సమాచార విప్లవం

……..
యూజరు నేమ్: భారతీదేవి
సబ్జెక్టు: ఐ లవ్యూ, వామన రావు
……..

రిజిస్టరు నంబరు: టి.405081 గారికి,

‘డోకూ’ డాట్ కామ్‌లో మిమ్మల్ని చూశాను. మీరు చాలా అందంగా వున్నారు. సో నేను ఆన్సరు చేయాల్సిన వంద మెయిల్సు పక్కన పెట్టి మీకే ముందుగా జవాబిస్తున్నాను. ప్రొఫెషనల్‌గా నేను ఎంతో మందిని గాల్సుని చూశాను. కానీ మిమ్మల్ని చూశాకే స్పందించడం మొదలు పెట్టాను. తీరా స్పందించడం మొదలు పెట్టాను కాబట్టి ఇక మన ఇద్దరి మధ్య దూరాలు వుండకూడదనే ఉద్దేశంతో
ఇలా రాస్తున్నాను. ఫొటోలో మీరు వేసుకున్న గొలుసు ఏమీ బాలేదు. అలాంటివి మా హైద్రాబాదులో కోటీ రొడ్ల మీద అమ్ముతారు. అలాంటివి వేసుకూంటే రేపు మా ఫ్రెండ్సు ఏమనుకుంటారు? మీ మొగుడు పనికి రాని వాడని, బంగారం కొనలేడని అంచేత పిచ్చి పూసల గొలుసు వేసుకున్నారని అనుకుంటారా? అనుకోరా? ఆ బాధ కుడామీకే కదా! కాబట్టి నా మీద ప్రేమతో మీరు ఆ గొలుసు తీసెయ్యండి. అందాకా ఒక సన్నపాటి గొలుసు మీ డేడీ ని అడిగి కొనిపించుకోండి. అన్నట్టు ఎలాంటి గాజులు వేసుకున్నారో ఇక్కడ కనిపించడం లేదు. అయినా అవి మీ ఇష్టం. స్త్రీ స్వతంత్రాన్ని నేను పూర్తిగా సమర్ధిస్తాను.

మీ కోసం ఎదురు చూపులతో…
రిజిస్టరు నంబరు. యు.508129

***
విప్లవ: హెలో
భారతి: ………
విప్లవ: హెలో వినిపిస్తొందా? నేను విప్లవ ని…..
భారతి: హెలో ఎవరు?
విప్లవ: నేనండీ…
భారతి: కొంచెం గట్టిగా చెప్పండి. మా వూళ్ళో సిగ్నలు సరిగా వుండదు
విప్లవ: ఇప్పుడు వినిపిస్తోందా??
భారతి: గుర …మృఇ…ఋఋఆతి
విప్లవ: భారతి గారూ నేనూ…
భారతి: చెప్పండి ఇప్పుడు వినిపిస్తోంది
విప్లవ: హమ్మయ్య… నేను మీతో చాలా మాట్లాడాలనుకుంటున్నాను. పెళ్ళిచూపుల కంటే ఫోనే నయమనిపించి చేస్తున్నాను. నా గురించి మీకు చాలా చెప్పాలి. నేను డౌన్ టు ఎర్త్ మనిషిని. వెరీ మచ్ జోవియల్.
భారతి: ………….
విప్లవ: అభిరుచులంటారా ? గోంగూర చట్నీ నచ్చుతుంది. మా అమ్మ ఇప్పటికి ఆరు సార్లు చేసింది. యూ నో ఒన్ థింగ్. నేను యు.ఎస్ నుంచి వచ్చిందే దానికోసం. అఫ్కోర్స్… పెళ్ళికోసం కూడా అనుకోండి. ఐ లైక్ యువర్ హొంలీ ఫీచర్స్. నేను ఏదయినా మొహం మీద చెప్పేస్తాను. సీను క్రియేషన్స్ వుండవు. నేను నాచురల్ గా వుండటానికి ట్రై చేస్తాను. సపోజు గోంగూర చట్నీ వుందనుకోండి. అది రోట్లో చేస్తేనే నచ్చుతుంది. మిక్సీలో నచ్చదన్న మాట. డెలివరీ వుందనుకోండి. సిజేరియన్ వల్ల మదర్ తన నాచురల్ పెయిన్స్ మిస్సవుతోందని ఎక్కడో చదివాను. నా వైఫ్ ని నాచురల్ గా వుండనిస్తాను. వింటున్నారా? మీరు కూడా ఇలా ఫ్రీ గా మాట్లాడండి. ఐ లైక్ దట్ స్పిరిట్.
భారతి: … అదికాదు…
విప్లవ: సిగ్గు పడుతున్నారా? అందుకే ఇండియా ఏరి కోరి వచ్చాను. సిగ్గుపడే ఆడవాళ్ళని చూసి ఎంత కాలమయిందో! రేపు మీకు వీడియో ఫోను పంపనా? మిమ్మల్ని మిస్సవకుండా చూడచ్చు.
భారతి: ఒక నిమిషం హెలో….
విప్లవ: ఇంక మీరేం అడ్డు చెప్పకండి. మీరు వేరు, నేను వేరు కాదు. ఇద్దరం ఒకటే
భారతి: హెలో గుర్…గుర్…..
విప్లవ: డుర్…డుర్..డు..ర్ ర్ర్…

ఒకే వారంలో వచ్చిన మెయిలుకి, ఫోనుకీ జవాబు రాసి మళ్ళీ చదువుకుంది భారతి.

ఇమెయిలు రాసిన వాయు వేగం వామన రావు గారికి,
సెలుఫోను చేసిన వరదా విప్లవ కుమార్ గారికి ,

పత్రికా ముఖంగా నమస్కరించుకుంటున్నాను. సమాచార విప్లవ ప్రభావంతో మీరు అత్యంత చురుకుగా స్పందించినందుకు కృతజ్ఞతలు. మీరిద్దరూ అనుకున్నట్టుగా నా పేరు భారతి అయిన మాట నిజమే గాని నేను కాబొయే పెళ్ళి కూతుర్ని కాదు. అది తెలియ జేయడానికి ఈ ప్రకటన తప్ప దారి లేకుండా పోయింది. ఇది కూడా మీరు చదువుతారో లేదో తెలీదు. నాకు పెళ్ళయింది. ఇద్దరు పిల్లలు కూడా.

మొదట “వారెవ్వా డాట్ కాం” లోనూ, తర్వాత “ఓరబ్బో డాట్ కాం” లోనూ వివరాల్ని రిజిస్టరు చేయించుకుని అది చూసి చెప్పడం కోసం పక్కవూరికి తిరిగి తన కోసం కష్టపడుతున్న బావను చూసి అనుకోకుండా ప్రేమించి పెళ్ళి చేసుకున్నావిడ మారుతీ కుమారి. అసలు పేరు ఇవ్వడం ఇష్టం లేక భారతి అని ఇచ్చి వుండచ్చు. మారుతి మొహాన్ని భారతి పేరుతో చూస్తూ వుండటం వల్ల ఇంత చిక్కు వచ్చింది. అది రద్దు చెయ్యమని నేను ఎన్ని సార్లు చెప్పినా గాని అనవసరంగా రు.1000 దండగ అవుతుందని ఆ చిరునామాకు వచ్చిన సంబంధాల్ని ఇప్పుడు ఆమె అక్క కూతురికి బట్వాడా చేస్తున్నారు. మారుతికి సెల్యూలరు ఫోను వినడం వచ్చు గాని నంబర్లు నొక్కడం అంతగా రాదు. అందుకని తనకి పెళ్ళిలో ఎవరో ఇచ్చిన ఈ ఫోను నాకు ఇచ్చేసింది. కొత్త చిప్పు మార్చడానికి తీరిక లేక నేను అదే వాడుతున్నాను. భారతి పేరుతో మారుతికి వచ్చిన అన్ని మెయిళ్ళూ ప్రింటవుట్లు తీసి మా తమ్ముడు అప్పుడప్పుడు సిటీ నించి తెస్తూ వుంటాడు. మాకు మాత్రమే అర్ధమైన ఈ ఏర్పాటు మిమ్మల్ని ఇంతగా ఇబ్బంది పెడుతుందనుకోలేదు.

మా వూళ్ళో నెట్ ఫోన్ సెంటర్ ఒకటి వుంది గాని వానాకాలం ఈ వాగు దాటి వెళ్ళలేనంత దూరంగా వుంటుంది. మూడు ఎన్నికల నుంచి మా వూరిని తవ్వుతున్నారు, పూడ్చుతున్నారు గాని ఇంతవరకూ మంచినీళ్ళ పంపులు పడలేదు. రోగం వస్తే భూత వైద్యుడి దగ్గరకు వెడతాం. మా భూత వైద్యుడు ఈ మధ్య ఇలాంటి సెలుఫోనులోనే ఆత్మలతో మాట్లాడుతున్నాడు. మీరు చేసిన ఫోను పక్కవూరి టవరు నుంచి రావాలి కాబట్టి సరిగా వినిపించదు. బీరు షాపులకి దొరికినన్ని పర్మిట్లు బియ్యం దుకాణాలకు దొరకవు. మారుతి మెళ్ళో మీకు నచ్చలేదని చెబుతున్నది పూసల దండ కాదు. ముత్యాల దండ. మా వూళ్ళో వున్న ఫొటో స్టూడియోలో బ్లాక్ అండు వైట్ ఫొటోలకే నచ్చిన రంగులు వేసి కలర్ ఫొటో ఛార్జి వసూలు చేస్తాడు. అందువల్ల అది పిచ్చి పూసల దండలా
కనిపించి వుండచ్చు. మీ వూరి రోడ్ల మీద దొరికే పిచ్చిపూసల దండల కంటే ఎక్కువగా మేము మనుషులనే కట్నాలిచ్చి కొనుక్కుంటూ వుంటాం. కొనలేకపోతే కన్యలుగా వుండి పోతాం. అయినా గాని విజ్ఞులైన మీ ఇద్దరికి నేను ఒక విషయం విన్నవించుకోదలచుకున్నాను. అదేమిటంటే, తమాషా కోసం అయినా మీరు కొద్ది రోజులు ఎదుటి వాళ్ళను వినడం అలవాటు చేసుకోండి. మీరు మాట్లాడ్డం మొదలుపెడితే ఆపడం కష్టం గా వుంది.

త్వరలొ మీ ఇద్దరికీ గోంగూర పచ్చడి చేసే ఐశ్వర్య రాయి లాంటి అమ్మాయి భార్యగా రావాలని కోరుకుంటున్నాను.

మీకు కలిగిన అసౌకర్యానికి చింతిస్తూ…
భారతీ దేవి

గల్పికలు

4 అభిప్రాయాలు

  1. ప్రాణహిత » అక్టోబర్ 2007 సంచిక నవంబర్ 2007 1

    […] కొండేపూడి నిర్మల గల్పిక ‘సమాచార విప్లవం‘ అద్భుతమయిన వ్యంగ్యంతో […]

  2. ప్రాణహిత » అక్టోబర్ 2007 సూచిక నవంబర్ 2007 2

    […] కలమ్మ కలకలం – జూపాక సుభద్ర   * గల్పిక: సమాచార విప్లవం - కొండేపూడి నిర్మల   * కథ: తెల్లకాకులు – […]

  3. Rajani ఫిబ్రవరి 2008 3

    మీ కధ చాలా హాస్యంగా వుంది. చాలా నవ్వుకున్నాను.

  4. K.Audisesha Reddy అక్టోబర్ 2008 4

    మీ గల్పిక సరదాగా వుంది. హాయిగా నవ్వుకుంటూ చదివాను. ఈ టెన్షన్ యుగంలో హాస్యమ్ అవసరము.
    =— కైపు ఆదిశేషా రెడ్డి. నెల్లూరు.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో