నెత్తురింక ఆరలేదు

ఈ భూమి సల్లగుండ
కాసిన్ని చినుకులో…
కాసింత నెత్తురో…
తాకితే చాలు,
వృక్షాలకో,వీరులకో జన్మనిస్తుంది.

ఈ మట్టికి
రక్తాభిషేకం
జరిగిందెప్పుడో
సరిగ్గా గుర్తులేదుగానీ,
ఆ తడి ఆరకుండ
వీరుల బలి దానాలు జరుగుతూనే ఉన్నయ్.

వీరులంతా ఎవరని…?
సంస్థానాల రక్షణకో
స్వంత ఆస్తుల పరిరక్షణకో
ఎదురొడ్డి నేలకొరిగినోళ్ళుకాదు.
స్వేచ్చా వాయువుల కోసమో
వెట్టి పిశాచి అంతం కోసమో
కాదంటే విద్యుత్ చార్జీల తగ్గింపు కోసమో

లేదంటే జానెడు జాగ కోసమో
వాళ్ళంతా గుండెను జెండా చేసినోళ్ళు.

ఓ నా ముదిగొండ
పోరుతల్లి ముద్దుబిడ్డా!
నువ్ రాజ్య హింసకు
బలైన రామ చిలుకవే కాదు…,
కొత్త ఊపిరి
కూడ గట్టుకున్న
పోరుమొలకవు.

7 అభిప్రాయాలు »కవితలు

7 Responses to “నెత్తురింక ఆరలేదు”

  1. 1
    Ramya jyothi.U Says:

    Ravinder annaiah namaskaram
    mee kavitha chala bagunnadi,mudi gonda incident nu gurinchi chala baga varnincharu. maanavatavaannidrusti lo vunchukoni chala baagaa spandincharu.elaanti samaajika spruha kaliginche vidangaa kavithala lu raayaalani korukuntoooo
    mee chellelu & abhimaani Ramya Jyothi!

  2. 2
    pasunoori ravinder Says:

    రవీందర్ కవిత చాలా బాగుంది. కానీ ఈ భూపోరాటం విషయంలోనే నేను విబేదించాల్సివస్తుంది. అందుకు కారణమేమంటే ఈనాడు ఎవరు ఏ ఉద్యమం చేసినా దానిని రాజకీయం చేస్తున్నారు. ఆ రాజకీయ ఎత్తులకు పైఎత్తులకు బలైపోతున్న దెవరో ఒకసారి ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. ఎందుచేతనంటే ఎప్పుడు ఎక్కడ ఏ ఉద్యమం జరిగినా రక్తమోడ్చే లేదా ప్రాణాలను పణంగా పెట్టేవారెవరనేదే ఆలోచించాల్సిన అవసరం ఉంది. చేతులు కాలాక ఆకులు పట్టుకొని ప్రయోజనమేముంది. ముదిగొండలో కాల్పులు జరిగాయి. ఆ కాల్పుల్లో మరణించిన వారెవరో అందరికీ తెలుసు. అదే ముందు వరుసలో ఎప్పుడూ నాయకులుండేవారు. కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రం ఎవరికీ ఏమీకాదు. అందులోని అర్థం పరమార్థం ఏమిటో విక్రమార్క బేతాళులకే తెలియాలి. ఎప్పుడూ అమాయక ప్రజల నెత్తుటితో తడిస్తేనే నీ భూమాత(ఈ కవితలో) కళ్ళు చల్లారవేమో? ఈ కుహనా రాజకీయాలకు ఇంకా ఎంతమంది బలి అవ్వాలో ఏమో!…………….

  3. 3
    pasunoori ravinder Says:

    గమనిక;
    పై అభిప్రాయం నాది కాదు.
    హైదరబాద్ సెంట్రల్ యూనివర్సిటి స్కాలర్ కట్టెపోగు రత్నశేఖర్ గారిది.
    అనుకోకుండా నా పేరుతొ ప్రచురితమైంది.
    దయచేసి పాఠకులు గమనించగలరని కోరుతున్నాను.

  4. 4
    kattepogu ratnashekar Says:

    వివరణ
    నా అభిప్రాయాన్ని టైప్ చేసి, నా పేరు పేర్కొనడం తొందరలో మరిచిపోయాను.
    కవి రవీందర్ గారు, పాఠకలోకం మన్నించవలసిందిగా మనవి.

  5. 5
    Suresh.K. Digumarthi Says:

    రవీందర్ కవితలోని రక్తమ్ నాకు అంటింది. నా గుండె కోసుకునంట్టయ్యింది. కవిత చాకులా కోసుకుంది నాకు……అమరులకు….

  6. 6
    Vipul Says:

    భూపోరాటాన్ని నడిపే వామపక్ష నాయకులు ప్రజాద్రోహులు. ప్రజలను మోసం చేయడం తప్ప వారికి మరొకటి రాదు. వీళ్ళ రాజకీయాలకు అమాయకులు, నిరుపేదలు బలికావడం మరింత బాధాకరం. ముందు వీళ్ళ మోసాలను జనం తెలుసుకోవాలి.

  7. 7
    john Says:

    అద్బుతమైన కొసమెరుపు
    కొత్త ఊపిరి
    కూడ గట్టుకున్న
    పోరుమొలకవు.

    అభినందనలు

    జాన్ హైడ్ కనుమూరి

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో