ఎప్పుడైనా ఎక్కడైనా

ఎప్పుడైనా
ఎక్కడైనా
భూమే సమస్య

సమస్యల్లా భూమిదే

కడుపుకింత కూడైనా
చావుకింత నేలైనా
సమస్యంతా భూమిదే

నందిగ్రాం ముదిగొండ
ఇవ్వాళ్టి నామవాచకాలు

భూమి ఒక్కటే ఎప్పుడూ సర్వనామం

భూమి కోసం చిందిన నెత్తురూ కన్నీళ్ళే
నిరంతర చారిత్రిక ప్రయాణాలు

నాలుగు చినుకులు రాలితే
పది విత్తనాలై పగిలేది
భూమే

పది కన్నీటి బొట్లు చిందితే
వేల ఆగ్రహాలై రగిలేది
భూమే

జూలై ఇరవై ఎనిమిది
కాలం గద్ద నోట చిక్కిన
కోడి పిల్ల

చనిపోయిన వారూ
గాయపడ్డ వారూ
అంటూ వార్తలు మోసుకొచ్చిన
విషాదం వెనుక
తెర తీయని అర్థసత్యాలు

అవును భూమి ఎప్పుడూ సమస్యే

ఆరుగాలం ఆరుబయటే
ఎండినోళ్ళు
నిలువనీడ నడగడం
నిజంగా శాంతిభద్రతల
సమస్యే

నలుగురు కలిసి జట్టుగా
నాలుగడుగుల జాగ కోసం నిలబడడం
కాల్చిపారేసేటంత నేరమే

పాదయాత్ర చేసిన మేరా
ఈ భూమంతా నాదనుకునేవాడొ
దేశదేశాలు దాటి
ఊళ్ళకూళ్ళు దత్తత నిచ్చిన వాడో

ప్రభువెవడైనా ఒక్కడే !

పావుల్లా జెండాలు మోయించినా
పిట్టల్లా టపా టపా కాల్చేసినా
పాలక పడగ నీడ
కౌటిల్యం ఒక్కటే!

అయిన వాళ్ళని కోల్పోయిన
భూమిలేని బక్క ప్రాణుల దుక్కం 
పెట్టే  శాపనార్థాల ఉసురూ
ఎక్కడైనా ఒక్కటే!

4 అభిప్రాయాలు »కవితలు

4 Responses to “ఎప్పుడైనా ఎక్కడైనా”

  1. 1
    pasunoori ravinder Says:

    అద్భుతమైన ఆగ్రహానికి అభినందనలు.

  2. 2
    Aranya Krishna Says:

    కవిత చాలా బలంగా ఉన్నది. ‘నందిగ్రాం ముదిగొండ ఇవ్వాళ్టి నామవాచకం, భూమి ఒక్కటే ఎప్పుడూ సర్వనామం’ అన్న వ్యక్తీకరణ బాగున్నది.

  3. 3
    bhasker koorapati Says:

    Dear swami,
    I have read ur poem, eppudaina… I was spell bound and taken a back.There is literally powerful poetic tinge in it.U r the same swami of hyderabad. U have sharpened ur pen further. U have put ur heart’s blood into the poem. Hats off to ur poetic expression.I have no words to express my feelings. perhaps words r powerless..I have read all the magazines in one sitting.Infact I feel very happy to have come by pranahita..

  4. 4
    GURRAM SEETARAMULU Says:

    naaku mallee KALLO LA KAL LA MAGHAM gurtuku vastundi
    ennallaku tappipoyina koduku vachhinatlundi
    aa agrhame kaa vaali ippudu
    poraataalaku andolanalaku haddulu chripina kautalya neeti ni baddalu kottali
    ennadu leni innella BHUUMI SAMASYA ippudela gurtochi maruguna paddado nila deeyaali
    ప్రజాకళ కు ధన్య వాదాలు
    ముక్యమ్ గా మా SWAMY gaariki

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో