ఆగస్టు – 07 సంచిక

ప్రాణహిత ఆగస్టు సంచికకు స్వాగతం. మా జూలై సంచికను సహృదయంగా ఆదరించి, మాకు విలువైన అభిప్రాయాలను, సలహాలను, సూచనలను అందించిన మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. మీ అంచనాలకు అనుగుణంగానే ఆగస్టు సంచిక మీ ముందుకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నాం.

జూలై నెలలో తెలుగు నేలపై సభ్య సమాజం సిగ్గుతో తలవంచుకునే అత్యంత దారుణమైన సంఘటన జరిగింది. తెలుగు నేల రక్తసిక్తమయ్యింది. 2000 ఆగస్టు 28 నాడు జరిగిన బషీర్ బాగ్ కాల్పుల గాయాలు తెలుగు ప్రజల స్మృతిపథం లోంచి చెరిగిపోక ముందే ఈ జూలై 28 న ఖమ్మం జిల్లా ముదిగొండలో ప్రస్తుత ప్రభుత్వం నెత్తురు పారించింది. నిలువ నీడ కోసం జానెడు భూమినడిగిన పేద ప్రజల పై, అధికారంతో, డబ్బుతో గుడ్డిదైన ప్రభుత్వం గ్రే హౌండ్స్ ని ఉసిగొల్పి ఏకే 47 లతో విచక్షణా రహితంగా, నిర్దాక్షిణ్యంగా కాల్పులు జరిపింది. ఆరుగురు బక్క ప్రాణులను పొట్టన పెట్టుకుని మరెందరో మందిని క్షతగాత్రులను చేసింది. సరిగ్గా రెండు నెలల కిందనే, పశ్చిమ బెంగాల్లో నందిగ్రాం లో సెజ్ లకు (Special Economic zones) కు వ్యతిరేకంగా భూమికోసం పోరాడిన రైతులపై అక్కడి ప్రభుత్వమూ కాల్పులు జరిపి పేదరైతులను పొట్టన బెట్టుకుంది. పార్టీలు వేరైనా ప్రభుత్వమొక్కటే అనీ, అధికారం పడగ నీడ ఒక్కటే అనీ నిరూపించుకున్నది. సమకాలీన సంఘటనలపై, సామాజిక విషాదాలపై వెనువెంటనే స్పందించి, వాటికి కారణాలను శోధిస్తూ పేదప్రజల పక్షం వహించే తెలుగు సాహిత్యం, ముదిగొండ సంఘటనపై ధర్మాగ్రహాన్ని ప్రకటించింది. ముదిగొండలో పోలీసుల దాష్టీకానికి బలైన పేద రైతులకు ప్రాణహిత అశ్రు నివాళులర్పిస్తున్నది. ప్రపంచ బాంకుకూ, ప్రపంచీకరణకూ మన దేశం భూముల్నీ, పల్లెల్నీ తాకట్టు పెడుతున్న ప్రభుత్వాల స్వభావం ఆ నాడు బషీర్ బాగ్ నుండి ఈ నాడు ముదిగొండ దాకా ‘ఎప్పుడైనా ఎక్కడైనా’ ‘సంఘటనలు వేరైనా సందర్భం ఒక్కటే’ నంటూ ఎలుగెత్తే రెండు కవితలని ఈ సంచికలో మీకందిస్తున్నాం. అట్లే సెజ్ ల సాలెగూళ్ళలో, డబ్బుల మాయాజాలంలో చిక్కి పేద రైతుల కుటుంబాలూ, జీవితాలూ ఎట్లా విచ్ఛిన్నమవుతున్నయో రామా చంద్రమౌళి కథ ‘భూమి దుఃఖం’ లో చదవండి.

ఈ నెల 17 ప్రఖ్యాత రచయిత కొకు (కొడవటిగంటి కుటుంబరావు) వర్ధంతి. తెలుగు సాహిత్యంలో కొకు ఒక మేరు పర్వతం లాంటి వారు. వేల సంఖ్యలో కథలు, నవలలు, వ్యాసాలు, సైన్సు వ్యాసాలు రాసి తన జీవితాంతమూ సాహిత్యంలో ప్రజాస్వామిక విలువలకోసం కృషి సలిపిన కొకు, పిల్లల పత్రిక చందమామ కు సంపాదకత్వం వహించారు. 1970 లో ఏర్పడ్డ విరసంలో సంస్థాపక సభ్యులలో ఒకరు. ఎక్కడున్నా ప్రజాస్వామిక, శాస్త్రీయ విలువలకోసం నిర్విరామంగా రచన చేసిన కొకు ను జర్నలిస్టుగా పరిచయం చేస్తూ, కొడవటిగంటి రోహిణీ ప్రసాద్ రాసిన వ్యాసాన్ని, సూరంపూడి సీతారాం రాసిన వ్యాసాన్నీ మీ కందిస్తున్నాం. దాదాపు యాభై ఏళ్ళకిందే, స్త్రీ పురుష సంబంధాల్లో నేటికీ ఆశ్చర్యం కలిగించే విప్లవాత్మక భావాలని ప్రకటిస్తూ కొకు రాసిన ‘పెళ్ళి వ్యవహారం’ కథ ఈ సంచికలో పొందు పరుస్తున్నాం. తెలుగు సాహిత్యంలో కొకు లాంటి విజనరీ మరొకరు కనబడరు అంటే అతిశయోక్తి ఎంతమాత్రమూ కాదు. ఆయన మహోన్నత సాహితీ వ్యక్తిత్వానికి ప్రాణహిత వినమ్ర నివాళులర్పిస్తున్నది. 2009 అక్టోబర్ లో కొకు శతజయంతి. తెలుగు సమాజం, సాహిత్యం ఘనంగా జరుపుకోవల్సిన సందర్భం. అటు కాల్పనిక సాహిత్యంలోనూ ఇటు విశ్లేషణా సాహిత్యంలోనూ అసమాన శిఖరాలు అధిరోహించిన ఆ మహారచయిత శతజయంతి సముచితంగా జరపడానికి అందరమూ సన్నద్ధమవుదాం.

తెలుగు నేలపై ఉధృతంగా జరుగుతున్న తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్నీ, 610 జీవో అమలుకు జరుగుతున్న ఉద్యమాన్నీ శక్తివంతంగా ప్రకటించిన జూకంటి జగన్నాథం కవిత ‘బేమాన్’ ను ప్రాణహిత మీ కందిస్తున్నది. అట్లే పద్యం పుట్టుక గురించిన అఫ్సర్ కవితనూ, ‘బాదం చెట్టు’ జయ కవితనూ, స్త్రీ పురుష సంబంధాలను సున్నితంగా ప్రకటించిన రవీందర్ రాసిన ‘ అతడు c/o ఆమె’ నూ మీకందిస్తున్నాం.

దుర్భర పేదరికంలో మగ్గుతున్న ముస్లిం కుటుంబాల్లో, బుధ్ది తెల్వక ముందే ఆడ పిల్లలని దుబాయి షేక్ లకు అంటగట్టి నరకంలోకి తోసేస్తున్న అత్యంత దయనీయమైన స్థితిని చిత్రించే కథ గీతాంజలి రాసిన కథ ‘జహానుమా గల్లీ నంబర్ దో’. ముస్లిం కుటుంబాల్లోని స్థితిగతులనీ, సంస్కృతినీ సమర్థవంతంగా పట్టుకున్న ఈ కథను మీ కందిస్తున్నాం. అట్లే దురదృష్టకరమైన పరిస్థితులలో కూడా ఒకరికొకరు తోడై, ప్రేమతో ఆత్మ విశ్వాసంతో సమాజాన్ని ధిక్కరించి జీవించవచ్చు అని చెప్పే సత్యవతి కథ ‘పాలపుంత’ ను ఈ సంచికలో చదవండి.

1960 లలో తెలుగు సాహిత్యాన్నీ, సమాజాన్నీ షాక్ ట్రీట్‌మెంట్ తో ఒక్క కుదుపు కుదిపిన దిగంబర కవుల్లో ఒకరైన నిఖిలేశ్వర్ కవిగా రచయితగా ఈ నాటికీ సాహితీ ప్రస్థానం కొనసాగిస్తున్నారు. ఆయనతో ప్రాణహిత అనేక విషయాలు ముచ్చటించింది. ఆనాటి దిగంబర కవిత్వాన్ని ఈ తరం వారికి పరిచయం చేసే ఉద్దేశ్యం తోనూ, ప్రస్తుత పరిస్థితుల్లో రచయితలు నిర్వహించాల్సిన పాత్ర ను చర్చించడానికీ నిఖిలేశ్వర్ తో మా ముచ్చట్లను మీ ముందుంచుతున్నాం.

తెలుగులో వస్తున్న మంచి కథలను ఒక చోట చేర్చి సంకలనంగా, గత 17 ఏళ్ళు గా ప్రతి ఏటా క్రమం తప్పకుండా కథాసాహితి మనకందిస్తున్నది. కథా నవీన్ గా పేరుపొందిన వాసిరెడ్డి నవీన్, ప్రముఖ విమర్శకుడు, కవీ పాపినేని శివశంకర్ ఈ సంకలనాలకు సంపాదకత్వం వహిస్తున్నారు. జూన్ నెలలో బెంగళూర్ లో ఆవిష్కరించబడ్డ “కథ 2006” పై ఎస్.నారాయణస్వామి రాసిన పరిచయ సమీక్షను ఈ సంచికలో మీ కందిస్తున్నాం.

20వ శతాబ్దానికే మహాకవి పాబ్లో నెరూడా ను పారిస్ రివ్యూ పత్రిక తరఫున రీతా గ్యూబే చేసిన ఇంటర్‌వ్యూను, అట్లే నెరూడా రాసిన ఒక కవితకు సుధాకిరణ్ చేసిన అనుసృజననూ ప్రపంచ సాహిత్యంలో మీ కందిస్తున్నాం.

ప్రముఖ సాహితీ విమర్శకులు కడియాల రామ్మోహనరాయి, నవోదయ సంస్థ అధిపతి రామ్మోహనరావు, వాసిరెడ్డి నవీన్ లతో డెట్రాయిట్ సాహితీ సంఘం జూలై 22 న నిర్వహించిన సాహితీ సమావేశం వివరాలు సాహితీ వార్తల్లో చదవండి.

ప్రాణహిత ఆగస్టు సంచికను చదివి, మీ మిత్రులతో పంచుకుని, ఆదరిస్తారని మా ఆకాంక్ష. ఈ సంచికలో రచనలపై మీ అభిప్రాయాలను ప్రకటించి, ఒక నిర్మాణాత్మక, ప్రజాస్వామిక చర్చ జరిగేందుకు తోడ్పడాలని మా సవినయ విన్నపం.

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో