Oct2007
పెనుగులాట
నాగలి దున్నే చేతుల్లో
ఎర్రజెండాలు దండు కట్టి నినదిస్తున్నాయి
ఊరూరి దొరలు ఒక్కటై
నైజాం పైజామల జాక్కున్న రోజులు
పిడికెడు బువ్వ గుంటెడు భూమి
కోసం జరిగే లొల్లే కాదు అది
దోప్కం లేని రాజ్యకాంక్ష
రజాకర్లు భూస్వాములు మిలిటరీ
మిలాఖతై దాడి చేసిండ్రు
నలభై ఆరు – యాభై ఒక్కటిల మధ్య
కొట్లాట కొసముట్టలే
పంద్రాగస్ట్ అప్పగింతలు
తారుమారైన జెండాలతో
మా నేలకు సంబంధమేలేదు
లగన్న పొద్దు పొడవక ముందె
సెప్టెంబర్ పదిహేడున తెల్లవారింది
ఎవరి పతాకం వారి పంచన చేరింది
తెలంగాణ ప్రజల నొసటి మీద
పోరాటపు గీతలు
పుట్టుకతోనే నెత్తుటి చారికలు
అరవై ఏళ్లుగా
దినదినం తకెపెకెల జీతం
నవంబర్ ఒకటి చీకటి
బొయ్యారంలోకి చిక్కిన దినం
యాభై ఏండ్ల వలస పాలనలో
వికసిన దీపం చల్లారింది
నేలనంతా తలకు చుట్టుకున్న
అగ్రకుల భూస్వాముల పయ్యల మీద
ఆకలి ఆత్మగౌరవం నలిగిపోయింది
ఆదివాసీ అరణ్యాల నుంచి
ప్రవహిస్తున్న నెత్తుటి నదులు
నేలమీద కాలు నిలపనీయని సమయం
వ్యాపార సామ్రాజ్యానికి సరిహద్దులు
చెరిపేస్తున్న ప్రపంచీకరణ సందర్భం
ఇది అరవై ఏళ్లుగా అస్తిత్వం కోసం
అనివార్యమైన పెనుగులాట
October 19th, 2007 at 4:42 am
Penugulata kavitha bagundi. Telangana Porata Sphurthini, aaveshanni chakkagaa prathibimbinchindi. asthithwam kosam aarata paduthunna vaari kramanni kavithalo chakkaga vyakthikarinchaaru.
November 3rd, 2007 at 9:26 pm
[...] తెలంగాణ ను అన్నవరం దేవేదందర్ తన ‘పెనుగులాట’ కవితలో ప్రకటిస్తే, పండగకి [...]
November 3rd, 2007 at 9:34 pm
[...] – తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ * కవిత: పెనుగులాట – అన్నవరం దేవేందర్ * కవిత: నడిచే [...]