August 2007 సంచిక

ఆగస్టు సంచిక

సూచిక:

  • కవిత: సందర్భం ఒక్కటే – వేముగంటి మురళి
  • కవిత: బేమాన్‌! – జూకంటి జగన్నాథం
  • కవిత: ఎప్పుడైనా ఎక్కడైనా – నారాయణ స్వామి
  • కవిత: పద్యం పుట్టుక గురించి మళ్ళా …! – అఫ్సర్
  • కవిత: బాదం చెట్టు – ఎస్. జయ
  • కవిత: అతడు c/o ఆమె – పసునూరి రవీందర్ మొత్తం చదవండి »
  • అభిప్రాయాలు లేవు »సూచిక

    ఆగస్టు – 07 సంచిక

    ప్రాణహిత ఆగస్టు సంచికకు స్వాగతం. మా జూలై సంచికను సహృదయంగా ఆదరించి, మాకు విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందించిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంచనాలకు అనుగుణంగానే ఆగస్టు సంచిక మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం. మొత్తం చదవండి »

    అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

    సందర్భం ఒక్కటే

    సంఘటనలనేకం
    సందర్భం ఒక్కటే
    నందిగ్రాం అయినా ముదిగొండ అయినా
    వల వేసి మనుషులని కమ్మిండ్రక్కడ
    రక్తం మడుగులో కొట్టుకుంటున్న
    పావురాలిక్కడ మొత్తం చదవండి »

    2 అభిప్రాయాలు »కవితలు

    బేమాన్‌!

    మనసంతా గాలిగాలి
    బతుకంతా గోసగోస

    లోకులు మెచ్చేదేంది
    కాకులు ఇచ్చేదేంది
    మొత్తం చదవండి »

    10 అభిప్రాయాలు »కవితలు

    ఎప్పుడైనా ఎక్కడైనా

    ఎప్పుడైనా
    ఎక్కడైనా
    భూమే సమస్య

    సమస్యల్లా భూమిదే మొత్తం చదవండి »

    4 అభిప్రాయాలు »కవితలు

    పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

    1

    కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
    దాన్ని కప్పేశాం, గుర్తుందా?
    మరీ చిన్నప్పటి సరదా కదా,
    గుర్తుండి వుండదులే! మొత్తం చదవండి »

    3 అభిప్రాయాలు »కవితలు

    బాదం చెట్టు

    వరండాలో నిలువుగాళ్ళపై నిలబడి
    ఎండకు, వానకు చలించక కాపలా కాస్తోంది
    దగ్గరకెళితే చాలు చల్లని నగవులతో స్వాగతిస్తుంది
    ఆకుపచ్చని గొడుగు పట్టి మొత్తం చదవండి »

    అభిప్రాయాలు లేవు »కవితలు

    అతడు c/o ఆమె

    అతడు నవ్వితె
    ఆమె తన బతుకంత
    పున్నమైనట్టు వెలిగింది. మొత్తం చదవండి »

    8 అభిప్రాయాలు »కవితలు

    జర్నలిస్ట్ గా కుటుంబరావు

    Kodavatiganti Kutumba Rao
    Kodavatiganti Kutumba Rao
    1949లో ఒకరోజు ఉదయాన నేను పుట్టినప్పుడు మా నాన్న కొడవటిగంటి కుటుంబరావు ఆంధ్రపత్రిక డెయిలీలో నైట్ షిఫ్టులో పనిచేస్తున్నారట. నాకు ఊహ తెలిసినప్పటినుంచీ మాత్రం చివరిదాకా ఆయన ఉద్యోగం చందమామలోనే. కాల్పనిక, కాల్పనికేతర సాహిత్యాన్ని రచించిన వ్యక్తిగా మా నాన్నగారి గురించి చాలామందికి తెలుసుగాని పత్రికాసంపాదకుడుగా తెలియదు. మొత్తం చదవండి »

    9 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

    పత్రికలను ఆధునికీకరించిన జర్నలిస్టు

    దాదాపు యాభై ఏళ్ళు నిరాఘాటంగా రచనా వ్యాసంగం సాగించిన కొడవటిగంటి కుటుంబరావు గురించి తెలుగు పాఠకలోకానికి కథకుడు, నవలాకారుడు, విమర్శనాత్మక వ్యాసరచయితగా తెలుసుగాని, తెలుగులో వార, మాస పత్రికలకు అధునాతనమైన రూపురేఖలు తీర్చిదిద్దిన సంపాదకునిగా తెలియదు. మొత్తం చదవండి »

    4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

    పెళ్ళి – వ్యవహారం

    ఇంటికి చేరే సమయానికి సులోచన దడ ఇంకా సాంతం పోలేదు. ఆమె పాదాలూ, మోకాళ్ళూ ఇంకా బలహీనంగానే ఉన్నాయి. చేతుల తిమ్మిరిలు పోతూ వస్తూ ఉన్నాయి. తననుచూసి ఎంతమంది ఏమనుకున్నారో ఊహించుకోవటానికి కూడా ఆమెకు ధైర్యం చాలలేదు. మొట్టమొదటిసారిగా ఆడది దొంగతనమో, వ్యభిచారమో, తాగటమో చేస్తే తనకున్న స్థితే ఉంటుందా అని ఆమె ఆశ్చర్యపడింది. మొత్తం చదవండి »

    6 అభిప్రాయాలు »కథలు, క్లాసిక్స్

    భూమి దు:ఖం

    ఎంత ఆపుకుందామన్నా సుందరయ్యకు దు:ఖమాగడం లేదు. కన్నీళ్ళు ఎక్కడనుండి ఎగదన్నుకొస్తున్నాయో… గొంతు దగ్గరపడి… ఉక్కిరి బిక్కిరైపోతూ, సుడిగాలిలో ఒట్టి కాగితపు ముక్క వలె… కడుపులో ఎవరో చేతులుపెట్టి ఊర్చేస్తున్నట్టు… నాభి దగ్గర్నుండి ఏడుపు పొంగి పొంగి… తమాయించుకోవడం వశం కావడంలేదు సుందరయ్యకు. మొత్తం చదవండి »

    3 అభిప్రాయాలు »కథలు

    పాలపుంత

    “నందూ! మనం చూద్దామనుకున్న జాగర్స్‌ పార్క్‌ జీటీవిలో వస్తోంది చూడు.”
    “అవునా? నువ్వేం చేస్తున్నావిపుడు?”
    “నీతో మాట్లాడుతున్నా”
    “అబ్బో! జోకా?”
    “పో… పోవోయ్‌ ఇంటి కెళ్లి సినిమా చూడు.” మొత్తం చదవండి »

    అభిప్రాయాలు లేవు »కథలు

    జహానుమా గల్లీ నంబర్‌ దో

    ”దుబయ్‌ల మస్తు జాయ్‌దాద్‌ ఉన్నది. నీ బేటీ సుఖపడ్తది లక్ష ఇస్తనంటున్నడు. ఒక మహీన అయినంక తను దుబయ్‌ పోయి పిల్లను పిలిపించుకుంటడు. ఫికరు చెయ్యకు ఆయెనకు బీవీ లేదు చచ్చిపోయింది. పది, పన్నెండేళ్ళ పోరగాళ్ళిద్దరున్నరు గంతే, ఇంగ నీ ఇష్టం” ఖాజీ సులేమాన్‌ ఫాతిమాబేగం ఇచ్చిన చాయ్‌ బిస్కట్ల మజా అనుభవిస్తా చెప్తున్నడు. మొత్తం చదవండి »

    2 అభిప్రాయాలు »కథలు

    విశాల ప్రజాస్వామిక సాహిత్య వేదిక అవసరం ఎంతైనా ఉంది – నిఖిలేశ్వర్

    Nikhileshwar
    Nikhileshwar
    “ప్రజాస్వామిక విప్లవం కోసం కృషి చేసేటందుకు
    విశాల ప్రాతిపదిక పై సాహిత్య వేదిక ఏర్పడాలి”
    - – - – - – -
    “దిగంబర కవిత్వం సామూహిక సృష్టి –
    ఏ ఒకరూ నాయకుడు కానీ ప్రయోక్త కానీ కాదు”

    మొత్తం చదవండి »

    ఒక అభిప్రాయం »ఇంటర్‌వ్యూలు

    కథ 2006 – ఒక సమీక్ష

    Katha - 2006 Cover page
    Katha - 2006 Cover page
    కథాసాహితి వారు ప్రచురిస్తున్న వార్షిక కథా సంకలనాల్లో ఇటీవలి రెండు మూడు సంకలనాల గురించి, “అబ్బ, ప్రతీ కథలోనూ సమస్యలూ, కష్టాలూ, ఆకలిచావులూ అంటే భరించడం కష్టమండీ,” అన్న ఫిర్యాదు విన్నాను. కథ 2006 సంకలనంలో చోటు చేసుకున్న కథలు ఆ ఫిర్యాదుకి మంచి సమాధానమివ్వగలవు. మొత్తం చదవండి »

    2 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

    పారిస్ రివ్యూ – పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ

    పారిస్ నుండి వెలువడే ప్రముఖ సాహిత్య పత్రిక పారిస్ రివ్యూ అనేక మంది ప్రసిద్ధి చెందిన రచయితలను, కవులనూ ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచ సాహిత్య రంగంలో ఈ ఇంటర్వ్యూలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ మహాకవి పాబ్లో నెరూడా ను పారిస్ రివ్యూ తరఫున రీతా గ్యూబర్త్ ఇంటర్‌వ్యూ చేసింది. దానికి ఆమె రాసిన ఉపోద్ఘాతం ఇది. మొత్తం చదవండి »

    ఒక అభిప్రాయం »అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం

    Next »