రక్తమాంస దాహం

రోడ్డు మీద ప్రమాదాల్లో
నుజ్జునుజ్జయ్యే మానవశరీరాలు
గుర్తుపట్టొచ్చు
గుండెనిబ్బరంతో శవసంస్కారం చెయ్యొచ్చు

మసీదు పార్కు ఛాట్‌భండార్‌లలో
మహానగరంలో బాంబు పేలితే…
మనుషులు రక్తపు ముద్దలు ముద్దలుగా…
అక్కడొక ముద్ద… ఇక్కడొక ముద్ద
ఎన్ని రక్తపు ముద్దల్ని పోగుచేసి
ఎవరని గుర్తుపడుదాం?

తల్లి గర్భం నుంచి పిండాన్ని బలవంతంగా లాగి
నేలమీద పడేసిన రక్తపు ముద్దలాగా శవాలు

దేశీయ విదేశీయ విధేయతా కుట్ర
బాంబు పేలుళ్ళు –
ఎవరికోసం ఎవరికోసం ఎవరి పైశాచికం
ఎక్కడి పగ…
మనుషుల్ని రక్తమాంసాల ముద్దల చేస్తున్నవు కదరా
ఖూనీ…. బ్లడ్‌సక్కర్‌…. మాన్‌ఈటర్‌
మార్‌డాలో సాలేకో….

మా ఆడోళ్లు ప్రతి నెలా రక్తం నేలపాలు చేస్తరు
వచ్చి తాగురా
నీదాహం తీరుద్దీ

50 అభిప్రాయాలు »కవితలు

50 Responses to “రక్తమాంస దాహం”

  1. 1
    pasunoori ravinder Says:

    మంచి కవిత రాసిన అన్వర్ గార్కి అభినందనలు.
    అయితే కవితలో అప్పటికప్పుడు రాసిన ఆవేశం కనిపిస్తున్నది.
    ఆగ్రహా అభివ్యక్తి విషయంలో ముగింపు మరో రూపంలో వ్యక్తపరిచుంటే సముచితమయ్యేది.
    మరిన్ని మంచి కవితలు తలవంచని కలం నుండి వెలివడుతాయని
    ఆశిస్తూ……

  2. 2
    Satya Says:

    అకరి స్టా0జ అర్థము కాలెదు, అ0టె బాగ లెదు అనిపిస్థు0ది. ఎడిటర్ర్ర్ గారు, అకరి పారను మార్చితె బగు0టాది.

  3. 3
    ramana Says:

    అన్వర కవిత బావుంది ఆవెషం తొ రాసిన చివరి వాఖ్యం బాగలెదు

  4. 4
    Harinath Says:

    కవి అన్వర్ గారు… మీరు రాసిన కవిత బాగనే ఉంది కాని చివరి వాఖ్యము కొంత మేరకు స్రీని అవమాన పరిచే విధముగా వుంది. మీరు దాన్ని తొందరగా సరిచేస్తీ బాగుంటుంది.

  5. 5
    praveen Says:

    మీ ఆవేషాన్ని కవిత్వములొ చూపెట్టారనిపించింది.
    ఉగ్రవాదులు మతావేశంతొనే కదా చేసింది
    కవిగా మీరు ఆవేశ పడడం సరి కాదేమొ. . . .

  6. 6
    john Says:

    రక్తం పీల్చేవానికి
    దాహం రక్తానిదే అయినప్పుడు
    ఏ రక్తంమయితేనేం
    తాగమన్న సవాలు బాగుంది

  7. 7
    Anwar Says:

    రక్త మాంస దాహం కవిత ఆవేశంలో రాసింది కాదు. భయంకర దుర్ఘటన మీద రాసిన కవిత.
    ఆడవాళ్ళు రక్తాన్ని నేలపాలు చేయడం ప్రకృతి ధర్మం, సహజం
    ఒక టెర్రరిస్టు మనుషుల రక్తాన్ని నేలపాలు చేయడం అధర్మం. అమానుషం. ఆది రక్తదాహం కాబట్టే రక్తదాహమే ఉంటే…
    మా ఆడవాళ్ళు ప్రతి నెల రక్తాన్ని నేలపాలు చేస్తారు – తాగరా అని చెప్పడమంటే…
    కించ పరచడం ఆడవాళ్ళని కాదు – టెర్రరిస్టు చర్యల్ని !
    కవితను టోటల్ కవితగా అర్థం చేసుకుంటే కవితలోని అంతర్లీనత, వాక్యాన్ని కవి వాడిన విధం అర్థం అవుతుంది.
    అంతేకాని కేవలం చివరి రెండు లైనులను కవిత నుంచి వేరుచేసి చూస్తే అర్థం చేసుకునే చోటే అపార్థం చేసుకునే అవకాశం ఉంది.
    ఒక ప్రకృతి హేయమైన చర్య (టెర్రరిజం) ను
    ఒక ప్రకృతి సహజమైన చర్యతో బుద్ది చెప్పడమే నా కవిత ఉద్దేశం.
    ఈ విషయాన్ని కవితలో చెప్పలేకపోతే తప్పు నాదే.

  8. 8
    rajeshkhanna Says:

    అన్వర్ర్ గారి కవితకి చాలా అభిప్రాయలు లాస్ట్ట్ వర్డ్ బాగాలెదని. ఆవెషంతొ రాసారని
    కాని..
    మనిషిలొని అంతర్గత భావావేషాల ప్రతిరూపాలే కళలు
    అది…..
    ఆటైన……పాటైన…….కవిత్వమైన………..
    ఇక.
    చివరివాక్యం గురించి……..
    అవమానం్ అన్నారు…….
    ముందు కవితను చదివిన ఆవేషంలొ సరిగా అర్ధం చేసుకొలేని పరిస్తితిలొ అబిప్రాయాన్ని వ్యక్తం్ చేసారు.
    అర్దం కాకపొతే మల్లిమల్లి చదవండి తప్పేంలేదు

  9. 9
    K Viswa Says:

    పెడబొబ్బలు, పొలికేకలు తప్పించి కవిత్వం ఏమాత్రం కనిపించటంలేదు.

  10. 10
    Alok Says:

    ఇది పెడబొబ్బా కాదు, పొలికేకా కాదు.పూనకం.

  11. 11
    Vipul Says:

    విమర్శ సహేతుకంగా ఉండాలి. కవిత పెడబొబ్బైనా పొలికేకైనా పూనకమైనా కవి దేనిని సమర్థిస్తున్నాడో దేనిని వ్యతిరేకిస్తున్నాడో చూడాలి. ఈకవిత మౌలికంగా హింసను వ్యతిరేకించేది కనుక మనందరం ఈ కవికి సంఘీభావం ప్రకటించాలి. ముష్కరులది రక్తదాహం కనుక చివరివాక్యంలో స్త్రీలను కించపరిచేదేమీ లేదు.

  12. 12
    K Viswa Says:

    విపుల్ గారు,

    ఇది కవిత్వం కాదు అన్నందుకే, కవి ఆవేదనకు సంఘీభావం ప్రకటించటం లేదని మీరు తీర్మానిస్తే ఎలా? ఇంకా నయం, ఇది కవిత కాదన్నందుకు నన్ను తీవ్రవాదిగా ప్రకటించలేదు మీరు :)

    అన్వర్ గారు ఇక్కడ కవిత పేరుతో వ్రాసినది కేవలమూ ఓ అభిప్రాయం మాత్రమే. ఒక ఆవేదన కవితలా మాత్రం మారలేకపోయింది. తీవ్రవాదుల దుశ్చర్య అందరినీ కదిలించింది. అలా అని ‘మార్ డాలో సాలే కో’ అని వ్రాసి అదే కవిత అనుకోమంటే ఎలా?

    తీవ్రవాదుల దుశ్చర్య అనంతరం వచ్చిన వార్తలకు, సంపాదకీయాలకు, ఈ కవిత అనబడే రచనకు అట్టే తేడా ఏమీ లేదు.

  13. 13
    Vipul Says:

    విశ్వం గారు

    చాలా మంచి ప్రశ్న వేశారు. కవిత్వానికి అనేక రూపాలుంటాయని నేను భావిస్తాను. దానితోపాటు సమకాలీనత కూడా ఉంటుంది. అది కేవలం వస్తువులోనే కాదు. వాక్య నిర్మాణంలో, బాధను, కోపాన్ని, ఆవేదనను వ్యక్తం చేయడంలో అభివ్యక్తి అనేక రకాలుగా ఉంటుంది. ప్రస్తుత కవిత అభివ్యక్తి నేపథ్యం ధిక్కార స్వభావం అని నేను అనుకుంటున్నాను. నేటి అనేక అస్థిత్వ ఉద్యమాలకీ, స్త్రీవాదానికీ, దళిత సాహిత్య వ్యక్తీకరణకు, ముస్లిమ్ వాదానికీ ఈ ధిక్కార స్వభావమే అంతస్సూత్రమని నా అభిప్రాయం. అన్వరు గారి కవితలోని భాష కూదా ఈ పరంపరనుంచే వచ్చిందని నాకనిపించింది. ఒకవేళ అలా కాకుండవచ్చుకూడా. ధిక్కారం మనిషి మౌలిక అవసరాలకు కట్టుబడి ఉండాలి. మనిషిని ప్రేమించేదై ఉండాలి. అంతిమంగా విశ్వశాంతిని ప్రకటించేదై ఉండాలి. అంతవరకు ధిక్కార స్వరం భూమి మీద వినిపిస్తూనే ఉంటుంది.

    మీ ఉద్దేశమంలో కవిత్వ స్వరూపం ఎలా ఉండాలనుకుంటున్నారు. అలా ఎందుకు అడిగానంటే ఈ సంచికలో రెండుమూడు చోట్ల మీరు ఇదే అభిప్రాయాన్ని రాసారు కనుక. అలా కాకుండా మీరు అలా ఎందుకు అనుకుంటున్నారో చెపితే కవితోపాటు అందరికీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది కదా.

  14. 14
    Vipul Says:

    విచిత్రమైన విషయమేమమంటే ఈ మహానుభావుడు ఇది తిట్టుకవిత్వమంటూ మళ్ళీ తానే పూనక విమర్శ చేస్తున్నాడు. పూనక కవిత్వం ఉండవచ్చునేమో కానీ పూనక విమర్శ పనికిరాదు కదా….

    సాహిత్యం మీద, అస్థిత్వ ఉద్యమాలమీద అలాగే వచన కవిత్వం మీద కనీస అవగాహన/ గౌరవం లేనివారు గొప్పవిమర్శకులుగా తమ అభిప్రాయాలను ప్రకటించబూనటం మరింత విచారకరం…

  15. 15
    Alok Says:

    ఆధునిక కవిత్వానికి “వచన”మన్న దౌర్భాగ్య బిరుదాన్ని వొప్పుకోడమే విచారకరం. దాన్ని విడిచేసి అనవసర విచారాలకి పోవడం మరింత విచారకరం.

    ఎన్ని వాదాలున్నాయని అడగడమే పూనకమైతే ఆడోళ్ళ నెలసరి రక్తస్రావాన్ని జుగుప్సాకరంగా రాసి, దాన్ని కవిత అని ప్రచారంచేసుకోడం వికారమే!! కవిత్వానికి గంతలు కట్టి, డొంకల్లోకి ఈడ్చి, కుంటడం నేర్పిస్తున్న యే వాదమైనా డింకావాదమే. గుడ్డెద్దు చేల్లో పడితే యేవౌతుందో అంతకంటే డామేజింగు ఈ వాదాలు. నానా వాదాల కవిత్వం పై కావల్సింది అవగాహన గాదు గుడ్డితనం. కవిత్వాని అరుపులు, కేకల స్థాయికి దిగజార్చే అస్థిత్వాలమీద గౌరవముంచుకోడం వ్యర్థం.

  16. 16
    K Viswa Says:

    విపుల్ గారు కవిత్వానికి ఎన్ని రూపాలున్నా, ముఖ్యంగా కవిత్వం ఉండి తీరాలనే విషయంలో మీరు అంగీకరిస్తారనే అనుకుంటాను.

    కవిత్వంలో సమకాలీనత ఉంటుంది. ఉండాలి. ధిక్కారస్వభావం అంతస్సూత్రంగా కవిత్వం ఈనాడు వచ్చింది కాదు. వేమన కాలం నాటి నుంచే ఉంది. కాకపోతే, ధిక్కార స్వభావం అంటే, దిక్కులు పిక్కటిల్లేటట్లు నినాదాలు, అభిప్రాయాలు చెబితే వచ్చేది కవిత్వం కాదు.

    స్పందనం జీవలక్షణం అన్నారు. జరిగిన దుశ్చర్యకు ప్రతిజీవి తనదైన తీరులో స్పందిస్తుంది. అందుకు అనుగుణంగానే తీవ్రవాదులను ఏరివేయాలని, ప్రభుత్వ దృక్ఫధం మారాలని రకరకాల అభిప్రాయాలతో ఈమధ్య వార్తాపత్రికల్లో వస్తున్నాయి.

    ఇక్కడ గమనించాల్సిందేమిటంటే, కవికి జీవికి ఉన్న తేడా ఏమిటి? జీవికి సహజంగా కలిగే స్పందనకు రససిద్ధిని కలిగించగలిగింది ఒక్క కవే. ఈ కవితలోని అభిప్రాయాలతో కలిగిన రససిద్ధికి, పత్రికలలో వచ్చిన వ్యాసాలకి, ఉత్తరాలకి ఎటువంటి తేడా ఉన్నదనేది వేరే చెప్పనక్కరలేదు.

    ‘మార్ డాలో సాలేకో’ అన్న వాక్యం ఒక సాధారణ వ్యక్తీకరణే తప్ప, కవిత్వం కాగలిగే రససిద్ధి ఉన్నది కాదు. అలానే మిగతా వ్యక్తీకరణలు కూడా.

    వర్ణాశ్రమ విధానాన్నివ్యతిరేకిస్తూ వచ్చిన ఆయావాద కవిత్వాలు, నిజానికి చేస్తున్నదేమిటి? విశ్వజనీనమైన కవిత్వానికి, కులమతాల పేరిట అడ్డుగోడలు కట్టటమేనా? మనిషిని మనిషిగా స్పందింపచేయగలిగేది కవిత్వం. అంతేకానీ, మనిషిని ఒక దళితుడిగానో, ఒక స్త్రీగానో మాత్రమే స్పందింపజేసేది కవిత్వం ఎలా అవుతుంది?

    అలోక్ గారు ప్రశ్నించినట్లువచన కవిత్వం అనే ‘హైబ్రీడ్’ పేరేమిటి? వచనం వచనమే, కవిత్వం కవిత్వమే. వచనకవిత్వం అన్న రోజునే, వేరు వేరు పేరాగ్రాఫులతో రాసే వ్యాసాలకు, నినాదాలకు కూడా కవిత్వమనే ముద్ర వేసే సంప్రదాయం మొదలయ్యింది. ఈ విషయంలో, ప్రస్తుత కవిత్వాన్ని ‘ఆధునిక కవిత్వం’గానే పరిగణించాలి కానీ, ‘వచన కవిత్వం’ అనే వంకరపేర్లతో కాదు.

  17. 17
    Vipul Says:

    విశ్వం గారు

    మీ ప్రతివిమర్శ చదివాను. ఇంత బాగా అభిప్రాయం రాయగలిగి ఉండి మూడుముక్కలతో కవిత బాగోలేదని మొదట మీరు రాయడం ఆశ్చర్యం కలిగించింది.

    కవిత్వం విశ్వజనీనమని అంగీకరించకుండా ఎవరూ ఉండరు. మనిషిని మనిషి గా స్పందింపచేసేది కవిత్వమే అవుతుంది. బాధతోనో దుఃఖంతోనో రాయడం ఉంటుంది. మీ దౄష్టిలో అణచివేత దుఃఖం కాదా. వాళ్ళ దుఃఖాన్ని వాళ్ళలోనే లోలోపల కుంగిపోతున్నట్లు వ్యక్తీకరించాలా. వాళ్ళు శిల్పం, చందస్సు, ప్రాసలను పాటించాలా. సాహిత్య చరిత్రను తిరగరాయమని ఎందుకన్నారో ఇప్పుడర్థమవుతుంది నాకు. అస్థిత్వ ఉద్యమాలను అంగీకరించకపోతే బూజుపట్టిన పాత సాహిత్య నమూనాలనైనా అవతల పారేయాల్సిందే కదా. కాలం దానిని ఋజువు చేసింది. మనిషిని మనిషిగా అర్థం చేసుకునే విశ్వజనీనత సంకుచిత పద్యకావ్యాల్లో, ముందే నిర్దేశించబడిన కవిత్వనిర్మాణాల్లోనే ఉందా.

    విశ్వజనీనమైన ప్రపంచంలో బహుజనులే ఎక్కువగా ఉన్నారు. కవి పండితులకంటే కిందికులాలవారే ఎక్కువగా ఉన్నారు. అసలు ఇంకా మన మైదాన ప్రాంత సాహిత్యంలోకి రాని గిరిజనులెందరో ఉన్నారు. వాళ్ళకి సరైన చదువులే లేవు. ఇక మీ శిల్పకళాచాతుర్యాలు ఎలా వస్తాయి. వాళ్ళకి కవిత్వ సిద్ధాంతాలు, అనుభూతి రసాసిద్ధి సూత్రాలు తెలియదని వాళ్ళని కాదంటామా. అసలు మన సాహిత్యమే వాళ్ళ కళారూపాల్లోకి వెళ్ళవలసి ఉంది. అదొక మేరుపర్వతమైతే మనం సౄష్టించుకున్నది లేశమాత్రం. విశ్వజనీనంత గురించి చెప్పే హక్కు వాళ్ళకే ఉంది. కాదంటారా.

    అసలు విషయాన్ని విడిచిపెట్టి ఈ చర్చమంతా అప్రస్తుతం. అదంతా అస్థిత్వ ఉద్యమాలగురించిన విషయమం. వాటిని పట్టించంకోనివారి అస్థిత్వం రూపుమాసిపోతుంది.

    ఇక వచన కవిత్వం గురించిన గొడవ ఈనాటిది కాదు. ఇప్పటితో ఆగిపోయేది కాదు. వచనం లేకుండా కవిత్వం లేదు. ఇదివేరే విషయం. ఇదీ అప్రస్తుతమే.

    దిక్కులు పిక్కటిల్లే అరుపులు కేకలు నినాదాలు, ప్రతిజ్ఞలు కవిత్వం ఎందుకు కారాదు. అవన్నీ ఉన్న ఉత్తమకవిత్వం మన సాహిత్యంలో లేదా…

  18. 18
    Alok Says:

    “దిక్కులు పిక్కటిల్లే అరుపులు కేకలు నినాదాలు, ప్రతిజ్ఞలు కవిత్వం ఎందుకు కారాదు”

    ఎందుకవదో విశ్వగారు విపులంగా రాసారు గదా! ఐనా సరే అది గూడా కవిత్వమంటారా, ఆ మొనెప్పుడో రోశయ్య “చెయ్యి తీస్తా” అన్నాడు. అది గూడా కవిత్వమనే చెలామణీ చేద్దాం.

    బోయవాడి దుఖం నుండే గదా మన కవిత్వం బైలుదేరింది.

    కవిత్వం విశ్వజనీనమంటూనే కులమతాలే కాకండా మైదానాలు, పీఠభూములంటూ జాగ్రఫీ పరిమితుల్ని అంటగట్టడం యే విధపు మేధావితనం?

    మనిషిని మనిషిగా స్పందింపజేసేది కవిత్వమే కానక్కరలేదు. చాలాసార్లు మాటలు, కొన్నికొన్ని సార్లు వార్తలు, వ్యాసాలు ఆ స్పందనని కలగజేస్తాయి. కవిత్వం ఈ సామాన్య స్థాయికి చెందిందిగాదు. అది మనిషిని మనీషిగా స్పందింపజేసేది. విదుల్చుకోలేని భావాల తాకిడిని పుట్టించేది. వెన్నుపూసని నిటారుగా నిలిపేది. ఇది అరుపులు, కేకలు, పెడబొబ్బలతో పుట్టేది గాదు.

    కవిత్వానికి నీ, నా భేదాలు తెలీవు. తెలిసిందల్లా వొక్కటే. మనిషి.

    శిల్పాన్ని, ఛందస్సుని, ప్రాసని కలగలపి చూడ్డం పొరబాటు. అప్పటినుండి ఇప్పటివరకు శిల్పం వుంది. ఛందస్సు మారింది. ప్రాస ఇంకా బతికి బట్టకడుతోంది.

    అస్థిత్వ ఉద్యమాలు రాజకీయాల్లోని భాగం. రాజకీయం కవిత్వంలోకి చొరబడ్డం అహేతుకం.

    అనుభూతి, రససిద్ధి కలగాలంటే అలంకార శాస్త్రాల్ని చదవి తీరాలనే నియమం లేదు. అవి పుస్తకాల్నుండి పుట్టేవే ఐతే చదువురానోళ్ళ సంసారం రసహీనమే అవ్వాలి. “సాహిత్యం” కళారూపాల్లోకి వెళ్ళడం మంచిదే. గానీ అదంతా గూడా కవిత్వమే అనుకోరాదు.

    ఉత్తమసాహిత్యం ఉదాత్తంగా వుంటుంది, జుగుప్సకి ఆస్కారమివ్వకండా.

  19. 19
    Vipul Says:

    అభిప్రాయ ప్రకటన ఒక్కొక్క సారి ఇలా దుర్వినియోగం అవుతుందేమో…

  20. 20
    indra prasad Says:

    అయ్యయ్యో మేష్టారూ అర్ధం వ్యర్ధపదమైపోతోందా… అట్లా జరగడానికి వీల్లేదు. అర్ధం తన అస్తిత్వాన్ని ధిక్కార స్వరంతో అవసరమైతే “నీ యమ్మా… నీ యంకమ్మా” లాంటి పదప్రయోగాలతో ప్రకటించాల్సిందే. దీనికి నేను “అర్ధాస్తిత్వ పరిరక్షణా వాదం” అని నామకరణం చేసాను. even i too added another piece of piDaka to the fire of isms.

  21. 21
    మామిడి మనిషి (ఆమ్ ఆద్మీ) Says:

    మీ పిడకలవేటకి రామాయణం కావాలంటే కలైంజర్ (கலைஞர்) కరుణానిధిని అడగండి.
    మీకు విపరీతమైన “బ్లాగో”చలనాలౌతున్నట్టనిపిస్తే, ప్రతిరోజూ బోల్డు సైట్లు పుడుతూనేఉన్నాయి.
    వెళ్ళి, మీ ప్రతాపాల్నక్కడ చూపండి.

    you will get lots of claps there, – THIS not being a blog-site, can’t satisfy your piDakaveta desires!!

  22. 22
    మామిడి మనిషి (ఆమ్ ఆద్మీ) Says:

    (quote)
    ఖూనీ…. బ్లడ్‌సక్కర్‌…. మాన్‌ఈటర్‌
    మార్‌డాలో సాలేకో….
    ==========================

    ఎంతోమంది పాఠకుల్లాగే, నాక్కూడా, ఈ కవిత(?)ను ఇక్కడే ఆపేస్తే బాగుండేదనిపించింది.

    దీని తర్వాత రాసిన మూడు పంక్తులగురించి “for” & “against” గా చాలామంది రియాక్ట్ అయ్యారు కూడా!

    ఐతే – ఇప్పుడే… అంటే ఒక పదినిమిషాలముందే, ఒక 73 ఏళ్ళ పెద్దమనిషితో నాకు జరిగిన సంభాషణ నన్ను కుదిపేసింది. నా ఆలోచనల్ని మళ్ళీ “రక్త మాంస” పు topic వైపు మళ్ళించింది.

    ఆయన ఇలా అన్నారు:
    “ఫలానా(XYZ) person కు డబ్బు అలవాటు అయినట్టుందండీ. అందుకే అలా ప్రవర్తిస్తున్నాడు.”
    అక్రమమార్గాల్లో డబ్బు సంపాదించే క్రమాన్ని ఒక “రక్తం రుచి మరిగిన పులి”ప్రవృత్తితో పోలుస్తూ, ఆయన తాను ఎన్నో ఏళ్ళ క్రితం బెంగుళూర్లోచూసిన సర్కస్ సంఘటనను గుర్తుచేసుకున్నారు, కళ్ళకు కట్టినట్టు వర్ణించారు.
    “ఆనాటి సర్కస్ లో ఏం జరిగిందంటే, రోజులాగే పులితో ఒక ఫీట్ ప్రదర్శింపబడుతోంది. పులి నడుస్తూ వచ్చి ఒక స్టూల్ పై నుంచోవాలి. నెమ్మదిగా తన వెనకరెండు కాళ్ళపైనె స్టూల్ పైన నిలబడుతూ, ముందు కాళ్ళను అమాంతంగా, తన ముందు (వీపు అభిముఖంగా) నిలబడే ఒక అమ్మాయి భుజాలపై నిలబెట్టి బాలన్సు చేయాలి.”
    “కానీ – నడుస్తూవచ్చిన పులి, స్టూల్ పైన నిలబడుతున్నంత వరకూ, మామూలుగానే ఉన్నట్టున్నా, అమ్మాయి భుజాలపై కాళ్ళను ఆనించి…ఒక్క ఉదుటున ఆ అమ్మాయి తలను రెండువైపుల్నించీ crush చేసి చంపేసింది. ఈ హఠాత్పరిణామానికి, ప్రేక్షకులు, నిర్వాహకులూ దిగ్భ్రాంతులైనారు. మనిషిని తినడానికిసిద్ధపడిన ఆ పులి, ఆమె శరీరాన్ని నోటగరుచుకోవడం, వెంటనే నిర్వాహకుల్లో ఒకరు gun తో ఆ పులిని చంపడం జరిగింది.”

    “తరువాత తెలిసిన విషమేమిటంటే, ఆ అమ్మాయి తన periods సమయంలో ఈ ఫీట్ చేయడంవల్లనే, ఎంతో tame చేయబడ్లిఆ పులిసైతం, రక్తపువాసన పసిగట్టి ఒక “కౄరమృగం” గానే ప్రవర్తించింది.”
    1975-80 కాలంలో(ఆయనకి సరిగా గుర్తులేదు) , bangalore rly station దగ్గరిగ్రౌండ్ లో gemini circus సంఘటన ఇది.
    ఆ నాడు జరిగిన stampede లో మరో 16 మంది మరణించారట.
    ఈ సంఘటనలాంటి పాఠాలవల్లనైతేనేం, animal lovers group వంటి వారివల్లనైతేనేం, మొత్తానికి సర్కసులూ, జంతువులతో ఫీట్లూ, ఆటలూ నిషేధింపబడ్డాయి.

    యానిమల్-లవర్సంటే, ఇంకో ముఖ్యవిషయం చెప్పుకోవచ్చిక్కడ:
    హైదరాబాదులోనూ, మిగతా ఆంధ్ర పట్టణాల్లోనూ ఈ మధ్య వీధి కుక్కలెన్నో,అడవి మృగాల్లాగా ప్రవర్తిస్తూ ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తున్నాయట. ఇవి చిన్నపిల్లలపై దాడి చేస్తున్న వార్తలుకూడా తరచూ చదువుతున్నాం, వింటున్నాం.
    tv9 వాళ్ళైతే, పసికందులపై, మృతశిశువులపై కుక్కల/పందుల దాడులగురించి ఒక కథనాన్నే ప్రసారం చేసారు.
    ఇవన్నీ చూస్తే, నేను navi mumbai లో ఉన్న కాలంలో, times of india వాళ్ళు ప్రచురించిన ఒక న్యూస్ గుర్తొచ్చింది.
    అక్కడ కూడా, వీధి కుక్కలు మనుషులపై దాడి చేస్తున్న విషయాలను గమనించి వారు తెలియజేసిందేమైటంటే, కొందరు స్త్రీలు తాము వాడిన sanitary pads ని నిర్లక్ష్యంగా, ఓపెన్ గా చెత్తకుండీల్లో పడవేయడం వల్ల, “ఆ రక్తపు” వాసన సైతం ఇలాంటి, విపత్కర కారకమౌతున్నదని!

    మరి, మన దగ్గరైతే, ఈ మధ్య చెత్తకుండీల్లోకీ, నాలాల్లోకి అనాథ శిశువుల ప్రస్థానం ఎంతగా పెరిగిందో తెలిసిందే.

    “మరి – ఒక జంతువుకైతే, స్వభావసిద్ధంగా రక్తపువాసనతో associated రియాక్షన్లనుకుంటే……… వందలాది మందిని చంపే ఈ త్రాష్టులు ఏ వాసనలు మరిగినట్టు???”

    నిజంగానే, పచ్చి (మేక) నెత్తురు, పచ్చిమాంసం తినే ఘోర అలవాట్లున్న క్రిమినల్సు ఉన్నారని మనం చదివినప్పుడు, (తినడానికి కాకపోయినా) ఖండఖండాలుగా మాంసపుముద్దలను పేరుస్తూ, రక్తపుటేరులనూ పారిస్తూన్న్ వాళ్ళను మనమేమందాం??

    అన్వరోవాచ:
    …. బ్లడ్‌సక్కర్‌…. మాన్‌ఈటర్‌
    మార్‌డాలో సాలేకో….

    బహుషా,
    నా లేదా నీ చెల్లెలో……. కూతురో , ఇలాంటి సంఘటనలో విధివశాత్తూ చిక్కుకొని,
    ఇలా రక్తపు/మాంసపు ముద్దగా… గుర్తుపట్టలేని విధంగా ఉంటే..
    దానికి అసలుకారకుడు(లు) ఎదురుగా ఉంటే అన్వర్ చెప్పినట్టే చేస్తామా?
    కనీసం అలా ఆలోచిస్తామా? ఊరికే చూస్తామా?
    as we are alien to such reality, we can comment anything.. – isn’t it??

    అన్వర్ భాయ్…
    పులి, కుక్క, పంది్ లాంటివే… ఇప్పటివరకూ తెలిసిన మృగాలు (రక్తపువాసనకు పురిగొల్పబడేవి)
    మరి – వీళ్ళ రక్తమాంస దాహాలకు trigger points , solutions గురించికూడా ఆలోచించండి.

  23. 23
    Mahendra Bhupati Says:

    పాత దారుణ సంఘటనల్ని ఆమ్ ఆద్మీ గారి చేత మననం చేయించడం అన్వర్ గారి కవిత గురిని చేరిందనడానికి సాక్షి. 1970 – 80ల్లో జరిగిన ఆ దారుణ సంఘటన అప్పటి పత్రికల్లో వచ్చే ఉంటుంది. ఐతే మాలాంటి ఈనాటి వారికి ఆ పత్రికలు దొరికే అవకాశం ఉండదు. ఈరోజు అన్వర్ గారి కవిత ద్వారా ఆ దారుణ సంఘటనని తెలుసుకునే అవకాశం కలిగింది. అందుకు అన్వర్ గారికి, ఆమ్ ఆద్మీ గారికి నా ధన్యవాదాలు.

  24. 24
    chavakiran Says:

    నాయనా మామిడి (30) గారూ, మీరు అనవసరంగా మా బ్లాగులని తిట్టుతున్నారు. మీ పత్రికల కంటే మా బ్లాగులు ఎంతో మేలు…………(అని నే అంటే ఎలా ఉంటుంది? )

  25. 25
    Anonymous Says:

    ఓహో! ఇక్కడ కూడా విశ్వ, అలోక్ గార్ల చర్చలా! అప్పుడెప్పుడో తెలుగుపీపుల్ సైటు లో చూశాను…ఈ మధ్య నే ఈమాట లో అలోక్ గారిని పునర్దర్శించాను….మళ్ళీ ఇక్కడ…మీ ఓపిక్కి జోహార్లు…..

  26. 26
    Pranahita Sampadakavargam Says:

    పాఠకులకు విన్నపం

    దయచేసి చర్చ నిర్మాణాత్మకంగా జరగాలని విన్నపం. కవిత బాగాలేదంటే ఎందుకు బాగాలేదో వివరంగా విమర్శనాత్మకంగా చక్కగా రాయగలిగిన సాహితీ మిత్రులు అర్థం పర్థం లేకుండా కామెంట్లు రాయడం దురదృష్టకరం. అందుచేత కొన్ని కామెంట్లు తొలగించడమైనది. మీ అభిప్రాయాలను దయచేసి ఒక ఆరోగ్యకరమైన చర్చను నిర్మాణాత్మకంగా కొనసాగే విధంగా, ప్రజాస్వామిక సాహిత్యానికి మేలు చేసే విధంగా వ్యక్తం చేయాలని, పత్రిక లో చర్చలో కనీస నియమ నిబంధనలు పాటించాలని మా విన్నపం. మేము ఏ వాదాన్ని సమర్థించడం లేదు వ్యతిరేకించడం లేదు. ఆయా ప్రజా సమూహల ప్రజాస్వామిక ఆకాంక్షలని వ్యక్తం చేస్తూ, ఇతర ప్రజా సమూహాల ప్రజాస్వామిక అభిప్రాయాలని గౌరవించే విధంగా ఉండే సాహిత్యాన్ని మేము అహ్వానిస్తున్నాం. అయితే కొన్ని సార్లు మేము ఎంపిక చేసిన సాహిత్యం పాఠకులకు సాహిత్యంగ కనబడక పోవచ్చు. దానిలో కనీస సాహిత్య ప్రమాణాలు లేనట్టు అనిపించవచ్చు. అటువంటప్పుడు పాఠకులు తమ అభిప్రాయాలని సరిఅయిన పద్దతిలో, ఆ రచయితలకు, మిగతా పాఠకులకు తోడ్పడే విధంగా ప్రకటిస్తే మంచి చర్చ జరుగుతుంది. అటువంటి చర్చ ని మేము మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాము. కాబట్టి అభిప్రాయాలు వ్యక్తం చేసే పాఠకులు దయచేసి ఇది దృష్టిలో వుంచుకోవాలని మా విన్నపం.
    - ప్రాణహిత సంపాదకవర్గం.

  27. 27
    Vipul Says:

    ఈ కవితమీద జరిగిన చర్చలో కొందరు వెకిలి విమర్శకులు తయారయ్యారు. వీరు నిజమైన పాఠకులనలేం. తాము నమ్మినదానిమీద తమకే నమ్మకంలేక అసలు పేరు దాచి మారుపేర్లు పెట్టుకున్న ఈ ముసుగువీరులెవరో తెలీదు. ఎవరైనాగానీ అర్థంపర్థంలేకుండా చవకరకం వెకిలి విమర్శలు చేయడం బాధాకరం. పాఠకులు, రచయితలు, విమర్శకులు తమతమ విలువైన అభిప్రాయాలను తెలియచేయడానికి ఇచ్చిన స్వేచ్చ, అవకాశం ఒక్కొక్కసారి ఇలా దుర్వినియోగం అవుతుంది.

  28. 28
    జోహారు జోహారు విమర్శక సిఖామణులకు Says:

    అదేమిటో గానీ… ఓ పక్క ఈ అలోక్,విశ్వ గార్లు వాళ్ళు గొప్ప విమర్శ్కులని అనుకుంటూ ఉంటారా…..ఓ పక్క వాళ్ళు ఎక్కడికెళ్ళినా ఇట్లాగే ఆ కామెంట్ల ను తొలగించడమూ….లేక పోతే వాళ్ళని మిగితా వాళ్ళు తిట్టడం..ఇదే తంతు….. అందుకే…… జోహార్లు వారికి…. consistency ఉన్నందుకు.

  29. 29
    ఆమ్ ఆద్మీ Says:

    quote:
    “విశ్వజనీనమైన ప్రపంచంలో బహుజనులే ఎక్కువగా ఉన్నారు. …
    …..వాళ్ళకి సరైన చదువులే లేవు….
    ..వాళ్ళకి కవిత్వ సిద్ధాంతాలు, అనుభూతి రసాసిద్ధి సూత్రాలు తెలియదని వాళ్ళని కాదంటామా. అసలు మన సాహిత్యమే వాళ్ళ కళారూపాల్లోకి వెళ్ళవలసి ఉంది. అదొక మేరుపర్వతమైతే మనం సౄష్టించుకున్నది లేశమాత్రం. విశ్వజనీనంత గురించి చెప్పే హక్కు వాళ్ళకే ఉంది. కాదంటారా.
    అసలు విషయాన్ని విడిచిపెట్టి ఈ చర్చమంతా అప్రస్తుతం. అదంతా అస్థిత్వ ఉద్యమాలగురించిన విషయం. వాటిని పట్టించంకోనివారి అస్థిత్వం రూపుమాసిపోతుంది”
    unquote:

    విపుల్ గారూ, excellent!!

  30. 30
    ఆమ్ ఆద్మీ Says:

    alok గారు రాసిన దాంట్లోంచి quote:
    “అస్థిత్వ ఉద్యమాలు రాజకీయాల్లోని భాగం. రాజకీయం కవిత్వంలోకి చొరబడ్డం అహేతుకం.”
    unqoute”

    1. అస్తిత్వ ఉద్యమాలను “రాజకీయా”ల్లో భాగమనడం సబబేనా?
    2. కాదేదీ “కవిత కనర్హం” అన్న వాక్యం ఒక నినాదంగా / నానుడి స్వీకరించిన మనం, దాంట్లో రాజకీయ topics కోసం ఒక “*”conditions apply అన్నది add చేసుకోవాలా?

    ఈ విషయాన్ని, నిజంగానే చర్చించదలచుకుంటే -
    “దయచేసి చర్చ నిర్మాణాత్మకంగా జరగాలని విన్నపం”
    అని కోరుతున్న సంపాదకవర్గంవారి అభ్యర్థనను మనమందరం పాటించగలిగితేనే ఇలాంటివి చర్చిద్దాం!!

  31. 31
    T.L.Bala Subrahmanyam Says:

    ఏది రాసినా “ఒక వందేళ్ళ తరువాత నిలబడే సామర్థ్యమూ ప్రయోజనమూ సత్తా దీనికున్నాయా ?” అని ఆలోచించి ప్రచురించుకోవాలి.

  32. 32
    T.L.Bala Subrahmanyam Says:

    ఏది రాసినా “ఒక వందేళ్ళ తరువాత నిలబడే సామర్థ్యమూ ప్రయోజనమూ సత్తా దీనికున్నాయా ?” అని ఆలోచించి ప్రచురించుకోవాలి.

  33. 33
    Alok Says:

    బాల సుబ్రమణ్యం గారూ వందేళ్ళ తర్వాత బహుజనులు పోయి అల్పజనులు వుద్యమాలు జేస్తారేమో. ఇప్పుడున్న వాదాలు ఆనాటికి అవుట్ డేటెడ్ ఐపోతాయేమో!

    వాదాలెప్పుడూ అల్పాయుష్యాలే. మోజున్నన్ని రోజులే వాటి జీవనం. సంచలనానికున్న ఆకర్షణా బలం సంయమనానికుండదు.

    వాదాలు, ఇజాలు రాజకీయాలకే పరిమితం. కవిత్వానికి అవి అంటరానివి. రాజకీయాలను మాట్లాడే కవిత్వం రాజకీయమంత సంకుచితమే. ఆట్లాంటి కవిత విశ్వజనీనం కాలేదు. నీ మనసులోని మాటని ప్రపంచపు మరోమూలలోని వాడు నిన్ను వివరణ అడకండానే అర్థం చేసుకోడమే కవిత.

    మనిషిని మనిషిగా ఆవిష్కరించగలిగేదే కవిత. మందలు గట్టి వూరేగే మనస్తత్వం కవిత్వంలో ఇమడలేదు.అట్లాంటి మనస్తత్వం మనసును తాకే కవిత్వాని రాయనీయదు.

    కైపుమీరువేళ గడకు జెరగరాదు
    అనువుదప్పి మాటలాడరాదు
    సమ్యమెరుగనతడు సరసుండు కాడయా
    విశ్వదాభి రామ వినుర వేమ

    నానా వాదాలకి వేమన జెప్పిన కైపుకి గొప్ప తేడా ఏవీ లేదు. పెడబొబ్బలెట్టే కవిత్వం అనువు దప్పి మాట్లాడ్డవే. సమ్యమనమంటే చేతులు కట్టేసుకొనో, నోరు కుట్టేసుకొనో వుండే తనం గాదు. సూటిగా సారాంశపూరితంగా నినాదరాహిత్యంగా వుండి “ధనుర్వినిర్ముక్త శరం”లా దూసుకపోయేది. అట్లాంటి మాటని వొక్కటి రాసినా వాడు సరసుడే. కవే

  34. 34
    Alok Says:

    “కాదేదీ కవిత కనర్హం” అని చదవగలినప్పుడు “ఔనౌను శిల్ప మనర్ఘం” అని తెలుసుకోరెందుకు? “అంతరాంతర జ్యోతిస్సీమలని ఆవిష్కరించా”లని అనుకోరెందుకు?

    రోజువారీ విషయాల్ని రాసేస్తే, అదే కవిత్వమైతే “అలోక సామాన్యం అభివ్యనక్తి” అని చెప్పడంలోని అర్ధమేమిటి?

    “Poetry should be great and unobtrusive, a thing which enters into one’s soul, and does not startle it or amaze it with itself, but with its subject” అనే జాన్ కీట్స్ మాటలకి యేవిటర్థం?

    “Why the hell don’t the schools give a little rudimentary education in economics, the history of economics, and in the use of language” అని ఎజ్రా పౌండ్ అన్నాడు. దీనర్థమేవిటి?

    “గణితశాస్త్రం, భౌతికశాస్త్రం లాంటి ఏ విజ్ఞానశాస్త్రమైనా, సంగీతం, చిత్రలేఖనం లాంటి ఏ కళైనా అందులో కృషి చేసి కనీస పరిజ్ఞానం సంపాదించిన వాళ్ళకి కాని అర్థం కావే? ఒక్క కవిత్వం మాత్రం జనసామాన్యానికి ఏ అర్హత లేకుండానే అర్థం కావాలనడంలో నాకర్థం కనిపించడం లేదు” అని ఇస్మాయిల్ చెప్పడంలోని ఔచిత్యమేవిటి?

    కవిత్వమంటే ఉత్తమమైన భావాల్ని ఉత్తమమైన మాటలతో ఉత్తమమైన రీతిలో ప్రదర్శించడమేనని ఇలియట్ చెప్పాడు.

    పై అన్నిటి అర్థమేమంటే “కాదన్నీ కవితకు అర్హ”మనే.

  35. 35
    ఆమ్ ఆద్మీ Says:

    ఆలోక్ గారూ..
    మీరు చాలా బాగా analysis చేస్తారు.
    మీ పదాల్లో, వ్యాఖ్యల్లో ఆ పదును అధ్భుతంగా కనబడుతున్నది.

    ఐతే, చదవడాన్ని (TV, RADIO ల బదులు) ఎక్కువగా ఇష్టపడే ప్రతిపాఠకుడూ starting నుండే విమర్శనాత్మకంగానో, లేదా తామే రాస్తే ఎలా ఉంటుందనో ఊహించలేకపోవచ్చు.
    చదివినకొద్దీ, తాము కూడా ఏదైనా రాయాలని అనిపించే కొంత మార్పులు వారిలో పుడుతూండవచ్చు.

    రచించిన product “out-put” ఏదైనా (కవిత, కథ, వ్యాసం, అభిప్రాయం, సమీక్ష, సంఘటన, వార్త etc), దానికి స్పందించే ప్రతీహృదయం ఒక “స్థాయి”కి తగినట్టుగా తన భావాన్ని వ్యక్తీకరించలేక పోవచ్చు.
    ఈ pattern నే మనమిప్పుడు, పాఠకుల feed-back వ్యాఖ్యల్లో గమనిస్తున్నం.

    పైన రాసిందాన్ని మీరంగీకరిస్తే, అలాంటి approach నే మనం రచయితలపట్ల కూడా చూపించినప్పుడే, వారిలో కూడా gradual improvement వస్తుందని నేననుకుంటున్నాను. మీరేమంటారు?

    మీ అంతబాగా విమర్శను రాయగలిగే స్థాయికి రావాలని కొండరు aspire చేస్తున్నట్టుగానే, రచనల్లో కూడా తమకు నచ్చిన పంథాలో రచనలు చేస్తూ imporve అవాలనుకునే రచయితలను కూడా ప్రోత్సహించగలుగుతాం!!

  36. 36
    Mallikarjuna Rao D Says:

    మంచి చర్చ. ముందుగా ఎవరి అభివ్యక్తిని వారు వ్యక్తం చేసుకోవచ్చు. ఇందులో విభేదాలకు తావు లేదు. ఐతే ఏ వాదపు కవిత్వమైనా అందులో కవిత్వం ఉండి తీరాలని అంతా ఒప్పుకుంటారనుకుంటాను. ఎప్పుడైతే ఒక రచనని మనం కవిత్వమంటామో అది ఏ వాదానికి సంబంధించినదైనా ఆ రచనలో ఆ వాదానికతీతమైనదేదో ఉంటుంది. అందుకే అది ప్రతి మనిషినీ చేరుతుంది.

    ఈ కవిత(??) లో అన్వరు గారు సాధించిన సామాజిక ప్రయోజనమేమిటి? తీవ్రవాదులు చర్యని ఖండించని వారుండరు. ఐతే కేవలం తీవ్ర వాదుల చర్యని ఖండిస్తూ , వాళ్ళని తిడుతూ ఏం రాసినా కవిత్వమైపోతుందా అన్నది నా ప్రశ్న. ఇది చదివాక నాలో జుగుప్స మాత్రమే కలిగింది. ఐతే జుగుప్సాకరంగా కవిత ఉండకూడదా, కేవలం ఆహ్లాదకరంగానే ఉండాలా ? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు. ఒక కవిత జుగుప్సాకరంగా ఉన్నా అంతకంటే అతీతమైన భావాన్ని దేన్నో కవిత అందుకోవాలి. ఈ కవిత అందులో విఫలమైంది. కాబట్టి ఈ రచనని కవిత గా అంగీకరించలేను.

  37. 37
    Alok Says:

    ఎజ్రా పౌండ్ “ABC of Reading” లో ఇల్లా అన్నాడు

    You would think that anyone wanting to know about poetry would do one of two things or both i.e. LOOK AT IT or LISTEN TO IT. He might even THINK about it?
    And if he wanted advice he would go to someone who KNEW something about it?

    If you wanted to know something about an automobile, would you go to a man who had made one and driven it, or to a man who had merely heard about it? would you look at the actual car or only at the specifications?

    In the case of poetry, there is, or seem to be, a good deal to be looked at. And there seem to be very few authentic specifications available.

    సాగరసంగమం జూసి భరతనాట్యాన్ని, శంకరాభరణాన్ని జూసి సంగీతాన్ని నేర్చెయ్యాలన్న దురద అందరికీ పుట్టవచ్చు. గానీ కాలం దాన్ని కాస్త గోకేస్తే ఆ దురద మళ్ళీ పుట్టకపోవొచ్చు. అల్లాగే నలుగురి రాతల్ని చదవగానే “నేను సైతం…” అంటూ బయల్దేరిపోవొచ్చు. ఐతే అల్లా బయలుదేరేస్తే దిక్కుతోచని ప్రయాణీకుడై ముక్కు బద్దలు జేసుకొంటారే తప్ప గురిని ముట్టరు.

    “శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే” అన్నాడు ఆనందవర్ధనుడు. కవిత్వం వుట్టి శబ్దాలు, వాటి అర్థాలవల్ల యేర్పడదని తెగేసి చెప్పాడు. గానీ ఇప్పుడు కేకలేసేవాడే కవని, భాడకోవ్ సాలే అనడమే కవిత్వమని చెలామణి ఔతోంది.

  38. 38
    ఆమ్ ఆద్మీ Says:

    Let us read this again!!
    quote:
    1. రోడ్డు మీద ప్రమాదాల్లో
    నుజ్జునుజ్జయ్యే మానవశరీరాలు
    గుర్తుపట్టొచ్చు
    గుండెనిబ్బరంతో శవసంస్కారం చెయ్యొచ్చు

    2. మసీదు పార్కు ఛాట్‌భండార్‌లలో
    మహానగరంలో బాంబు పేలితే…
    మనుషులు రక్తపు ముద్దలు ముద్దలుగా…
    అక్కడొక ముద్ద… ఇక్కడొక ముద్ద
    ఎన్ని రక్తపు ముద్దల్ని పోగుచేసి
    ఎవరని గుర్తుపడుదాం?

    3. తల్లి గర్భం నుంచి పిండాన్ని బలవంతంగా లాగి
    నేలమీద పడేసిన రక్తపు ముద్దలాగా శవాలు

    4. దేశీయ విదేశీయ విధేయతా కుట్ర
    బాంబు పేలుళ్ళు –
    ఎవరికోసం ఎవరికోసం ఎవరి పైశాచికం
    ఎక్కడి పగ…
    unqoute:

    మళ్ళీ, మళ్ళీ.. చదివిచూడండి.
    1 నుండి 4 వరకూ అన్వర్ గారి భావావేశం, ఆవేదనా సరిగ్గానే ప్రవహించిందని ఒప్పుకుంటారు!!

    ఆ తర్వాతి పంక్తుల గురించే గదా వివాదమంతా…
    ఐతే, ఒక corporate power-point presentation ఐనా, చాలా కష్టపడి ఒకరు తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్టైనా మరొకరిద్దరి ద్వారా “FINE-TUNING” కి నోచుకున్నాకనే ఒక చక్కని out-put గా వెలువడుతుంది.
    బహుషా – కవితల, గేయాల రూపకల్పనలోకూడా (design) అటువంటి mentoring కి మనం ఆస్కారమిస్తే, నూతన రచయితలను ప్రోద్బలపరిచడంలో ఆ ప్రక్రియ ఒక కొత్త “ఒరవడి” కాగలదేమో!

    “రచన” మాసపత్రికలో ఎన్నో సంవత్సరాలుగా కథలనురాయడం ఎలా అన్నదానిగురించి ప్రముఖులు “వసుంధర” దంపతులు “సాహితీవైద్యం” అన్న శీర్శికన బహువిశ్లేషణాత్మకంగా ఎన్నోసూచనలిస్తూ పుణ్యంగట్టుకుంటున్నారు.

    విమర్శ అన్నది చీల్చి-చెండాడే విధంగానో.. వ్యంగంగానో, వెకిలిగానోబదులు, సూటిగా, ఒక సూచనప్రాయంగా ఉంటే, ఆ రచయితక్కూడా popular opinion, readers reflexes అర్థమై, ఆయన కలంనుండి వెలువడే తదుపరిరచనల్లో తదనుగుణ మార్పులను చూపించవచ్చు.

    ప్రాణహిత పాఠకులు అటువంటి అపురూప పాఠకులైతే, రాసేవారికి అంతకన్నా కావల్సిందేముంటుంది.

  39. 39
    ఆమ్ ఆద్మీ Says:

    మరాఠీలో ఒక మంచి సామెత ఉన్నది.

    “ज़े गांवाला जाएचा नै … त्या गांवाचा वाट कशाला??”

    అంటే..
    “ఏ ఊరికి వెళ్ళే అవసరం లేదో, నాకావూరి ప్రస్తావనెందుకు??”

    మీరిక్కడ ఏ విషయంతోనూ ఏకీభవిస్తున్నట్టు లేదు.
    ప్రాణహిత లో ప్రచురితమయ్యేవాటి గురించీ, మీరు గిరి గీస్తున్న అత్యున్నత కవితాప్రమాణాల గురించీ ఇక్కడ మార్పులు కనబడనట్టయితే, వీళ్ళది “నీచ-స్థాయి” అని వదిలేసి, పడీ-పడీ “కెలుకకుండా” ఉంటే మంచిదేమో!!

  40. 40
    Alok Says:

    వొక్కసారి చదివినా చాలు, మనసుకు చేరాలి. స్థిరపడాలి . మననం జేసెకొద్దీ కొత్త అర్థాలతో సాక్షాత్కరించాలి. ఇవన్నీ మంచి కవితకున్న సాధారణ లక్షణాలే. అంటే ఇంతజేసినా కవి తన ప్రాధమిక కర్తవ్యాన్ని నిర్వహించగలిగాడేగానీ గొప్పవాడైపోలేదు.

    అన్వర్ గారిది కవిత గాదు. ఇది నిస్సందేహం. ముందర విశ్వం గారడిగినట్టు, ఈ కవితకి న్యూస్ రిపోర్ట్ కీ యేవిటి తేడా? శబ్దాలకుండె లౌకిక ప్రయోజనాల్ని విడిచి, లౌకిక పరిమితుల్ని విడిచి, సాక్షాత్కరించాల్సిన నవీన భావమెక్కడుంది? ఆవేశం, ఆవేదన కవిదిగానే మిగిలిపోతే అది కవి వైఫల్యమే. పాఠకులకు కూడా అది చేరగలిగితేనే ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని ఈ కవిత సాధించ లేకపోయింది.

    మధ్యలో బాగుంది గానీ అంచులేనే కాల్లేదన్నట్టు కవిత చపాతీ గాదు ఇక్కడి దాకా బావుంది, ఆ తర్వాతే బావు లేదు అని చెప్పడానికి.

  41. 41
    Mallikarjuna Rao D Says:

    ఆమ్ ఆద్మీ గారు ప్రతి పాఠకుడికీ కవిత మీద అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. అతని అభిప్రాయాన్ని ఎవరైనా అధిక్షేపిస్తే వాళ్ళకి సమాధానమిచ్చే బాధ్యత కూడా ఉంటుంది. అయినా సంపాదకవర్గం వారే స్వయంగా చర్చలని ఆహ్వానిస్తే మధ్యలో మీరు ఆపెయ్యమనడం బావుండలేదు.

  42. 42
    Alok Says:

    తెలుగులోనే గొప్ప సామెతుంది “చేతకాని మొగుడు చెపితే వినడు కొడితే యేడుస్తా”డని.

    సంపాదకవర్గం వాళ్ళేమో సాహిత్యం కోసమని “ప్రజాస్వామికం జాగా”గా ఈ సైటుని తయారుజేసారట. ఫలానొక్క డింకావాదాన్ని గాక అన్ని వాదాలని సాదరంగా చూస్తారట.

    మామిడి మనిషిగారేమో get out అంటున్నారు. ఈపాటి అప్రయోజక ప్రజాస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి గొప్పలెందుకు? బడాయిలెందుకు? వూకదంపుడు వుపన్యాసలెందుకు?

  43. 43
    ఆమ్ ఆద్మీ Says:

    గోకుల్-చాట్ వీ.. లుంబినీ పార్క్ వీ రక్త-మాంసాల ఫోటోలను మీరే స్వయంగా బాగా దగ్గరగా పరిశీలించి చూడండి.
    లేదా, మీ ప్రకారం కవి-ద్రష్ట అనదగ్గ వారికివ్వండి.
    (ఎందుకంటే, topic అదేనాయె మరి.. ఆయన ఆ సంఘటనకు ప్రత్యక్షసాక్షి అన్నంతగా రాసిండ్ర్రాయె..)

    ఆ తర్వాతి మీ / మీరు చెప్పుకునే గొప్పకవి రచనల్లో… మీరాపాదిస్తున్న నానావిధవిశేషణాల్ని చదవాలనుంది.
    బహుషా.. చాలా మందికి అదే ఉత్సుకత ఉందనుకుంటా!!!

  44. 44
    Alok Says:

    నేను ప్రత్యక్షంగానే చూసాను. ఫుటోలక్కర్లేదు.

    తీసిన ఫుటోగ్రాఫరు కాకండా అన్వర్ గారు కవిత రాయడమే ఈ కవిత్వం యొక్క గొప్పదనం. మీ లాజిక్కు అర్ధమైంది.

  45. 45
    ఆమ్ ఆద్మీ Says:

    మల్లికార్జునరావు గారూ,

    ఈ “ఆలోక్, విస్వ” ల ప్రతాపం ఏ పాటిదో, వేరే సైట్లేవీ చూసే అవసరం లేకుండానే పాఠకులొకరు శెలవిచ్చారు.

    వీళ్ళ దృష్టిలో “డింకా”వాదమనిపించేవారిని, అస్సలు మాట్లాడనీయకుండజేద్దామన్నదే అసలు ఉద్దేశ్యమన్నది బాగా తెలుస్తున్నది.
    వీళ్ళ డొంకతిరుగుడు / వ్యంగపు వ్యాఖ్యలను delete చెయ్యడానికి వీళ్లు అన్ని బ్లాగులకూ, పత్రికల సంపాదకులకు పనిగల్పిస్తున్నప్పుడు, జవాబిచ్చేందుకు నాబోటి పాఠకులు చాలు.

  46. 46
    Alok Says:

    We can only reject what we know అని ఒహరన్నారు. తెలియని దాన్ని కూడా తిరస్కరించొచ్చని మామిడి మనిషిగారు బహు చక్కగా నిరూపిస్తున్నారు. వారికి నా అభినందనలు.

    తమ తమ ఆలోచనలని నిరూపించికోలేనివాళ్ళకు కావల్సింది సానుభూతి. ఎవరేం రాసినా దాన్ని పొగిడేసి, కాపాడేసి వారి సానుభూతి కోసం ఎదురుచూడ్డం మంచి వ్యసనమే. this looseness is nothing but distorted vision and disordered syntax.

  47. 47
    Mallikarjuna Rao D Says:

    వ్యక్తిగత విమర్శలు కాకుండా వస్తుగతంగా విమర్శ ఉంటే బావుంటుందని నా అభిప్రాయం. అలోక్ గారూ, ఆమ్ ఆద్మీ గారు అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

  48. 48
    K Viswa Says:

    బహుషా,
    నా లేదా నీ చెల్లెలో……. కూతురో , ఇలాంటి సంఘటనలో విధివశాత్తూ చిక్కుకొని,
    ఇలా రక్తపు/మాంసపు ముద్దగా… గుర్తుపట్టలేని విధంగా ఉంటే..
    దానికి అసలుకారకుడు(లు) ఎదురుగా ఉంటే అన్వర్ చెప్పినట్టే చేస్తామా?
    కనీసం అలా ఆలోచిస్తామా? ఊరికే చూస్తామా?
    as we are alien to such reality, we can comment anything.. – isn’t it??
    ——————————————
    ఆమ్ ఆద్మీ గారు పైవిధంగా సెలవిచ్చారు. ఆ పేలుళ్ళలో మా స్నేహితుని బావమరిది బాగా గాయపడ్డాడు. పలకరించటానికి వెళితే, ఆ తీవ్రవాదులని అమ్మ నా బూతులతో తిట్టాడు. గాయపడ్డాడు కాబట్టి తిట్టాడు. తప్పేం లేదు. అదీ తీవ్రవాదులని కాబట్టి అస్సలు తప్పేం లేదు. అదృష్టం కొద్దీ, అతను కవి కాదు.

    ఈ రచనకు వివరణ ఇస్తూ అన్వర్ గారు చెప్పింది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది.
    —————————————–
    రక్త మాంస దాహం కవిత ఆవేశంలో రాసింది కాదు. భయంకర దుర్ఘటన మీద రాసిన కవిత.
    ఆడవాళ్ళు రక్తాన్ని నేలపాలు చేయడం ప్రకృతి ధర్మం, సహజం
    ఒక టెర్రరిస్టు మనుషుల రక్తాన్ని నేలపాలు చేయడం అధర్మం. అమానుషం. ఆది రక్తదాహం కాబట్టే రక్తదాహమే ఉంటే…
    మా ఆడవాళ్ళు ప్రతి నెల రక్తాన్ని నేలపాలు చేస్తారు – తాగరా అని చెప్పడమంటే…
    కించ పరచడం ఆడవాళ్ళని కాదు – టెర్రరిస్టు చర్యల్ని !
    ———————————————
    కవిగారే ఒప్పుకున్నట్లు, ఆవేశంతో వ్రాయలేదు కాబట్టే, ఇది కవిత కాలేకపోయింది. కవితావేశం లేకుండా, ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి, అది ఖండించాలి కాబట్టే వ్రాసింది. అందుకనే, పేలవమైన రచన బయల్పడింది.

  49. 49
    K Viswa Says:

    ఆమ్ ఆద్మీ సెప్టెంబర్ 2007 45

    మల్లికార్జునరావు గారూ,

    ఈ “ఆలోక్, విస్వ” ల ప్రతాపం ఏ పాటిదో, వేరే సైట్లేవీ చూసే అవసరం లేకుండానే పాఠకులొకరు శెలవిచ్చారు.

    వీళ్ళ దృష్టిలో “డింకా”వాదమనిపించేవారిని, అస్సలు మాట్లాడనీయకుండజేద్దామన్నదే అసలు ఉద్దేశ్యమన్నది బాగా తెలుస్తున్నది.
    వీళ్ళ డొంకతిరుగుడు / వ్యంగపు వ్యాఖ్యలను delete చెయ్యడానికి వీళ్లు అన్ని బ్లాగులకూ, పత్రికల సంపాదకులకు పనిగల్పిస్తున్నప్పుడు, జవాబిచ్చేందుకు నాబోటి పాఠకులు చాలు.
    —————–
    ఓహో ఆమ్ ఆద్మీ గారనబడే మామిడి మనిషి గారంటే కృష్ణ గారేనా? ఎలా ఉన్నారండి.

    మరోసారి ‘ఆకస్మిక మృత్యుస్పర్శ’ గుర్తు చేసారు.
    అనర్ధం అర్ధరూపాయికి నకలెలా అయిందో
    ఎవరన్నారు దేన్నీ ఏమార్చలేమని?
    మార్చడం ఏమార్చడం ఆనక కన్నీరు కార్చడం
    ఉచ్చపోసినంత తేలిక
    నీకు షుగరుంటే ఐ యామ్ సారి
    అక్కడ చూడు శవం ముప్పావలానే
    గొప్ప తగ్గింపు ధరలు
    50శాతం డిస్కౌంట్
    నువ్వలా చూడకకు
    చింపిరి నవ్వులతో కన్నీళ్ళని మానభంగం చేయకు
    దు:ఖాన్ని ఔట్ సోర్సు చేసాక
    దేహానికీ దాహానికి మధ్య రాతిగోడ
    వెయ్యినూటపదహార్ల మరణాలని చదివించిన తర్వాత
    మళ్ళీ నువ్వే పుట్టాలి
    రక్తపాతాన్ని రాజ్యహింసని సహించలేని నేను
    రోజూ రాత్రి ఆ సానిదానితో ….
    ఎందుకులే చెబితే మహారంజుగా ఉంటుంది గానీ
    ఏం ఉంటుందని?
    లేకపోవడంలో మిగిలి ఉండటం తప్ప
    అభినందనలు అభినందనలు అనే అల్లాటప్పాగాడివి
    నీకే అంతుంటే…
    ఆకస్మిక మృత్యుస్పర్శని అనుక్షణం
    ఆవాహన చేస్తున్నవాడిని.
    విస్కీలో ముంచిన అక్షరాలు చప్పరించిన నిషాలో
    నడిరోడ్డు మీద నిజానికి గుడ్డలూడపీకుతున్నవాడిని
    నాకెంతుండాలి బే … అననులే
    సమాధుల దేహాలు
    ఇంద్రధనువులు పూయవు
    లోకాన్ని మడిబట్టలూడబీకి
    మైలనీళ్ళలో శుద్ధి చేయాలి

    వాయులీనాలు, వీణలు, మృదంగాలు
    బాబూ శ్రుతి చేసుకో నాయనా
    బిళహరి రాగం, ఆదితాళం…
    మైక్ టెస్టింగ్ వన్ టు త్రీ
    సా… ఆ… ఆ.. ఆ..
    వాడు నిజం నిరూపించేందుకు
    అబద్ధాన్ని పాడుతున్నాడు.
    నేను వాడి పాటలో రాగాన్నౌతాను.
    నువ్వు కనీసం అపశ్రుతైనా కాగలవా?
    అయినా, నీ పిచ్చిగానీ
    పుట్టలోని పాముని తట్టిలేపిన రోజే
    నీ పతనానికి నాందీవాక్యం కింద సంతకం చేసావు
    ఒక్కసారి బుసకొడితే
    నువ్వూ నీ అహంకారం
    అనంతానంత మహా శూన్య ఎడారుల్లోకి…
    ఎందుకులే
    చాదస్తపు మొగుడు చెబితే వినడు
    కొడితే ఏడుస్తాడని
    నువ్వు చేసిందే మంచని నువ్వూ, నేను చేసిందే మంచని నేనూ
    వాడు చేసిందే మంచని వాడూ
    మంచి చెడు, చెడు మంచి…మండు చెండు చెంచి చించి
    అనుకుంటాం కానీ
    అంతా కాలం చేతిలో కీలుబొమ్మలమే
    జీవితమే పెద్ద వ్యభిచారం!

  50. 50
    Alok Says:

    విశ్వంజీ మంచి కవితని మళ్ళీ గుర్తుజేసారు.
    ***
    సరదాగా సమాజం పై పడే
    సంకల్ప సిద్ధులకు
    శవాలున్నా చాలు
    ***
    ఏసీలో సైతం చెమట పట్టిపోయే
    రాతల వేడిలో
    మాడిమసైపోతున్నా
    మూగనోము వీడని అక్షరాలు
    ***
    రోడ్డుపై మొన్న విరబూసిన
    నెత్తుటి పువ్వు
    నా గుండెకు అంటుకునే వుంది

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో