September 2007 సంచిక

రక్తమాంస దాహం

రోడ్డు మీద ప్రమాదాల్లో
నుజ్జునుజ్జయ్యే మానవశరీరాలు
గుర్తుపట్టొచ్చు
గుండెనిబ్బరంతో శవసంస్కారం చెయ్యొచ్చు మొత్తం చదవండి »

50 అభిప్రాయాలు »కవితలు

నిలువెత్తు అక్షరం

ఇక్కడ అక్షరం మొగ్గేస్తుంది
నీదాకా పరిమళాన్ని పంపిస్తున్నాం
నీవు గ్రహిస్తావో లేదో
అది వృధా అవుతుందో ఏమో? మొత్తం చదవండి »

8 అభిప్రాయాలు »కవితలు

నువ్వూ, వాళ్లూ, నేనూ, లజ్జా

నువ్వు
ఒక అతిథిగా వచ్చావు
స్వేచ్ఛను ఇష్టపూర్తిగా ఇముడ్చుకున్న
అక్షరంలా వచ్చావు
నిన్ను పోలిన మరో అక్షరాన్ని
విడుదల చేయడానికి వచ్చావు మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

అంతిమ తీర్పు

రాముడు తుంచిన శంభుకుని శిరస్సు
ఇపుడు ధర్మాసనం మీద వేలాడుతున్నది.
ద్రోణుడు బలిగొన్న ఏకలవ్యుని బొటనవేలు
ఆర్డర్‌ ఆర్డర్‌ అని ఆజ్ఞాపిస్తున్నది మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

ఆస్‌మాన్‌ కి కబూతర్‌

కుర్‌కుర్‌… కుర్‌కుర్‌మని
మక్కామశీదు మెట్ల మీద చిన్ని మున్నలేసే
జొన్నలో సజ్జలో తినుకుంటూ
వుజూఖానలో భయంభయంగా మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

ఇది ఇండియా!

కలాన్ని కాలరాసే
ఒక కత్తో ఒక భక్తో
రికార్డునుండి తొలగించాల్సిందే!

ఏడురంగులు ఒక్కటై కలిసి ఉన్న
ఇంద్రధనుస్సులాంటి దేశం కదా మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

నెత్తురింక ఆరలేదు

ఈ భూమి సల్లగుండ
కాసిన్ని చినుకులో…
కాసింత నెత్తురో…
తాకితే చాలు,
వృక్షాలకో,వీరులకో జన్మనిస్తుంది. మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »కవితలు

పొలిమేర్లకి పారీలు మా బతుకులకి గోరీలే!

రాలూ రప్పలూ ఏరి
సెట్టూ సేమా కొట్టి
పురుగు పుట్రను తరిమి
దారి డొంకా చేసి
కుంటా సెలమ తొవ్వి మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

మన చేతులు చిన్నవి

సమాజంలోని అధికార బృందాలు అపుడపుడు మనకు కొన్ని సంకేతాలు పంపుతుంటాయి. వాటిచేతులు ఎంత పొడవైనవో మన చేతులు ఎంత పొట్టివో తెలియజేస్తుంటాయి. ప్రగతిశీల సమాజం సంఘటితం కావాల్సిన అవసరాన్ని పరోక్షంగా గుర్తుచేస్తుంటాయి. అటువంటి ఒక ప్రమాదకర హెచ్చరికే తస్లీమాపై జరిగిన దాడి. దాడి సమయంలోనే ప్రెస్‌క్లబ్ ఎగ్లిక్యుటీవ్ కమిటి మీటింగు జరుగుతుండడం వల్ల పెద్ద ముప్పు తప్పింది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »సాహిత్య వ్యాసాలు

తానుండిన కాలానికి తానె ఉషస్సయినాడు

కాళోజీ
కాళోజీ
”యుద్ధం లోపట ఫ్రాన్సులో కవులందరు చెల్లాచెదురై పారిపోతే ‘లూయీ ఆరగాన్‌’ ఒక్కడే దేశంల నిలబడి మహా ప్రజా విశ్వాసాన్ని వెల్లడించే గీతాలు రాసిండు. కాళోజీ లూయీ ఆరగాన్‌ వంటివాడు”. 1953 డిసెంబర్‌ల అలంపురం ఆంధ్రసారస్వత పరిషత్తు సభల కాళోజీ ‘నా గొడవ’ను ఆవిష్కరించుకుంటూ శ్రీశ్రీ అన్న మాటలివి. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

ఒక సావు

ఊర్లె ‘పల్లెబాట’ ప్రొగ్రాం.

లోకల్‌ మినిష్టరు, ఎమ్మెల్యే, ఖద్దరు బలగం వస్తుండ్రు.

రాత్రంతా కూసుండి ‘ఉపాది హామీ’ కూలీల లిస్టు, ఇందిరమ్మ ఇండ్ల లిస్టు, పించిని కార్డు లిస్టు అదోటి, ఇదోటి తయారు చేసిండు సెకిరెట్రి. తెల్లారే ముందట కన్నుంటుకుంది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

యాది

నిలవెట్టిన కట్టెకు కుండదలిగిచ్చినట్టు ఆడాడ భటులు నిలవడున్నరు. ఆల్లయి నిట్టేసిన చూపులే తప్ప గింత నగుమొకం లేదు. అప్పుడప్పుడే లారీలల్ల జనం జేజేలు గొట్టుకుంట జిందాబాద్‌లనుకుంట ఆపీసు వెనుక దిగవట్టిండ్రు. లారీలల్ల డేవరు కాబిన్లనించి నాయకులు దిగి టిపిన్లకు చాయ్‌లకు గిట పోతన్నరు. పెద్ద పెద్ద మనుషులు బార్ల నిలబడుతున్నరు. పాటిచ్చిసూస్తే ఆడ దేశంలున్న జండాలన్ని కనవడవట్టినై. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కథలు

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 1

తెలంగాణ ముద్దు బిడ్డ, తెలంగాణ పాటకు మకుటం లాంటి వాడు, సుద్దాల అశోక్ తేజ తానా మహాసభల కోసం అమెరికా వచ్చిన సందర్భంగా ఆయన పాటల నేపథ్యాన్ని, అనుభవాల్నీ, జీవన యాత్రనూ, సాహితీ యాత్రనూ, అద్భుతమైన కవిత్వం నిండిన అతని పాటల జలపాత పుట్టుక రహస్యాలను తెలుసుకోవడానికీ, కష్ట జీవుల జీవితం ప్రతిబింబిస్తూ, పద పదానా శ్రమ గొప్పతనాన్నీ, శ్రమైక జీవన సౌందర్యాన్నీ చాటే అతని పాటల జీవనాడిని పట్టుకోవడానికి ‘ప్రాణహిత’ ఆయనతో ముచ్చటిస్తున్నది. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు

పాటే నా ప్రాణం – సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – 2

ప్రాణహిత: మీ ప్రాపంచిక దృక్పథం, ఆలోచనా స్రవంతి గురించి వివరిస్తారా?

అశోక్: ఈ ఆలోచనా దృక్పథం, ప్రాపంచిక దృక్పథం ఇదంతా కాదు గానీ మొత్తం మీద ఒక్కటి – నేను చూసి ఎక్కడయితే బాధ పడుతానో, నేను ఎదురుగా చూసింది ఏదయితే నాకు బాధ కలిగిస్తందో దాన్ని పాటగా మార్చే ప్రయత్నం చేస్తాను. లేదా నేను ఏదయినా ఒక వార్త విన్నప్పుడు ఆ బాధ ను ఊహించగలను. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ఇంటర్‌వ్యూలు

మరణం లేని ‘బా’ కథలు

జీవితాన్ని చేరబిలుచుకుని, తలనిమురుతూ, కన్నీటిని తుడుస్తూ, అలసటను పోగొడుతూ, లాలించే రహస్యమేదో బహుత్‌ ఖూబ్‌గా తెలిసిన వాడు రహమతుల్లా. నాయినను గురించి చెప్పినా, అమ్మను గురించి మాట్లాడినా, భాష, మతం, ఆకలి, ఈతి బాధలు – దేనిని గురించి ఏకరువు పెట్టినా, ముందుగా మనల్ని తనకైవసం చేసుకని, ఊపిరాడనీయని, వశం కాని శిల్ప విన్యాసంతో, అతని ఎంటే పడికొట్టుకు పోయేటట్టు మనల్ని మార్చేసే కామ్‌గారీతనం కూడా అతనికి ఎంతో బాగా తెలుసు. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »పుస్తక సమీక్షలు

పారిస్ రివ్యూ – పాబ్లో నెరూడా ఇంటర్‌వ్యూ – 2

(గత సంచిక తరువాయి)

ప్ర: మీరు పేరెందుకు మార్చుకున్నారు? పాబ్లో నెరూడా అనే పేరు ఎందుకు ఎంచుకున్నారు?

నె: నాకు సరిగ్గా గుర్తు లేదు. నేనప్పుడు పదమూడో పద్నాలుగో ఏండ్లున్నాననుకుంటా! నేను కవిత్వం రాయాలనుకోవడం మా నాన్నకు సుతరామూ ఇష్టం లేదు. నేను రాయడం వల్ల నాకు మా కుటుంబానికీ వినాశం కలుగుతుందనీ, ముఖ్యంగా నన్ను పూర్తిగా పనికి రానివాడిగా తయారు చేస్తుందని ఆయన – మంచి ఉద్దేశ్యంతోనే – నమ్మే వాడు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, ఇంటర్‌వ్యూలు, ప్రపంచ సాహిత్యం

అపరాజిత

“నన్ను ఒకప్పుడు
వీరుడనేవారు.
ఇప్పుడు అదంతా అయిపోయింది.
ఇక నా దారంతా
కష్టాలమయమే .”
- తతంక ఇయొతాంక (Tatanka Iyotanka – Sitting Bull)
మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

Next »