Sep2007
నిలువెత్తు అక్షరం
ఇక్కడ అక్షరం మొగ్గేస్తుంది
నీదాకా పరిమళాన్ని పంపిస్తున్నాం
నీవు గ్రహిస్తావో లేదో
అది వృధా అవుతుందో ఏమో?
నా బాధో సంతోషమో
విరహమో ప్రేమో మోహమో
నేనూ సముద్రాన్నే…. నాలోనూ ఉప్పునీరుంది
పోనీ అవో….
లేక నేను తేనెతెట్టెననుకో
తేనెలాంటి భావధారో!
ఏదో ఒకటి బతుకో మరణమో
ఒక భావం నీలో విరియడానికి
ఇన్నిన్ని రంగుల్ని నా మనసు మోస్తుంటుంది
ఒక్కోసారి అనుకుంటాను
అక్షరం మొగ్గలేస్తున్నప్పుడే
నువ్వు ప్రపంచంలో ఎక్కడెక్కడో
రకరకాలుగా తయారయ్యే ఉన్నావని
కానీ మళ్లీ సందేహం
ఈ గాలిపటం నువ్వున్న ఆకాశం కాదా
వస్తుందో రాదో!
నా కంటి ఉప్పునీరు
నీ దోసిలిలో ఘనీభవిస్తుందో లేదో?
భూమి పరిభ్రమిస్తూనే ఉంది
మూడుకాలాల తడిని, చలిని, వేడిని కవిత్వంలో నింపాను
ప్రకృతిని విశ్వాన్నికూడా
అక్షరాలలో తర్జుమా చేయాలనుకునే
అనువాదకురాలిని నేను
మరి ఈ భాష నిన్ను చేరుకుంటుందో లేదో!
ఇక్కడ అక్షరం మొగ్గేస్తుంది
పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని
ఒక కోరిక…. కల!
నేను అక్షరానికి ముసుగులు తొడగలేను
అక్షరం సజీవ కదా!
ఇంకెవరైనా ముసుగు కప్పుకున్నా సరే
చీల్చుకుని లోపలికొస్తుంది
అక్షరం సర్వ వ్యాపితం కదా!
పూలు విసిరినా – కత్తులు విసిరినా
అక్షరం మొక్కవోదు
హృదయాల తర్జుమా ఆగిపోదు
ఉరుములు మెరుపులు ఏమైనా సరే
మొగ్గలు వికసిస్తాయి!
అక్షరాలు తలెత్తుకునే నిలబడతాయి
September 5th, 2007 at 2:00 am
కవిత బాగుంది.
September 5th, 2007 at 7:57 am
అక్క !
మీ కవిత చాలా బాగు0ది.
September 6th, 2007 at 4:45 am
చిక్కటి కవిత
September 15th, 2007 at 11:51 am
అక్షర పరిమళాలు ప్రపంచమంతటికీ చేరతాయి, ముసుగు లేకుండా! చాలా బాగుంది.
ఆర్. సూర్య ప్రకాశ్ రావు, మేడ్చల్
September 17th, 2007 at 7:53 am
“హృదయాల తర్జుమా …………………………….”
చాలా బాగుంది.
సాహిత్యాభిమాని
September 18th, 2007 at 2:33 am
చాలా బాగుంది. కొద్దిగ క్లుప్తత సాధిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.
September 23rd, 2007 at 4:23 am
బావుంది.
September 24th, 2007 at 7:24 am
అద్భుతమైన కవిత. చాలా బాగుంది.
July 8th, 2010 at 6:54 am
షాజహాన గారు,
మీ కవిత..చాలా బాగుంది..
అభినందనలు..