Oct2007
గుప్పిట్లో భూగోళం
ప్రత్యక్ష సంభాషణల నిరంతర అంతరాయాల మధ్య
ఇప్పుడు అందరం సెల్లో బందీలమయ్యాం
సంభోదనా పరికరాలైన పేర్లు
సంఖ్యలు గా మారిపోయాయి
ఆగిపోయిన సంభాషణ
తిరిగి ప్రారంభించాలంటే
తడుముకోవాల్సిందే
విచిత్రంగా ఎవరికి వాళ్లు
మరెవరితోనో మాట్లాడుతూనే ఉంటారు
నిశ్శబ్దాన్ని చీలుస్తూ
శబ్దాన్ని స్వాధీనం చేసుకున్నవాళ్లంతా
ఏదో పిచ్చి లోకం లో
విహరిస్తున్నట్లుగా ఉంటుంది
ఒకడు పెద్దగా అరుస్తుంటాడు
మరో పదారేళ్లపడుచు
కళ్లల్లో వింతమెరుపుల్తో
ముఖంలో అదోవిధమైన తుళ్లింతల్తో
మెల్లగా ముసిముసిగా
గొణుక్కుంటూ వెళుతుంది
సెల్లు తలలేసుకొన్న వ్యాపారం
నువ్వేసుకొన్నది
ఫాంటైతే ఎ
లుంగీ అయితే బి
నిక్కరైతే సి
అని టైప్ చేసి పంపమంటుంది
భూమికి ఆ వైపునున్న వాళ్లతో
క్షణాల్లో మాట్లాడటం సంతోషమే కానీ
పక్కింట్లోకి కూడా అలాగే మాట్లాడటం విషాదమే
జనారణ్యం లో తప్పిపోయినప్పుడు
దారి చూపించే కుక్కపిల్ల అదే అయినా
తిండి మానేసి కడుపు మాటల్తో నింపుకోమనడం
ఎడతెరిపి లేకుండా
నిరంతరం మాట్లాడుకోమనడం
ముమ్మాటికి నేరమే
సమాచారం ఇంటిల్లిపాదికి
అందే కాలం పోయింది
ఎవరికొచ్చిన సమాచారం వాళ్లే వినాలి
మరొకళ్లు ముట్టుకోరు
ముట్టుకోక పోవడమే సభ్యత సంస్కారం
ఇళ్లల్లో సెల్లుగోడలు మొలిచాయి
బయట సొల్లు సంబంధాలు పెరిగాయి
పిల్లల గదుల్లోని రహస్య సంభాషణలు
బొమ్మలు బొమ్మలుగా
ఎక్కడికైనా ఎగిరెళ్లి పోవచ్చు
భూగోళం గుప్పిట్లో యిమిడిందేమో కానీ
జీవితాలు మాత్రం దూరంగా నెట్టేయబడుతున్నాయి.
October 5th, 2007 at 4:47 am
మీరు చాలా చక్కగా చెప్పారు.
October 17th, 2007 at 3:48 am
బాగుంది.
November 2nd, 2007 at 3:09 am
చాలా బాగు0ది
November 6th, 2007 at 2:45 am
సీతారాం గారి “ఎస్‌ఎంఎస్‌లు కాదు ఎస్‌ఓఎస్‌లు పంపండి” చదువుండి.
సెల్లు బానిసత్వం ఎంతగా ప్రబలిపోతున్నదో తెలుస్తది.
http://bhumika.org/archives/343
ఏ వ్యాపకమైనా, పరికరవాడకమైనా “వ్యసనం”గా మార్తె ప్రమాదమే!
టి.వి. చూడనివ్వని / చూడలేని రోజులల్ల తలకాయనొప్పితో బాధపడే గృహిణులూ, పిల్లలున్నారనీ తెలుస్తె ఆశ్చర్యపోతాం!
2001 లో, ముంబయినగరపు కేబుల్ సంస్థల 5 రోజుల సమ్మె సమయంలో, మొదటి రెండురోజులను దుర్భరంగా గడిపిన జనాలే, తరవాతి రోజుల సాయంకాలాలను పార్కుల్లో (tv జూసుడు ఎంత బందిఖాన గదా), మిత్రులతో, బంధువులతో, సాంఘిక/సేవా/భక్తి కార్యక్రమాలలో సకుటుంబంగా గడిపి ఎంత ఆనందాన్నిపొందిండ్రో.. అనుభవించినవాండ్లెందరో పత్రికలద్వారా తెలిపారు.
ఇక SMS ల విషయానికొస్తే, TV/RADIO/MOBILE కంపెనీలన్ని తమతమ వాణిజ్యావసరాలకోసం ప్రకటనలను గుప్పిస్తూ, ఈ “లఘు వ్యాఖ్య” ల ద్వారా ధనాన్ని సంపదిస్తున్నయి. (పోటీ పోస్టుకార్డుల్లాగనే, వీటిధర మామూలు sms ల కంటె పిరం; అది తెలిసినా/తెలువకా మనోళ్ళు అత్యుత్సాహంగ పాల్గొంటున్నరు.
ఇగ – voting(OUT) the contestants through sms అన్నది, ఎంత విధ్వంసకరమైందంటె.. Indian Idol అనె ఒక కార్యక్రమంలో చివరగా sms ల లెక్కన గెలిచినవాడు “అన్యాయంగ” గెలిచిండని ఒక Radio RJ చేసిన వ్యాఖ్యలకు వ్యతిరేకంగ బెంగాల్లో అల్లర్లు చెలరేగినయి.
నిజానికి ఈ programme ను చివరిదాకా చూసిన మా ఇంట్లోల్లందరుకూడ తీవ్రంగ నిరాశపడ్డరు. ఎందుకంటె, contestant లో ప్రతిభ ఎట్లావున్నా తనకు నచ్చిన / మెచ్చిన contestant కోసం ఒక్క ధనికుడైన వ్యక్తి (One of the viewers) తనస్థోమతనుబట్టి ఎన్ని లక్షల SMS ల వోట్లైనా వెయ్యచ్చు. తన ఇష్టాన్ని యావద్భారత ఎన్నికగా మార్చవచ్చు. ఇదెక్కడి ప్రజాస్వామ్య పద్ధతి?
TV Channels వారి రాబడి కోట్లలో ఉండబట్టి వాళ్ళుగూడ income ను ఇస్తున్న contestantలతోనే కార్యక్రమాలను నడిపిస్తున్నరన్నది నిర్వివాదాంశం. (దాంట్ల కొంత commercials/ads ద్వారా వచ్చినా, పాపులేషన్లకు, పిస్స పాపులారిటీలకు, వీర/వెర్రిఅభిమానులకు కరువులేని దేశమాయె, వాండ్లకు SMS ల ద్వారాగూడ మస్తురాబడాయె)
ఈ మధ్య నాగ్గూడ SMS ల తోని నెత్తినొప్పి ఎక్కువైంది (రాత్రిలేదు/పగలులేదు). ఫలానా కారు గెలుచుకో, ఫలాన 6 ప్రశ్నలకు జవాబిస్తె ఇంకేదో ఫ్ర్రీ అనీ.. ప్రతి sms కు 6/- మాత్రమే అని!!
ఇట్ల రోజుకో యాభయి మెస్సేజులు.. మెసేజ్ బాక్సు క్లీంజేసుడే పని!!
నాకు తల్కాయదిర్గిపోయి – తెలిసిన help lines అన్నిటికి మాట్లాడి, do not distrurb option అనందొకటున్నదని తెల్సుకొని దాని ద్వారా DNC ACT అన్న message ను 53733 నంబరు పంపించి activiate చేయించుకున్న.
ఇప్పుడు నాకు 45 రోజుల తర్వాతనే “బంధవిముక్తి”. తర్వాత “కీక్..కీక్..” అని సౌండ్ వస్తె అది ఇంపాంర్టెంట్ విషయమని తెలిసి నిద్రలేసైన చూస్త.
ఇప్పుడైతె, దీవాలి ధమాకా-జువ్వా (I mean జూదం and not తారాజువ్వ) మెస్సేజులతొ నా సెల్లు… ఫుల్లే!!!!!!!!!!
November 21st, 2007 at 5:11 am
బాగా చెప్పారు రాకేష్ గారు.
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=154&pageNo=0
http://www.aavakaaya.com/showArticle.aspx?a=li&articleId=153&pageNo=0
ఇక్కడి కవితలు కూడా బాగున్నాయి.