పద్యం పుట్టుక గురించి మళ్ళా …!

1

కాసింత నేలని తవ్వి, వొక సీసాలో కాలాన్ని కట్టేసి
దాన్ని కప్పేశాం, గుర్తుందా?
మరీ చిన్నప్పటి సరదా కదా,
గుర్తుండి వుండదులే!
*
పద్యం కూడా అంతేనా ?

2

రాయడానికేమీ లేని తనం
నీకూ, నాకూ , బహుశా అందరికీ.
కచ్చితంగా ఇప్పుడే ఇష్టపడలేని హోంవర్కులాగా.
ఎంతకీ ప్రేమించలేని సిలబస్ లాగా.
బాధ లేదని కాదులే!
కాకపోతే, ఎవరి బాధో తప్ప
రాయలేని తనం
అరువు కళ్లతో ఏడుపు,
కొయ్య కాళ్ళతో పరుగు!
*
ఏదో వొక కొయ్య కాలు చాలదేమో, లోపలి పద్యానికి!

3

సొంతమూ, పరాయీ అని కాదు కాని
నువ్వు నీ దేహంలో సంచరించడం మానేసి
ఎంత కాలం అయ్యింది, చెప్పకూడదూ, కాస్త!
చర్మం కూడా పరాయీ చొక్కాలాగే అనిపిస్తోందీ మధ్య.
*
మాటలో తేలిపోతుంది, నిజమేదో, కానిదేదో!

4

తవ్వోడ దొరికింది సరే,
అదే పద్యం అనుకుంటున్నాం
నువ్వూ, నేనూ, అందరం!
లోపలా, బయటా చాలా చాలా తవ్వి పోశాం కానీ,
లేని చోట తవ్వుకొని, వెతుక్కుంటే – దొరుకుతుందా, పద్యం?
*
పద్యం పుట్టుక అసలేమైనా గుర్తుందా?
వుండి వుండదులే,
మరీ చిన్నప్పటి సరదా కదా?!

***

3 అభిప్రాయాలు »కవితలు

3 Responses to “పద్యం పుట్టుక గురించి మళ్ళా …!”

  1. 1
    pasunoori ravinder Says:

    పద్య జాడల కోసం పరితపిస్తున్న
    ఈ కవి తపనకు జోహార్లు!
    కొత్త పద్యం, సొంత గొంతు నుండి పుట్టే
    పరిస్థితులను కాంక్షిస్తూ….
    బాల్యాన్ని గుర్తుచేసిన అఫ్సర్ గారి కవితార్తికి
    ధన్యవాదాలు.

  2. 2
    manasa yendluri Says:

    namaste uncle,hope ur fyn der,did u get me uncle?mee “donga nannna” manasa ni.appude uncle poetry ki comment raase anta peddaaipoyindi uncle,v didnt even enjoy d telugu poetry as u ppl did uncle.edu sys has minimised d classical poetry 4 children here in india.,i think dis poem had made d new generation 2 no abt d value of d telugu poetry,d satire is interesting uncle,waiting 4 more poems uncle,vth lots of love n respect…………manasa

  3. 3
    aanandbabu Says:

    hi manasa

    kindly let me know ur mail id

    ubabhttp://mailhide.recaptcha.net/d?k=01mz8eeSL7aMI92FFdVmiRKg==&c=r_6xazu3NKURDI0pmEtuUvFKO43UhB90RpRaZh_sSfY=', ”, ‘toolbar=0,scrollbars=0,location=0,statusbar=0,menubar=0,resizable=0,width=500,height=300′); return false;” title=”Reveal this e-mail address”>…@gmail.com

    with regards,

    anandbabu

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో