నిలువెత్తు అక్షరం

ఇక్కడ అక్షరం మొగ్గేస్తుంది
నీదాకా పరిమళాన్ని పంపిస్తున్నాం
నీవు గ్రహిస్తావో లేదో
అది వృధా అవుతుందో ఏమో?

నా బాధో సంతోషమో
విరహమో ప్రేమో మోహమో
నేనూ సముద్రాన్నే…. నాలోనూ ఉప్పునీరుంది
పోనీ అవో….

లేక నేను తేనెతెట్టెననుకో
తేనెలాంటి భావధారో!
ఏదో ఒకటి బతుకో మరణమో

ఒక భావం నీలో విరియడానికి
ఇన్నిన్ని రంగుల్ని నా మనసు మోస్తుంటుంది
ఒక్కోసారి అనుకుంటాను
అక్షరం మొగ్గలేస్తున్నప్పుడే
నువ్వు ప్రపంచంలో ఎక్కడెక్కడో
రకరకాలుగా తయారయ్యే ఉన్నావని
కానీ మళ్లీ సందేహం
ఈ గాలిపటం నువ్వున్న ఆకాశం కాదా
వస్తుందో రాదో!
నా కంటి ఉప్పునీరు
నీ దోసిలిలో ఘనీభవిస్తుందో లేదో?

భూమి పరిభ్రమిస్తూనే ఉంది
మూడుకాలాల తడిని, చలిని, వేడిని కవిత్వంలో నింపాను
ప్రకృతిని విశ్వాన్నికూడా
అక్షరాలలో తర్జుమా చేయాలనుకునే
అనువాదకురాలిని నేను

మరి ఈ భాష నిన్ను చేరుకుంటుందో లేదో!
ఇక్కడ అక్షరం మొగ్గేస్తుంది
పరిమళం ప్రపంచమంతా వ్యాపించాలని
ఒక కోరిక…. కల!

నేను అక్షరానికి ముసుగులు తొడగలేను
అక్షరం సజీవ కదా!
ఇంకెవరైనా ముసుగు కప్పుకున్నా సరే
చీల్చుకుని లోపలికొస్తుంది
అక్షరం సర్వ వ్యాపితం కదా!
పూలు విసిరినా – కత్తులు విసిరినా
అక్షరం మొక్కవోదు
హృదయాల తర్జుమా ఆగిపోదు

ఉరుములు మెరుపులు ఏమైనా సరే
మొగ్గలు వికసిస్తాయి!
అక్షరాలు తలెత్తుకునే నిలబడతాయి

Share/Save/Bookmark

కవితలు

8 అభిప్రాయాలు

  1. desaraju సెప్టెంబర్ 2007 1

    కవిత బాగుంది.

  2. Ramya jyothi.U సెప్టెంబర్ 2007 2

    అక్క !
    మీ కవిత చాలా బాగు0ది.

  3. pasunoori ravinder సెప్టెంబర్ 2007 3

    చిక్కటి కవిత

  4. R.Surya Prakash Rao సెప్టెంబర్ 2007 4

    అక్షర పరిమళాలు ప్రపంచమంతటికీ చేరతాయి, ముసుగు లేకుండా! చాలా బాగుంది.
    ఆర్. సూర్య ప్రకాశ్ రావు, మేడ్చల్

  5. సాహిత్యాభిమాని సెప్టెంబర్ 2007 5

    “హృదయాల తర్జుమా …………………………….”
    చాలా బాగుంది.

    సాహిత్యాభిమాని

  6. K Viswa సెప్టెంబర్ 2007 6

    చాలా బాగుంది. కొద్దిగ క్లుప్తత సాధిస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది.

  7. Mallikarjuna Rao D సెప్టెంబర్ 2007 7

    బావుంది.

  8. B.AJAY PRASAD సెప్టెంబర్ 2007 8

    అద్భుతమైన కవిత. చాలా బాగుంది.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో