Comments on: రక్తమాంస దాహం

By: Alok
విశ్వంజీ మంచి కవితని మళ్ళీ గుర్తుజేసారు.

సరదాగా సమాజం పై పడే

సంకల్ప సిద్ధులకు

శవాలున్నా చాలు

ఏసీలో సైతం చెమట పట్టిపోయే

రాతల వేడిలో

మాడిమసైపోతున్నా

మూగనోము వీడని అక్షరాలు

రోడ్డుపై మొన్న విరబూసిన

నెత్తుటి పువ్వు

నా గుండెకు అంటుకునే వుంది

By: K Viswa
ఆమ్ ఆద్మీ సెప్టెంబర్ 2007 45

మల్లికార్జునరావు గారూ,

ఈ “ఆలోక్, విస్వ” ల ప్రతాపం ఏ పాటిదో, వేరే సైట్లేవీ చూసే అవసరం లేకుండానే పాఠకులొకరు శెలవిచ్చారు.

వీళ్ళ దృష్టిలో “డింకా”వాదమనిపించేవారిని, అస్సలు మాట్లాడనీయకుండజేద్దామన్నదే అసలు ఉద్దేశ్యమన్నది బాగా తెలుస్తున్నది.

వీళ్ళ డొంకతిరుగుడు / వ్యంగపు వ్యాఖ్యలను delete చెయ్యడానికి వీళ్లు అన్ని బ్లాగులకూ, పత్రికల సంపాదకులకు పనిగల్పిస్తున్నప్పుడు, జవాబిచ్చేందుకు నాబోటి పాఠకులు చాలు.

ఓహో ఆమ్ ఆద్మీ గారనబడే మామిడి మనిషి గారంటే కృష్ణ గారేనా? ఎలా ఉన్నారండి.

మరోసారి ‘ఆకస్మిక మృత్యుస్పర్శ’ గుర్తు చేసారు.

అనర్ధం అర్ధరూపాయికి నకలెలా అయిందో

ఎవరన్నారు దేన్నీ ఏమార్చలేమని?

మార్చడం ఏమార్చడం ఆనక కన్నీరు కార్చడం

ఉచ్చపోసినంత తేలిక

నీకు షుగరుంటే ఐ యామ్ సారి

అక్కడ చూడు శవం ముప్పావలానే

గొప్ప తగ్గింపు ధరలు

50శాతం డిస్కౌంట్

నువ్వలా చూడకకు

చింపిరి నవ్వులతో కన్నీళ్ళని మానభంగం చేయకు

దు:ఖాన్ని ఔట్ సోర్సు చేసాక

దేహానికీ దాహానికి మధ్య రాతిగోడ

వెయ్యినూటపదహార్ల మరణాలని చదివించిన తర్వాత

మళ్ళీ నువ్వే పుట్టాలి

రక్తపాతాన్ని రాజ్యహింసని సహించలేని నేను

రోజూ రాత్రి ఆ సానిదానితో ….

ఎందుకులే చెబితే మహారంజుగా ఉంటుంది గానీ

ఏం ఉంటుందని?

లేకపోవడంలో మిగిలి ఉండటం తప్ప

అభినందనలు అభినందనలు అనే అల్లాటప్పాగాడివి

నీకే అంతుంటే…

ఆకస్మిక మృత్యుస్పర్శని అనుక్షణం

ఆవాహన చేస్తున్నవాడిని.

విస్కీలో ముంచిన అక్షరాలు చప్పరించిన నిషాలో

నడిరోడ్డు మీద నిజానికి గుడ్డలూడపీకుతున్నవాడిని

నాకెంతుండాలి బే … అననులే

సమాధుల దేహాలు

ఇంద్రధనువులు పూయవు

లోకాన్ని మడిబట్టలూడబీకి

మైలనీళ్ళలో శుద్ధి చేయాలి

వాయులీనాలు, వీణలు, మృదంగాలు

బాబూ శ్రుతి చేసుకో నాయనా

బిళహరి రాగం, ఆదితాళం…

మైక్ టెస్టింగ్ వన్ టు త్రీ

సా… ఆ… ఆ.. ఆ..

వాడు నిజం నిరూపించేందుకు

అబద్ధాన్ని పాడుతున్నాడు.

నేను వాడి పాటలో రాగాన్నౌతాను.

నువ్వు కనీసం అపశ్రుతైనా కాగలవా?

అయినా, నీ పిచ్చిగానీ

పుట్టలోని పాముని తట్టిలేపిన రోజే

నీ పతనానికి నాందీవాక్యం కింద సంతకం చేసావు

ఒక్కసారి బుసకొడితే

నువ్వూ నీ అహంకారం

అనంతానంత మహా శూన్య ఎడారుల్లోకి…

ఎందుకులే

చాదస్తపు మొగుడు చెబితే వినడు

కొడితే ఏడుస్తాడని

నువ్వు చేసిందే మంచని నువ్వూ, నేను చేసిందే మంచని నేనూ

వాడు చేసిందే మంచని వాడూ

మంచి చెడు, చెడు మంచి…మండు చెండు చెంచి చించి

అనుకుంటాం కానీ

అంతా కాలం చేతిలో కీలుబొమ్మలమే

జీవితమే పెద్ద వ్యభిచారం!

By: K Viswa
బహుషా,

నా లేదా నీ చెల్లెలో……. కూతురో , ఇలాంటి సంఘటనలో విధివశాత్తూ చిక్కుకొని,

ఇలా రక్తపు/మాంసపు ముద్దగా… గుర్తుపట్టలేని విధంగా ఉంటే..

దానికి అసలుకారకుడు(లు) ఎదురుగా ఉంటే అన్వర్ చెప్పినట్టే చేస్తామా?

కనీసం అలా ఆలోచిస్తామా? ఊరికే చూస్తామా?

as we are alien to such reality, we can comment anything.. – isn’t it??

ఆమ్ ఆద్మీ గారు పైవిధంగా సెలవిచ్చారు. ఆ పేలుళ్ళలో మా స్నేహితుని బావమరిది బాగా గాయపడ్డాడు. పలకరించటానికి వెళితే, ఆ తీవ్రవాదులని అమ్మ నా బూతులతో తిట్టాడు. గాయపడ్డాడు కాబట్టి తిట్టాడు. తప్పేం లేదు. అదీ తీవ్రవాదులని కాబట్టి అస్సలు తప్పేం లేదు. అదృష్టం కొద్దీ, అతను కవి కాదు.

ఈ రచనకు వివరణ ఇస్తూ అన్వర్ గారు చెప్పింది కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది.

రక్త మాంస దాహం కవిత ఆవేశంలో రాసింది కాదు. భయంకర దుర్ఘటన మీద రాసిన కవిత.

ఆడవాళ్ళు రక్తాన్ని నేలపాలు చేయడం ప్రకృతి ధర్మం, సహజం

ఒక టెర్రరిస్టు మనుషుల రక్తాన్ని నేలపాలు చేయడం అధర్మం. అమానుషం. ఆది రక్తదాహం కాబట్టే రక్తదాహమే ఉంటే…

మా ఆడవాళ్ళు ప్రతి నెల రక్తాన్ని నేలపాలు చేస్తారు – తాగరా అని చెప్పడమంటే…

కించ పరచడం ఆడవాళ్ళని కాదు – టెర్రరిస్టు చర్యల్ని !

కవిగారే ఒప్పుకున్నట్లు, ఆవేశంతో వ్రాయలేదు కాబట్టే, ఇది కవిత కాలేకపోయింది. కవితావేశం లేకుండా, ఒక దుర్ఘటన జరిగింది కాబట్టి, అది ఖండించాలి కాబట్టే వ్రాసింది. అందుకనే,  పేలవమైన రచన బయల్పడింది.

By: Mallikarjuna Rao D
వ్యక్తిగత విమర్శలు కాకుండా వస్తుగతంగా విమర్శ ఉంటే బావుంటుందని నా అభిప్రాయం. అలోక్ గారూ, ఆమ్ ఆద్మీ గారు అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

By: Alok
We can only reject what we know అని ఒహరన్నారు. తెలియని దాన్ని కూడా తిరస్కరించొచ్చని మామిడి మనిషిగారు బహు చక్కగా నిరూపిస్తున్నారు. వారికి నా అభినందనలు.

తమ తమ ఆలోచనలని నిరూపించికోలేనివాళ్ళకు కావల్సింది సానుభూతి. ఎవరేం రాసినా దాన్ని పొగిడేసి, కాపాడేసి వారి సానుభూతి కోసం ఎదురుచూడ్డం మంచి వ్యసనమే. this looseness is nothing but distorted vision and disordered syntax.

By: ఆమ్ ఆద్మీ
మల్లికార్జునరావు గారూ,

ఈ “ఆలోక్, విస్వ” ల ప్రతాపం ఏ పాటిదో, వేరే సైట్లేవీ చూసే అవసరం లేకుండానే పాఠకులొకరు శెలవిచ్చారు.

వీళ్ళ దృష్టిలో “డింకా”వాదమనిపించేవారిని, అస్సలు మాట్లాడనీయకుండజేద్దామన్నదే అసలు ఉద్దేశ్యమన్నది బాగా తెలుస్తున్నది.

వీళ్ళ డొంకతిరుగుడు / వ్యంగపు వ్యాఖ్యలను delete చెయ్యడానికి వీళ్లు అన్ని బ్లాగులకూ, పత్రికల సంపాదకులకు పనిగల్పిస్తున్నప్పుడు, జవాబిచ్చేందుకు నాబోటి పాఠకులు చాలు.

By: Alok
నేను ప్రత్యక్షంగానే చూసాను. ఫుటోలక్కర్లేదు.

తీసిన ఫుటోగ్రాఫరు కాకండా అన్వర్ గారు కవిత రాయడమే ఈ కవిత్వం యొక్క గొప్పదనం. మీ లాజిక్కు అర్ధమైంది.

By: ఆమ్ ఆద్మీ
గోకుల్-చాట్ వీ.. లుంబినీ పార్క్ వీ రక్త-మాంసాల ఫోటోలను మీరే స్వయంగా బాగా దగ్గరగా పరిశీలించి చూడండి.

లేదా, మీ ప్రకారం కవి-ద్రష్ట అనదగ్గ వారికివ్వండి.

(ఎందుకంటే, topic అదేనాయె మరి.. ఆయన ఆ సంఘటనకు ప్రత్యక్షసాక్షి అన్నంతగా రాసిండ్ర్రాయె..)

ఆ తర్వాతి మీ / మీరు చెప్పుకునే గొప్పకవి రచనల్లో… మీరాపాదిస్తున్న నానావిధవిశేషణాల్ని చదవాలనుంది.

బహుషా.. చాలా మందికి అదే ఉత్సుకత ఉందనుకుంటా!!!

By: Alok
తెలుగులోనే గొప్ప సామెతుంది “చేతకాని మొగుడు చెపితే వినడు కొడితే యేడుస్తా”డని.

సంపాదకవర్గం వాళ్ళేమో  సాహిత్యం కోసమని “ప్రజాస్వామికం జాగా”గా ఈ సైటుని తయారుజేసారట. ఫలానొక్క డింకావాదాన్ని గాక అన్ని వాదాలని సాదరంగా చూస్తారట.

మామిడి మనిషిగారేమో get out అంటున్నారు. ఈపాటి అప్రయోజక ప్రజాస్వామ్య శిఖరాగ్ర సమావేశానికి గొప్పలెందుకు? బడాయిలెందుకు? వూకదంపుడు వుపన్యాసలెందుకు?

By: Mallikarjuna Rao D
ఆమ్ ఆద్మీ గారు ప్రతి పాఠకుడికీ కవిత మీద అభిప్రాయం చెప్పే హక్కు ఉంది. అతని అభిప్రాయాన్ని ఎవరైనా అధిక్షేపిస్తే వాళ్ళకి సమాధానమిచ్చే బాధ్యత కూడా ఉంటుంది.  అయినా సంపాదకవర్గం వారే స్వయంగా చర్చలని ఆహ్వానిస్తే మధ్యలో మీరు ఆపెయ్యమనడం బావుండలేదు.

By: Alok
వొక్కసారి చదివినా చాలు, మనసుకు చేరాలి. స్థిరపడాలి . మననం జేసెకొద్దీ కొత్త అర్థాలతో సాక్షాత్కరించాలి. ఇవన్నీ మంచి కవితకున్న సాధారణ లక్షణాలే. అంటే ఇంతజేసినా కవి తన ప్రాధమిక కర్తవ్యాన్ని నిర్వహించగలిగాడేగానీ గొప్పవాడైపోలేదు.

అన్వర్ గారిది కవిత గాదు. ఇది నిస్సందేహం.  ముందర విశ్వం గారడిగినట్టు, ఈ కవితకి న్యూస్ రిపోర్ట్ కీ యేవిటి తేడా? శబ్దాలకుండె లౌకిక ప్రయోజనాల్ని విడిచి, లౌకిక పరిమితుల్ని విడిచి, సాక్షాత్కరించాల్సిన నవీన భావమెక్కడుంది? ఆవేశం, ఆవేదన కవిదిగానే మిగిలిపోతే అది కవి వైఫల్యమే. పాఠకులకు కూడా అది చేరగలిగితేనే ప్రయోజనం. ఆ ప్రయోజనాన్ని ఈ కవిత సాధించ లేకపోయింది.

మధ్యలో బాగుంది గానీ అంచులేనే కాల్లేదన్నట్టు కవిత చపాతీ గాదు ఇక్కడి దాకా బావుంది, ఆ తర్వాతే బావు లేదు అని చెప్పడానికి.

By: ఆమ్ ఆద్మీ
మరాఠీలో ఒక మంచి సామెత ఉన్నది.

“ज़े गांवाला जाएचा नै … त्या गांवाचा वाट कशाला??”

అంటే..

“ఏ ఊరికి వెళ్ళే అవసరం లేదో, నాకావూరి ప్రస్తావనెందుకు??”

మీరిక్కడ ఏ విషయంతోనూ ఏకీభవిస్తున్నట్టు లేదు.

ప్రాణహిత లో ప్రచురితమయ్యేవాటి గురించీ, మీరు గిరి గీస్తున్న అత్యున్నత కవితాప్రమాణాల గురించీ ఇక్కడ మార్పులు కనబడనట్టయితే, వీళ్ళది “నీచ-స్థాయి” అని వదిలేసి, పడీ-పడీ “కెలుకకుండా” ఉంటే మంచిదేమో!!

By: ఆమ్ ఆద్మీ
Let us read this again!!

quote:

1. రోడ్డు మీద ప్రమాదాల్లో

నుజ్జునుజ్జయ్యే మానవశరీరాలు

గుర్తుపట్టొచ్చు

గుండెనిబ్బరంతో శవసంస్కారం చెయ్యొచ్చు

2. మసీదు పార్కు ఛాట్‌భండార్‌లలో

మహానగరంలో బాంబు పేలితే…

మనుషులు రక్తపు ముద్దలు ముద్దలుగా…

అక్కడొక ముద్ద… ఇక్కడొక ముద్ద

ఎన్ని రక్తపు ముద్దల్ని పోగుచేసి

ఎవరని గుర్తుపడుదాం?

3. తల్లి గర్భం నుంచి పిండాన్ని బలవంతంగా లాగి

నేలమీద పడేసిన రక్తపు ముద్దలాగా శవాలు

4. దేశీయ విదేశీయ విధేయతా కుట్ర

బాంబు పేలుళ్ళు –

ఎవరికోసం ఎవరికోసం ఎవరి పైశాచికం

ఎక్కడి పగ…

unqoute:

మళ్ళీ, మళ్ళీ.. చదివిచూడండి.

1 నుండి 4 వరకూ అన్వర్ గారి భావావేశం, ఆవేదనా సరిగ్గానే ప్రవహించిందని ఒప్పుకుంటారు!!

ఆ తర్వాతి పంక్తుల గురించే గదా వివాదమంతా…

ఐతే, ఒక corporate power-point presentation ఐనా, చాలా కష్టపడి ఒకరు తయారు చేసిన ప్రాజెక్టు రిపోర్టైనా మరొకరిద్దరి ద్వారా “FINE-TUNING” కి నోచుకున్నాకనే ఒక చక్కని out-put గా వెలువడుతుంది.

బహుషా – కవితల, గేయాల రూపకల్పనలోకూడా (design) అటువంటి mentoring  కి మనం ఆస్కారమిస్తే,  నూతన రచయితలను ప్రోద్బలపరిచడంలో ఆ ప్రక్రియ ఒక కొత్త “ఒరవడి” కాగలదేమో!

“రచన” మాసపత్రికలో ఎన్నో సంవత్సరాలుగా కథలనురాయడం ఎలా అన్నదానిగురించి ప్రముఖులు “వసుంధర” దంపతులు “సాహితీవైద్యం” అన్న శీర్శికన బహువిశ్లేషణాత్మకంగా  ఎన్నోసూచనలిస్తూ పుణ్యంగట్టుకుంటున్నారు.

విమర్శ అన్నది చీల్చి-చెండాడే విధంగానో.. వ్యంగంగానో, వెకిలిగానోబదులు, సూటిగా,  ఒక సూచనప్రాయంగా ఉంటే, ఆ రచయితక్కూడా popular opinion, readers reflexes  అర్థమై, ఆయన కలంనుండి వెలువడే తదుపరిరచనల్లో తదనుగుణ మార్పులను చూపించవచ్చు.

ప్రాణహిత పాఠకులు అటువంటి అపురూప పాఠకులైతే, రాసేవారికి అంతకన్నా కావల్సిందేముంటుంది.

By: Alok
ఎజ్రా పౌండ్ “ABC of Reading” లో ఇల్లా అన్నాడు

You would think that anyone wanting to know about poetry would do one of two things or both i.e. LOOK AT IT or LISTEN TO IT. He might even THINK about it?

And if he wanted advice he would go to someone who KNEW something about it?

If you wanted to know something about an automobile, would you go to a man who had made one and driven it, or to a man who had merely heard about it? would you look at the actual car or only at the specifications?

In the case of poetry, there is, or seem to be, a good deal to be looked at. And there seem to be very few authentic specifications available.

సాగరసంగమం జూసి భరతనాట్యాన్ని, శంకరాభరణాన్ని జూసి సంగీతాన్ని నేర్చెయ్యాలన్న దురద అందరికీ పుట్టవచ్చు. గానీ కాలం దాన్ని కాస్త గోకేస్తే ఆ దురద మళ్ళీ పుట్టకపోవొచ్చు. అల్లాగే నలుగురి రాతల్ని చదవగానే “నేను సైతం…” అంటూ బయల్దేరిపోవొచ్చు. ఐతే అల్లా బయలుదేరేస్తే దిక్కుతోచని ప్రయాణీకుడై ముక్కు బద్దలు జేసుకొంటారే తప్ప గురిని ముట్టరు.

“శబ్దార్థ శాసన జ్ఞాన మాత్రేణైవ న వేద్యతే” అన్నాడు ఆనందవర్ధనుడు. కవిత్వం వుట్టి శబ్దాలు, వాటి అర్థాలవల్ల యేర్పడదని తెగేసి చెప్పాడు. గానీ ఇప్పుడు కేకలేసేవాడే కవని, భాడకోవ్ సాలే అనడమే కవిత్వమని చెలామణి ఔతోంది.

By: Mallikarjuna Rao D
మంచి చర్చ. ముందుగా ఎవరి అభివ్యక్తిని వారు వ్యక్తం చేసుకోవచ్చు. ఇందులో విభేదాలకు తావు లేదు.  ఐతే ఏ వాదపు కవిత్వమైనా అందులో కవిత్వం ఉండి తీరాలని అంతా ఒప్పుకుంటారనుకుంటాను.  ఎప్పుడైతే ఒక రచనని మనం కవిత్వమంటామో అది ఏ వాదానికి సంబంధించినదైనా ఆ రచనలో ఆ వాదానికతీతమైనదేదో ఉంటుంది.  అందుకే అది ప్రతి మనిషినీ చేరుతుంది.

ఈ కవిత(??) లో అన్వరు గారు సాధించిన సామాజిక ప్రయోజనమేమిటి? తీవ్రవాదులు చర్యని ఖండించని వారుండరు. ఐతే కేవలం తీవ్ర వాదుల చర్యని ఖండిస్తూ , వాళ్ళని తిడుతూ ఏం రాసినా కవిత్వమైపోతుందా అన్నది నా ప్రశ్న.   ఇది చదివాక నాలో జుగుప్స మాత్రమే కలిగింది.  ఐతే జుగుప్సాకరంగా కవిత ఉండకూడదా, కేవలం ఆహ్లాదకరంగానే ఉండాలా ? అని ఎవరైనా ప్రశ్నించవచ్చు.  ఒక కవిత జుగుప్సాకరంగా ఉన్నా  అంతకంటే అతీతమైన భావాన్ని దేన్నో  కవిత అందుకోవాలి.  ఈ కవిత అందులో విఫలమైంది. కాబట్టి  ఈ రచనని కవిత గా అంగీకరించలేను.

By: ఆమ్ ఆద్మీ
ఆలోక్ గారూ..

మీరు చాలా బాగా analysis చేస్తారు.

మీ పదాల్లో, వ్యాఖ్యల్లో ఆ పదును అధ్భుతంగా కనబడుతున్నది.

ఐతే, చదవడాన్ని (TV, RADIO ల బదులు) ఎక్కువగా ఇష్టపడే ప్రతిపాఠకుడూ starting  నుండే విమర్శనాత్మకంగానో, లేదా తామే రాస్తే ఎలా ఉంటుందనో ఊహించలేకపోవచ్చు.

చదివినకొద్దీ, తాము కూడా ఏదైనా రాయాలని అనిపించే కొంత మార్పులు వారిలో పుడుతూండవచ్చు.

రచించిన product  “out-put” ఏదైనా (కవిత, కథ, వ్యాసం, అభిప్రాయం, సమీక్ష, సంఘటన, వార్త etc), దానికి స్పందించే  ప్రతీహృదయం ఒక “స్థాయి”కి తగినట్టుగా తన భావాన్ని వ్యక్తీకరించలేక పోవచ్చు.

ఈ pattern నే మనమిప్పుడు, పాఠకుల feed-back వ్యాఖ్యల్లో గమనిస్తున్నం.

పైన రాసిందాన్ని మీరంగీకరిస్తే, అలాంటి approach నే మనం రచయితలపట్ల కూడా చూపించినప్పుడే, వారిలో కూడా gradual improvement వస్తుందని నేననుకుంటున్నాను. మీరేమంటారు?

మీ అంతబాగా  విమర్శను రాయగలిగే స్థాయికి రావాలని కొండరు aspire చేస్తున్నట్టుగానే, రచనల్లో కూడా తమకు నచ్చిన పంథాలో రచనలు చేస్తూ imporve అవాలనుకునే రచయితలను కూడా ప్రోత్సహించగలుగుతాం!!

By: Alok
“కాదేదీ కవిత కనర్హం” అని చదవగలినప్పుడు “ఔనౌను శిల్ప మనర్ఘం” అని తెలుసుకోరెందుకు?  “అంతరాంతర జ్యోతిస్సీమలని ఆవిష్కరించా”లని అనుకోరెందుకు?

రోజువారీ విషయాల్ని రాసేస్తే, అదే కవిత్వమైతే “అలోక సామాన్యం అభివ్యనక్తి” అని చెప్పడంలోని అర్ధమేమిటి?

“Poetry should be great and unobtrusive, a thing which enters into one’s soul, and does not startle it or amaze it with itself, but with its subject” అనే జాన్ కీట్స్  మాటలకి యేవిటర్థం?

“Why the hell don’t the schools give a little rudimentary education in economics, the history of economics, and in the use of language” అని ఎజ్రా పౌండ్ అన్నాడు.  దీనర్థమేవిటి?

“గణితశాస్త్రం, భౌతికశాస్త్రం లాంటి ఏ విజ్ఞానశాస్త్రమైనా, సంగీతం, చిత్రలేఖనం లాంటి ఏ కళైనా అందులో కృషి చేసి కనీస పరిజ్ఞానం సంపాదించిన వాళ్ళకి కాని అర్థం కావే? ఒక్క కవిత్వం మాత్రం జనసామాన్యానికి ఏ అర్హత లేకుండానే అర్థం కావాలనడంలో నాకర్థం కనిపించడం లేదు” అని ఇస్మాయిల్ చెప్పడంలోని ఔచిత్యమేవిటి?

కవిత్వమంటే ఉత్తమమైన భావాల్ని ఉత్తమమైన మాటలతో ఉత్తమమైన రీతిలో ప్రదర్శించడమేనని ఇలియట్ చెప్పాడు.

పై అన్నిటి అర్థమేమంటే “కాదన్నీ కవితకు అర్హ”మనే.