నువ్వూ, వాళ్లూ, నేనూ, లజ్జా

నువ్వు
ఒక అతిథిగా వచ్చావు
స్వేచ్ఛను ఇష్టపూర్తిగా ఇముడ్చుకున్న
అక్షరంలా వచ్చావు
నిన్ను పోలిన మరో అక్షరాన్ని
విడుదల చేయడానికి వచ్చావు
బిగింపులకూ విడుదలకూ నడుమ
దూరమెంతో నీకు తెలుసు
ఎగుడు దిగుడు మానవతలం
సమతలం కావాలని బయటికొచ్చి
పలుగూ పారా పట్టిన వాళ్లలో
నువ్వున్నందుకు
కొందరు మిత్రులైనారు, మరికొందరు శత్రువులూ..

వాళ్లు :
నిన్ను అతిథిగా గణించలేదు
నీ దారెలా వాళ్లను భగ్నపరిచిందో
గొంతెత్తి పలకొచ్చు. అవి వాళ్ల హక్కు కూడా –
అక్షరానికి వాళ్లేమీ పరాయి కాదు
కానీ రావాల్సిన దారిలో వాళ్లు రాలేదు
దారి తప్పారు, ధర్మం తప్పారు
వాళ్లు పూల గుత్తుల్నే విసిరారు, అవి
నుదుటినేనా, నీ అంతరంగాన్నీ గాయపర్చాయి
గాయం నీకు కొత్త కాదు
ప్రాంతం కొత్త, సందర్భం కొత్త –
వాళ్లు నీ ఆకాశాన్ని కూల్చాలనుకున్నారు
తలెత్తిన అక్షరం కూడా ఆకాశమవుతుందని
బహుశా వాళ్లకు తెలియకపోవచ్చు
ఆకాశమంటే సూర్యుడూ, చంద్రుడూ
నక్షత్రాలూ, మబ్బులూ, స్వేచ్ఛావక్షస్థలమూ…
నిజానికవి వాళ్లకూ అవసరమే కదా

నేను :
వేదిక మీద నువ్వు గాయపడ్డప్పుడే
నుదుటి మీద నాకు గాయమైంది
నేనేనా
ఆకాశాన్ని ప్రేమించే ప్రతి అక్షర శిల్పీ
గాయపడ్డాడు
ఉన్నట్టుండి అక్షరం మరింత పదునెక్కింది
నుదురును తడుముకున్నాను
అది యుద్ధ క్షేత్రమని అర్థమైంది
తలెత్తడం అక్షరానికేమీ కొత్త కాదు
లొంగదు కనుకనే అది అక్షరం

లజ్జ :
నిన్ను గాయపర్చిన పూలగుత్తులు
నిలువెల్లా సిగ్గుపడ్డాయి
నేల సాక్షిగా
కెమెరాల కన్నుల సాక్షిగా

2 అభిప్రాయాలు »కవితలు

2 Responses to “నువ్వూ, వాళ్లూ, నేనూ, లజ్జా”

  1. 1
    Alok Says:

    పేలవమైన కవిత

    కనిపించిన ప్రతిదానిపైనా పడితే కవిత్వం గాదు పైత్యం పుట్టుకొస్తుంది

  2. 2
    K Viswa Says:

    పది పదిహేను లైనుల్లో పూర్తికాగలిగిన కవితను 40కు పైగా సాగదీసారు. అక్కడక్కడా ఒకటిరెండు మెరుపులు తప్ప, మిగతాదంతా పేలవంగా ఉంది. ముగింపైతే కొత్తదనమే లేదు.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో