అంతిమ తీర్పు

రాముడు తుంచిన శంభుకుని శిరస్సు
ఇపుడు ధర్మాసనం మీద వేలాడుతున్నది.
ద్రోణుడు బలిగొన్న ఏకలవ్యుని బొటనవేలు
ఆర్డర్‌ ఆర్డర్‌ అని ఆజ్ఞాపిస్తున్నది
బలిచక్రవర్తి మూడడుగుల కోసం
వంచిన తల తిరిగి పైకెత్తుతున్నది
నాలుగు సింహాల పాదాల కింద ధర్మచక్రం
కాలానికి సత్యమేవ జయతే అని ఉపదేశిస్తున్నది
గోనె సంచుల్లో నదిలో మునిగిన
శవాల కంకాళాలు
న్యాయమే గెలిచిందని చాటుతున్నవి

ఆ చేతులు శపించగలవు
ఇండ్లు కాలి అంతులేని శోకంతో తడిసిన
అవే చేతులు దుమ్మెతి పోయగలవు
కృతయుగం నుండి కలియుగం దాగా
కారంచేడు నుండి చుండూరు దాకా
ఆగస్ట్‌ 28 నుండి జూలై 28 దాకా
చరిత్ర నిండా పీనుగుల మీద నడిచి వెళ్లిన
రాజుల రక్తపు పాదాలు
దిగబడిన ఇదే భూమిలో
ఈ రాజ్యానివెపుడూ రాతి చెవులే!
ఇనుప ముఖమా విను!
పాదుకలను సింహాసనం మీదుంచిన నేల కదా!
ఇప్పుడైతే ఆ పాదుకలను చేసేవాన్నే
పట్టాభిషిక్తున్ని కమ్మంటున్నది
ఈ నేల నన్నేకాదు, నిన్నూ బలిగొంటుంది
నీ తలాపున ఎపుడో
నల్ల జెండానెగురవేస్తుంది

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో