సందర్భం ఒక్కటే

సంఘటనలనేకం
సందర్భం ఒక్కటే
నందిగ్రాం అయినా ముదిగొండ అయినా
వల వేసి మనుషులని కమ్మిండ్రక్కడ
రక్తం మడుగులో కొట్టుకుంటున్న
పావురాలిక్కడ
నాలుగు కట్టెల మీద నిలబడ్డ గుడిసె కోసం
అరిచే గొంతులకు అబద్ధాలతోని ముడేస్తరు
కంకుల విత్తులే కాదు
కొడవళ్ళ పదును ముసుగేసుకుని ఉన్నదక్కడ
పిడికిట్ల అన్ని నిజాలని మూసేసి
భూమి కోసం నినాదాలిక్కడ

***
భూముల పంపకం అంటే
గుడిసె వచ్చినట్టే అనుకుంటరు
లాఠీ నిటారుగా పాతి పెట్టి ఉంటుందనుకోరు
నిరాహార దీక్ష అంటే
నిశ్శబ్దంగా నడిచేదనుకుంటరు
గ్రే హౌండ్స్ బూట్ల చప్పుడనుకోరు

ముదిగొండ
ఒక ఏకే 47 వర్షం లో
తడిసిన వరిచేను
ఎజెండా అంటేనే తెలియని
ప్రజల నాలిక

నాగలై ఉరూరా తిరిగి
అధికారం లోకి వచ్చినోడు
తుపాకీ బుజమ్మీద పెట్టుకోని
మాట్లాడ్డం విషాదం
నెత్తికెక్కిన తెల్లని తలపాగా వెనుక
ఎన్ని రక్తపు తెట్టెలు కట్టినయో

***
సంఘటనలనేకం
నీడలెక్క తిరుగుతున్నది
సెజ్ సాలెగూడు ఒక్కటే
ఇందిరమ్మ రాజ్యంల
ఇటలీ నీతి
“ముసలి నక్కకు రాచరికం దక్కునే”
దాశరథి నినాదం ఆనాటిది!
“ముసలివాళ్ళకు జానెడు భూమి కూడా దక్కదు”
ఈ నాటి ఏలిన వారి సూత్రం!

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. R.Surya Prakash Rao Sep 15, 2007 1

    చాలా బాగుంది. వై.ఎస్. అధికారంలోకి వచిన తీరుని, అనంతర పరిస్థితిని చక్కగా కవితాత్మకంగా వివరించినందుకు అభినందనలు. హ్యాట్స్ ఆఫ్ మురళి గారూ!

  2. R.Surya Prakash Rao Sep 15, 2007 2

    చాలా బాగుంది. వై.ఎస్. అధికారంలోకి వచిన తీరుని, అనంతర పరిస్థితిని చక్కగా కవితాత్మకంగా వివరించినందుకు అభినందనలు. హ్యాట్స్ ఆఫ్ మురళి గారూ!

    ఆర్. సూర్య ప్రకాశ్ రావు, మేడ్చల్

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో