పారిస్ రివ్యూ – పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ

పారిస్ నుండి వెలువడే ప్రముఖ సాహిత్య పత్రిక పారిస్ రివ్యూ అనేక మంది ప్రసిద్ధి చెందిన రచయితలను, కవులనూ ఇంటర్వ్యూ చేసింది. ప్రపంచ సాహిత్య రంగంలో ఈ ఇంటర్వ్యూలు అత్యంత ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. ఇందులో భాగంగా ప్రఖ్యాత లాటిన్ అమెరికన్ మహాకవి పాబ్లో నెరూడా ను పారిస్ రివ్యూ తరఫున రీతా గ్యూబర్త్ ఇంటర్‌వ్యూ చేసింది. దానికి ఆమె రాసిన ఉపోద్ఘాతం ఇది.

పాబ్లో నెరూడా – ఇరవయ్యవ శతాబ్దంలో అత్యంత ప్రసిద్ధి గాంచిన లాటిన్ అమెరికన్ కవి – జూలై 12 1904 న రికార్డో నెఫ్తాలి రేయిస్ బసాల్టో గా జన్మించాడు. అతను పుట్టి నెల తిరగక ముందే అతని తల్లి క్షయ వ్యాధితో కనుమూసింది. నెరూడా తండ్రి మళ్ళీ పెళ్ళి చేసుకుని కుటుంబాన్ని పర్రాల్ అనే చిన్న పట్నం నుండి దక్షిన చిలీ లోని టెమూకో కు మార్చాడు. అక్కడ ఆయన రైలు టికెట్ కండక్టర్ గా పని చేసాడు. చిన్నప్పుడే నెరూడా కవిత్వం రాయడం ప్రారంభించాడు. తన యుక్త వయసులోనే నెరూడా అనే కలం పేరు నిర్ణయించుకున్నాడు. నెరూడా కవిత్వం రాయడాన్ని వాళ్ళ తండ్రి తీవ్రంగా వ్యతిరేకించే వాడు. నెరూడా సెకండరీ విద్య అయిపోగానే చిలీ రాజధాని శాంటియాగో కు మారాడు.

1924 లో ‘ఇరవై ప్రేమ కవితలు – ఒక విషాద కవిత’ అనే కవితా సంకలనం ప్రచురణతో నెరూడా కవిగా సుప్రసిద్ధుడయ్యాడు. అతని ఇరవై ఏళ్ల వయసులో ప్రచురించబడ్డ ఆ సంకలనం ఇప్పటికీ అతని అత్యంత ప్రసిద్ధమైన పుస్తకం. పేదరికంతో తీవ్రమైన ఇబ్బందులకు గురయిన నెరూడా 1927 లో బర్మాలో చిలీ దేశపు రాయబార కార్యాలయంలో ఉద్యోగం చేయడానికి ఒప్పుకున్నాడు. ఆసియా లో ఐదేళ్ళున్న నెరూడా తీవ్రమైన నైరాశ్యానికి, ఒంటరి తనానికి లోనయ్యాడు. 1934 లో నెరూడా మెడ్రిడ్ లో పనికి నియమించబడ్డాడు. అక్కడ అతను తన తరం స్పానిష్ కవుల చేత కొనియాడ బడి గొప్ప ప్రాచుర్యం పొందాడు, లోర్కా, రాఫేల్ ఆల్బర్టి తదితర స్పానిష్ కవుల సాన్నిహిత్యంలో నెరూడా ఫాసిస్టులను తీవ్రంగా వ్యతిరేకించాడు. స్పైన్ అంతర్యుద్ధం ప్రారంభం లో రిపబ్లికన్ల కోసం నిలబడ్డాడు. అతని క్రియాశీలక పాత్ర చూసి 1937 లో చిలీ కి తిరిగి రమ్మని ఉత్తర్వులు జారీ చేయబడ్డాయి.

1939 నుండి 1943 వరకు నెరూడా మెక్సికో లో నివసించాడు. తర్వాత చిలీ కి తైరిగి వచ్చిన నెరూడా రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర వహిస్తూ కమ్యూనిస్టు పార్టీలో చేరాడు. దాదాపు నలభయ్యవ దశాబ్దం అంతా నెరూడా ప్రవాసంలో గడిపాడు. చివరకు 1952 లో చిలీ లో స్థిర నివాసమేర్పరుచుకున్నాడు. నిరంతర కవితా వ్యవసాయం చేస్తూ అద్భుతమనిపించే రీతిలో కవిత్వం రాసాడు. 1950 లో ఎస్త్రావగారియో 1959లో నూరు ప్రెమ కవితలు రాసాడు.

ఎన్ని ఇబ్బందులు, అవాంతరాలు ఎదురయినా నెరూడా కమ్యూనిస్ట్ సిద్ధాంతాలు వదిలి పెట్టలేదు. జీవితాంతం కమ్యూనిజం మాట్లాడుతూనే ఉన్నాడు. చిలీ కమ్యూనిస్టు పార్టీ తరఫున అధికార అభ్యర్థిగా 1970 లో ఎన్నికల్లో నిలబడ్డాడు. అయితే తన మిత్రుడు సాల్వడార్ అయెందీ కి మద్దతుగా పోటీ నుండి విరమించుకున్నాడు.

1971లో నెరూడా కు అత్యంత ప్రతిష్టాత్మకమైన నోబెల్ బహుమతి లభించింది. తన చివరి రోజుల్లో ‘జ్ఞాపకాలు’ పూర్తి చేసాడు. అయెందీ ప్రభుత్వాన్ని కుట్రపూరితంగా మిలటరీ తిరుగుబాటులో కూలిపోయిన తర్వాత కొద్ది రోజులకే అయెందీ ని సమర్థించాడన్న సాకుతో నియంతృత్వ ప్రభుత్వం అవసరమైన వైద్య సదుపాయం నిరాకరించడం వల్ల ఈ శతాబ్దానికే మహా కవి నెరూడా మరణించాడు.

—————–

1969 సెప్టెంబర్లో చిలీ అధ్యక్ష పదవికి కమ్యూనిస్టు పార్టీ అధికార అభ్యర్థిగా ఎన్నుకోబడ్డ తర్వాత నెరూడా ప్రసంగిస్తూ “ నా జీవితం కవిత్వమూ రాజకీయాలూ అని విభజించి నేనెప్పుడూ చూసుకోలేదు. నేను ప్రదానంగా చిల్లీ దేశ పౌరుడను. దశాబ్దాలుగా మన దేశ ప్రజల కష్ట నష్టాల్లో సుఖ దుఃఖాల్లో, మన జాతి నిలబడడం కోసం జరుపుతున్న సమరంలో అంతర్భాగమైన వాడిని. నేను ప్రజలకు అపరిచితుడను కాను. వాళ్ళలో ఒకణ్ణి . వాళ్ళ నుండి వచ్చిన వాడిని. వాళ్ళలో అవిభాజ్యమైన భాగాన్ని. కష్టజీవుల కుటుంబం నుండి వచ్చిన వాడిని. నేను అధికారంలో ఉన్న వారి వైపు ఎప్పుడూ లేను. ఎప్పుడూ అధికారాన్ని సమర్థించ లేదు. ఎప్పుడూ నా వృత్తీ, ప్రవృత్తీ, బాధ్యతా చిలీ ప్రజల పక్షం వహించడమే, నా చేతల ద్వారా కవిత్వం ద్వారా వారికి సేవ చేయడమే. వారిని పక్షం వహిస్తూ, పాడుతూ నా జీవితం గడిపాను.” అన్నాడు.

వామ పక్షాల్లో విభజన వల్ల నెరూడా తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుని ఉమ్మడి అభ్యర్థి తన మిత్రుడూ అయిన అయెందీ కి మద్దతు తెలిపాడు. 1970 జనవరి లో మరికొన్ని రోజుల్లో తన అభ్యర్థిత్వాన్ని ఉపసంహరించుకుంటాడనగా ఇస్లా నెగ్రా లో నెరూడా ఇంట్లో జరిగింది.

ఇస్లా నెగ్రా అంటే నల్లని దీవి అని. అయితే అది దీవి కాదూ, నల్ల గానూ ఉండదు. సాంటియాగో నుండి రెండు గంటల ప్రయాణం తర్వాత, వల్పరైసో కి 40 కిలో మీటర్ల దూరంలో ఉండే బీచ్ రిసార్ట్ అది. దానికా పేరు ఎలా వచ్చిందో ఎవరికీ తెలియదు. బహుశా ఒక ద్వీపం ఆకారంలో ఉండే నల్లని రాళ్ళ వల్ల ఆ పేరు వచ్చి ఉండ వచ్చు అని నెరూడా ఊహ. ముప్ఫై ఏళ్ల కింద ఇస్లా నెగ్రా ఇంకా ప్రసిద్ది చెందక ముందు నెరూడా తన పుస్తకాల మీద వచ్చిన డబ్బులతో 6000 చదరపు మీటర్ల సముద్ర తీరానికి ఎదురుగా ఉండీ స్థలాన్నీ దానిలో ఉన్న ఎత్తైన ప్రదేశంలోనున్న ఇంటినీ కొనుక్కున్నాడు. తర్వాత ప్రజల్లా, చెట్లలా ఆ ఇల్లు కూడా పెరుగుతూ విస్తరిస్తూ వచ్చింది. శాంటియాగో లోశాన్ క్రిస్టొబల్ వద్దా, వల్పరైసొ లో నూ నెరూడాకు వేరే ఇళ్ళు ఉన్నాయి. తన ఇళ్లను అలంకరించడానికి నెరూడా పురాతన వస్తువుల దుకాణాలను, జంకు యార్డ్లనూ జల్లెడ పట్టే వాడు. ప్రతి వస్తువూ ఆయనకు ఎదో సంఘటనను గుర్తుకు తెచ్చేది. “ ఇతడు స్టాలిన్ లా ఉన్నాడు కదూ!” అంటూ ఒక ఆంగ్లేయ సాహస యాత్రికుడి శిల్పాన్ని చూపి అడిగాడు. పారిస్ లో పురాతన వస్తువులమ్మే అతను దీన్ని అమ్మడానికి ససేమిరా అన్నాడు. నేను చిలీ నుండి వచ్చాను అని తెలిసి నాకు పాబ్లో నెరూడా తెలుసా అని అడిగాడు. అట్లా అతన్ని అమ్మేందుకు వప్పించాను” అన్నాడు నెరూడా.

నిరంతర యాత్రికుడైన నెరూడా తన మూడో భార్య మటిల్డే తో (ఆమెను పటోజా అని ప్రేమగా పిల్చుకునేవాడు – ఆమె కోసం ఎన్నో ప్ర్రేమ కవితలు రాసాడు కూడా) చివరకు ఇస్లా నెగ్రా లో స్థిర పడ్డాడు.

పొడుగ్గా, కొంచెం లావుగా, ఆలివ్ రంగు శరీర ఛాయ తో తేనె రంగు కళ్ళతో పెద్దదైన ముక్కుతో దట్టమైన కనుబొమ్మలతో నెరూడా విశిష్టంగా కనబడే వాడు. అతని కదలికలు నెమ్మదిగా ఉన్నా దృఢంగానూ, అతని మాటలు స్పష్టంగా ఎటువంటి పటాటోపం లేకుండానూ ఉండేవి. నెరూడా బయటకు నడకకు వెళ్ళినప్పుడల్లా పొడుగాటి దుస్తులు వేసుకును చేతిలో కర్ర పట్టుకుని తన రెండు కుక్క పిల్లలు వెంట రాగా బయలు దేరేవాడు.

ఇస్లా నెగ్రా లో నెరూడా ఇంటికి నిరంతర అతిథి ప్రవాహం వస్తూండేది. అయినా విసుగూ విరామం లేకుండా నెరూడా అతిథులని ఆదరించే వాడు. ఆయన భోజనాల బల్ల వద్ద చివరి నిమిషంలో వచ్చే అతిథుల కోసం ఎప్పుడూ చోటుండేది.

ఈ ఇంటర్వ్యూ కోసం జరిగిన సంభాషణలు చిన్న చిన్న సమావేశాలుగా జరిగినయి. ఉదయం ఉపాహారం తర్వాత నెరూడా గ్రంథాలయంలో కలిసే వాళ్ళం. అతను తన ఉత్తరాలకు తిరుగు సమాధానం చెప్పే దాకనో, తన కొత్త పుస్తకం కోసం కవితలు రాయడం అయ్యేదాకనో, చిలీ లో ప్రచురించబడుతున్న “ఇరవై ప్రేమ కవితలు” ప్రూఫులు దిద్దడం అయ్యేదాకనో, నేను ఎదిరి చూసే దాన్ని. నెరూడా తన కవితలు పచ్చని సిరాతో ఒక సాధారణ నోటుబుక్కులో రాసే వాడు. చాలా పెద్దకవితలని కూడా అతి సునాయాసంగా తక్కువ కాలంలోనే పూర్తి చేసే వాడు. తర్వాత కొన్ని దిద్దుబాట్లు చేసి తన చిరకాల స్నేహితుడు, సెక్రెటరీ హోమెరో ఏర్స్ కు టైప్ చెయ్యమని ఇచ్చేవాడు.

తర్వాత చిన్న మధాహ్నపు కునుకు తర్వాత ఇంటి పై రాతి బల్లపై కూర్చుని సముద్రాన్ని చూస్తూ నెరూడా టేప్ రికార్డర్ మైక్రోఫోన్ చేతిలో పట్టుకుని గంటల తరబడి ప్రశ్నలకు సమాధానాలు ఓపికగా చెప్పేవాడు. మైక్రోఫోన్ లో నెరూడా కంఠధ్వనితో పాటు నేపథ్యంలో సముద్ర హోరు వినబడేది.

(ఇంటర్‌వ్యూ వచ్చే సంచికలో…)

ఒక అభిప్రాయం »అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం

ఒక అభిప్రాయం

  1. koresh Apr 7, 2008 1

    అద్బుత వ్యక్తి గురించి హ్రుద్యంగా రాసిన రాతలు హ్రుదయమ్ లొ కల్లొలాలను రెపుతున్నాయి. జీవితంలొ ఎంతొ మిస్స్య్యానన్న్ బాద ఇన్కా మించి పొలెదన్న్ అనద0్ తొ అబినందనలతొ…

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో