చరిత్ర గురించి మాట్లాడమంటే
నడచి వస్తున్న మనిషి గురించి మాట్లాడటమే

దట్టమైన మంచుపొరల తెరల్ని తొలిగించుకుంటూ
ఒక మనిషి నడిచి వస్తున్నాడు
ఒక సూర్యుడు నడిచి వస్తున్నాడు
తమలపాకుల్లాంటి ఒక ఆకు తెచ్చి నీ నోటికి అందించాడు
నములు, మననం చేసుకుంటున్నట్లు ఎక్కడెక్కడో లీనమైనట్టు
దేన్నో గుర్తుకు తెచ్చుకుంటున్నట్టు
వేల వేల యుగాల పాట వింటున్నట్టు నములు .. నమిలి

నెమరువేయి..నెమరువేయి..చరిత్రను నెమరువేయి..
నెమరువేయి…నెమరువేయి…చరిత్రను నెమరువేయి

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో