October 2007 సంచిక

అక్టోబర్ 2007 : సంపాదకీయం

చిత్రం: ఏలే లక్ష్మణ్
చిత్రం: ఏలే లక్ష్మణ్
సెప్టెంబర్ 9 ఆదివారం సాయంత్రం హైదరా‘బాధ’లో మరో దారుణం జరిగింది. నగరంలో, జనసమ్మర్దం తో అత్యంత రద్దీ గా ఉండే పంజగుట్ట లో నిర్మాణంలో ఉన్న ఫ్లై ఓవర్ హఠాత్తుగా కూలిపోయింది. అనేక వాహనాలు కూలిన ఫ్లై-ఓవర్ కాంక్రీట్ దిమ్మలకింద నజ్జు నజ్జై పోయినయి. ఇద్దరు మరణించారు. పదుల కొద్దీ తీవ్రంగా గాయపడ్డారు. ఫ్లై-ఓవర్ కూలడానికి కారణాలు వెదికే క్రమంలో, ఫ్లై-ఓవర్ నిర్మిస్తున్న గామన్ కన్‌స్ట్రక్షన్ కంపనీ తన తప్పేమీ లేదని, అంతా హైదరాబాదు మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ వాళ్ళ పాపమే అనీ, లేదు తప్పంతా ప్రభుత్వానిదే అని ప్రతి పక్షాలూ, ప్రతి పక్షాలు అన్నీ రాజకీయం చేస్తున్నాయని ప్రభుత్వమూ పరస్పర నేరారోపణ చేసుకున్నారు. చివరికి విచారణ సంఘం గామన్ కంపనీదే బాధ్యత అని ప్రకటించింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »సంపాదకీయం

అక్టోబర్ 2007 సూచిక

* కవిత: నల్లగొర్రె – స్కైబాబ
  * కవిత: గుప్పిట్లో భూగోళం – బండ్ల మాధవ రావు
  * కవిత: విముక్తి గీతం – కొండెపోగు బి. డేవిడ్‌ లివింగ్‌స్టన్‌
  * కవిత: సజీవ వీడ్కోలు – డా. కె. గీత
మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సూచిక

నల్లగొర్రె

తలొంచుకుని ముందు నడుస్తున్న
సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా మొత్తం చదవండి »

8 అభిప్రాయాలు »కవితలు

గుప్పిట్లో భూగోళం

ప్రత్యక్ష సంభాషణల నిరంతర అంతరాయాల మధ్య
ఇప్పుడు అందరం సెల్లో బందీలమయ్యాం
సంభోదనా పరికరాలైన పేర్లు
సంఖ్యలు గా మారిపోయాయి మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

విముక్తి గీతం

కొత్త రాగమెత్తుకో వద్దు
నే సవర్ణుణ్ని కాను
అతి శూద్రుణ్ని అసలేకాదు
గుట్టు చప్పుడు కాని జీనోసైడ్‌
వెర్బల్‌ దాడి చెయ్యొద్దు మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

సజీవ వీడ్కోలు

నేస్తం! ప్రేమ తళతళామెరిసే నా కళ్లమీద
త్వరగా కాసిన్ని ముద్దులు పెట్టు
తనివితీరా హత్తుకుని నాకు వీడ్కోలు చెప్పు
సాయంత్రం ఇలా వస్తానో – రానో -
సజీవంగా – మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

బతుకొక ఎర్రదీపం

ఆత్మవంచన మోనాపలీలో
“మహాఆత్మ” కలిగినట్లు కనిపిస్తూ
ఆడాళ్ళతో నగ్న శరీరిలా కనిపించే వాడొకడు
తనది బ్రహ్మచర్యమని నిలువునా బొంకుతాడు మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

పెనుగులాట

నాగలి దున్నే చేతుల్లో
ఎర్రజెండాలు దండు కట్టి నినదిస్తున్నాయి

ఊరూరి దొరలు ఒక్కటై
నైజాం పైజామల జాక్కున్న రోజులు మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

నడిచే మోదుగ చెట్టు

గోడెక్కి దశన్న పూవు – మొగ్గదీరి మల్లె – చెమ్మగిల్లిన వాకిలి
ఆ వచ్చేది కచ్చితంగా అక్కనే
ఔ! తమ్ముడికచ్చే ఒక్కగానొక్క పండుగ అక్కే కదా
చెక్కర కుడుకతో రాఖీపండుగో ఏదో ఒక సందు మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కవితలు

సొంతిల్లు

మనదనుకుంటే మనదే
కాదనుకుంటే కాదు
అనేవారు తాతయ్య మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

నిర్దేశాత్మక వ్యాకరణం – ప్రాదేశిక భాషలు

-జిలుకర శ్రీనివాస్‌, పసునూరి రవీందర్‌

‘వ్యాకరణం’ మానవీయ శాస్త్రాలకు అత్యంత ప్రాధమిక అంశమూ కీలక అంశమూ అని విశ్వసించిన కాలం నుంచి వ్యాకరణశాస్త్ర అభ్యాసం, బోధన రెండూ అవసరమా అన్న విచికిత్స కొనసాగుతున్న సందర్భంలో తెలుగు వ్యాకరణాలను పునస్స­మీక్షించుకొంటున్నాం. వ్యాకరణం ప్రాభవం క్షీణించి భాషాశాస్త్రం వెలుగులో విశ్వవిద్యాలయాల్లోని తెలుగు శాఖలు నూత్న మార్గాలు అన్వేషిస్తున్న వర్తమానం యిది. మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

నూరేళ్ల మార్టిన్‌ ఈడెన్‌

ప్రతి రచయితా ‘లక్షలు సంపాదించడం ఎలా?’ అనేది అలా ఉంచి, ‘కీర్తి ప్రతిష్ఠలు ఎప్పుడొస్తాయి? పాఠకులు ఎప్పుడు బ్రహ్మరథం పడతారు?’ అని కలలు కంటాడు. ఆ కలల్లో అసహజత్వమేమీలేదు. అత్యాశ కూడాలేదు. రాసేది అభిప్రాయ వ్యక్తీకరణ కోసమే అయినప్పటికీ, అది నలుగురూ చదువాలనే కోరిక అందరికీ ఉంటుంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »ప్రపంచ సాహిత్యం, సాహిత్య వ్యాసాలు

కలమ్మ కలకలం

‘వో అమ్మా గా సిన్నపోషన్నోల్లు యింటికొచ్చిండ్రే… అచ్చి నిన్ను బిన్న రమ్మంటండ్రే’ కలుపుదీసే సర్పంచి కలమ్మను తన బిడ్డె వనమ్మ కీకబెట్టినట్లు సెప్పింది.

‘ఎందుకాట బిడ్డా’ దూరంగ నిలుసున్న బిడ్డెతోని అంతే బిగ్గెరగ అన్నది కలమ్మ.

‘ఏమోనే నాకేమెర్క’ అని తల్లి కలుపుదీసే పాలుకు పక్కపోంటి వచ్చి నిలుసున్నది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »కథలు

సమాచార విప్లవం

……..
యూజరు నేమ్: భారతీదేవి
సబ్జెక్టు: ఐ లవ్యూ, వామన రావు
……..

రిజిస్టరు నంబరు: టి.405081 గారికి,

‘డోకూ’ డాట్ కామ్‌లో మిమ్మల్ని చూశాను. మీరు చాలా అందంగా వున్నారు. సో నేను ఆన్సరు చేయాల్సిన వంద మెయిల్సు పక్కన పెట్టి మీకే ముందుగా జవాబిస్తున్నాను. మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »గల్పికలు

తెల్లకాకులు – నల్లపత్తి

మట్టి గోడకు కాళ్లాడుతున్న చిమ్మినీ దీపం ఆరిపోయింది.

కొటాయ్‌కు మెళుకు వచ్చింది. గుడిసెలో కటిక చీకటి. అతనికి కొంచెం దూరంలో పెళ్లాం పిల్లలు పడుకున్నారు. గురక మాత్రమే వినిపిస్తున్నదే కానీ మనుష్యులు అగుపించడం లేదు కొటాయ్‌కు. పైసలివ్వకపోతే దీపంలోకి కిరసనాయిలు కూడా పొయ్యనన్నాడు కోమటి కొట్టు సుబ్బారాయుడు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

అడుగుజాడలు

”అమ్మా సుజీ, లేమ్మా కాఫీ తాగుదువు గానీ…”

నాన్న అంత ప్రేమగా పలకరిస్తుంటే బదులు చెప్పకుండా వుండలేకపోయాను.

”గంటనుంచీ నాన్నమ్మ పిలుస్తుంటే పలక్కుండా వున్నావంట. యీ మాత్రం దానికే యిట్లయితే ఎట్ల తల్లీ. యిట్లాంటివి యింకా ఎన్ని చూడాలో. యీ పదైదేండ్లలో నేనెన్ని చూసిండాలి చెప్పు. లే, లేచి కాఫీ తాగు” మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

సుద్దాల అశోక్ తేజతో ఇంటర్‌వ్యూ – విడియో

మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »ఇంటర్‌వ్యూలు, పాటలు, వీడియో / ఆడియో

Next »