Oct2007
నల్లగొర్రె
తలొంచుకుని ముందు నడుస్తున్న
సహచరుణ్ని అనుసరిస్తున్నాయి గొర్రెలన్నీ
తలొంచుకుని నడవడం గొర్రెల అలవాటు కదా
ఓ మందలో ఒక నల్లగొర్రె
తలెత్తుకోవడం నేర్చుకుంది
తుప్పుపట్టిన రీతిరివాజుల్ని ధిక్కరించింది
గొర్రెలన్నీ బెంబేలెత్తిపోయి
తలదించుకొని బతకడం మనజాతి లక్షణమంటూ
నల్లగొర్రె తలదించుకునేదాకా గోల పెట్టాయి
తలదించుకొని గొర్రెలన్నీ సాగిపోతున్నాయి
ఉన్నట్టుండి ముందు గొర్రె ‘బిస్మిల్లా’ అంటూ
ఓ గెట్టు దూకింది
గొర్రెలన్నీ అలాగే అంటూ దూకేశాయి
ఏదో అనుమానమొచ్చిన నల్లగొర్రె
తలెత్తి ముందుకు చూసింది
సహచరులు కనిపించలేదు
కాస్త ముందుకెళ్లి తొంగి చూసింది
గొర్రెలన్నీ ఓ పురాతన బావిలో పడి
గిలగిలా కొట్టుకుంటున్నాయి
నిస్సహాయంగా చూసిన నల్లగొర్రె
పక్కకు తప్పుకొని
కొత్తదారి వేస్తూపోయింది
భవిష్యత్ తరాల కోసం
October 3rd, 2007 at 8:04 pm
స్కైబాబ గారు,
మీ పద్యం చాలా బాగుంది. ఈనాడు మన సమాజంలో ప్రతి ఒక్కరు స్వంతగా ఆలోచించి ముందుకు పోవడం చాలా ముక్యం. చదువుకోని వారి కన్న చదువుకున్నవారు మన సమాజంలో కులం, మతం పేరుతో మూర్కంగా ప్రవర్తిస్తారు . మీ పద్యం అందరికి కనువిప్పు కలిగిస్తాదని నాఆశ!
October 14th, 2007 at 3:11 am
బావుందండి. మంచి కవితలు ఇలాగే కొనసాగించండి.
October 15th, 2007 at 12:33 am
స్వంత మతంలోని చాంధస భావాల్ని విమర్శిస్తు, చక్కని ఫిలాసాపికల్ పోయెమ్ రాసిన కవి స్కైకి అభినందనలు.
October 15th, 2007 at 1:48 am
బావుంది.
October 17th, 2007 at 1:36 am
ఈకవిత చాలా బాగుంది. చదువుతుంటే ఎక్కడో చదివిన “నల్లచేపపిల్ల కథ” గుర్తుకు వచ్చింది.
October 17th, 2007 at 3:46 am
పిల్లలకు చెప్పే నీతికథలానే ఉంది, కవిత్వం శూన్యం.
November 3rd, 2007 at 9:25 pm
[...] మీ ముందుకు తెస్తున్నాం. స్కైబాబ ‘నల్ల గొర్రె’ కవితలో సంప్రదాయాల్ని ధిక్కరించి [...]
November 3rd, 2007 at 9:34 pm
[...] కవిత: నల్లగొర్రె – స్కైబాబ * కవిత: గుప్పిట్లో భూగోళం – [...]