Jul2007
యువతరమా …
యువతరమా
నవతరమా
అదను ఇదే
కదిలి రమ్ము
బడులనుండి
గనులనుండి
నిరుద్యోగ
జడతనుండి
దుక్కి నుండి
ధూళి నుండి
భిక్షాటన
శిక్ష నుండి
యువతరమా
నవతరమా
ఇదే అదను
కదలి రమ్ము
దున్నేవాని
కే భూమి
దక్కాలని
ఒక్కటిగా
భూస్వాముల
పెట్టుబడీ
దారులపై
దాడులతో
వ్యవసాయక
విప్లవాన్ని
నెరెవేర్చగ
నడుంగట్టి
నవతరమా
అలసత్వం
వదిలిపెట్టి
కదలిరమ్ము
యువతరమా
దేశానికి
కండ్లు నీవె
కాళ్ళు నీవె
నిమిషమైన
వెనుదిరుగక
మునుముందుకె
సాగిపొమ్ము
గతకాలపు
ప్రేతాలయ
సంస్కృతులను
పూడ్చిపెట్ట
వర్తమాన
శ్రామికజన
యుద్ధంలో
ముందు నిలువ
నవతరమా
యువతరమా
తరంగమై
లేచిరమ్ము
సోషలిజం
స్వప్నసీమ
కానెకాదు
నిజం సుమా
ఆకలంత
సహజమది
అన్నమంత
అవసరమది
మానవాళి
ఉండువరకు
పెనుమంటల
తరం నీది
చారిత్రిక
కర్తవ్యం
నెరవేర్చే
విధి నీది
ఇదే ఇదే
సమయమిదే
హింసను ధ్వం
సించ రమ్ము
ఓటమైన
గెలుపైనా
బాధ్యత నీ
మీదె వుంది
నీ వెంటే
మా కన్నులు
నీ మీదే
మా ఆశలు
యువతరమా
నవతరమా
తుఫాను వలె
ఆగ్రహించు
లోహపాద
దౌర్జన్యం
అమాయకుల
హింసిస్తే
కసి రగిలే
క్షణాలందు
తూరుపు తెల
వారు నపుడు
మదిని మెదలు
యువతరమా
రమ్ము రమ్ము
రా రమ్మూ
నవ్వుతూ ఉరి
కంబమెక్కి
సమిష్టికై
చనిపోయే
పీడితజన
పక్షపాత
దృష్టికన్న
గొప్ప ఏది
నీ యవ్వన
తేజంతో
ప్రజాపోరు
నడపాలి
నీ రక్తం
పుష్పించగ
ఈ దేశం
ఫలించాలి
యువతరమా
నవతరమా
ఇదే అదను
కదలి రమ్ము
ఒక అభిప్రాయం »క్లాసిక్స్, పాటలు
September 6th, 2007 at 4:49 am
భారత దేశంలో ఈ దౌర్భాగ్య వ్యవస్థ ఉన్నన్నాళ్ళు ఈ పాట ఎప్పటికీ చిరంజీవే.
చెర కు మరణం లేదు.