Oct2007
సజీవ వీడ్కోలు
నేస్తం! ప్రేమ తళతళామెరిసే నా కళ్లమీద
త్వరగా కాసిన్ని ముద్దులు పెట్టు
తనివితీరా హత్తుకుని నాకు వీడ్కోలు చెప్పు
సాయంత్రం ఇలా వస్తానో – రానో -
సజీవంగా –
నాలో పొంగే ప్రేమ ప్రవాహాల పరవళ్లలాగా
నీ కిష్టమైన ఉత్సాహపు చిర్నవ్వుతో
ఎదురొస్తానో లేదో
జనసమ్మర్దంలో గిరగిరా బొంగరాల్లో తిరగాల్సిన వాళ్లం -
బయటికెళ్లి నాలుగువేళ్లు నోట్లోకిపోయే మార్గాలు వెతుక్కోవల్సిన వాళ్లం -
ఎక్కడ తప్పించుకోగలం ?
పార్కుల కెళ్లొద్దు
చాట్ బండార్లు, రద్దీ హోటళ్లపై చూడొద్దు
సినిమా హాళ్లు సరేసరి
తాజాగా – రోడ్డు మీదికెళ్లొద్దు
ఆకాశం లోంచి ప్రమాదాలు ఫ్లై ఓవర్లై విరుచుకుపడతాయి
నగరం నిన్ను అడగడుగునా అభద్రతతో కప్పుకుంటుంది
పల్లె పరస్పర కాల్పులతో కౌగిలించుకుంటుంది
కణకణా రగిలిపోయే వాదాల ముందు నువ్వెంత? నేనెంత?
తప్పెవరిదైనా తలకు విలువలేని సామాన్యులం – మనమెంత?
దారుణాలు, వైఫల్యాలు, అరాచకాలు, అవినీతులు, రాజకీయాలు
ఏవీ తెలీనక్కరలేదు మనం మరణించడాన్కి -
రాత్రయ్యేసరికి క్షేమంగా గట్టెక్కేమన్నదే గొప్ప సంతోషం
ప్రతిరోజూ ఇవేళ్టి వరకూ బతికి ఉన్నామన్నదే గొప్ప ఆనందం
నేస్తం ! మళ్లీ పేరు నేనిలా నీ ఎదుట
కురిసే మంచు బిందువులా తళుక్కున మెరుస్తానో – లేదో
ప్రేమించే చేతుల్తో తల నిమురుతానో లేదో
సాయంత్రం నిన్నిలా సజీవంగా చూస్తానోలేదో
నీ కన్రెప్పల మీద గాఢంగా ఒక్క ముద్దు పెట్టనివ్వు
వీథి చివరంటూ నీతో వచ్చి వీడ్కోలు చెప్పనివ్వు
sreenivas Oct 2, 2007 1
ఇస్లామిక్ తీవ్రవాదం గురించి స్పందించింత వేగంగా గిరిజన మహిళల పై అత్యాచారాకు నిరసనగా ఫెమినిస్టులు ఎందుకు స్పందించరో! స్పందన రాజకీయాల మీద ముందు విస్త్రుతంగా చర్చ జరగాలి. వాకపాడు ఘటన కదిలించ లీదా గీత గారు?
ViswaK Oct 17, 2007 2
రక్తమాంసదాహం కన్నా మెరుగే. కవిత్వం కనిపించే లైనులు చాలా కొన్నే.
శ్రీనివాస్ గారు ఆడిగి రాయించుకునే సినిమా పాటలు కాదు కవిత్వం. అయినా ఫెమినిస్టులకి, బాంబు బ్లాస్టుల మీద రాసిన కవితకి ఏంటి సంబంధం?
Vemuri Chandra Sekhar Nov 30, 2007 3
కవిత్వం్ కనిపించే లెఇనుల కోసం్ భూతద్దం్ పెట్టుకుని వెతికే బదులు గీత గారి కవితలో భావం మన మనస్సుల్ని ఎలా స్పృశించిందో, ఆమె చెప్పదల్చుకున్నది చక్కగా హత్తుకునేట్లు ఎలా చెప్పారో గమనించాలి.
యేది కదిలించాలో, దేనికి స్పందించాలో మనం ఎలా శాసించగలం ?.
అయితే స్పందన రాజకీయాల మీద చర్చజరగడం మంచిదే. .