Oct2007
సొంతిల్లు
మనదనుకుంటే మనదే
కాదనుకుంటే కాదు
అనేవారు తాతయ్య
కష్టపటి కట్టించాను
పాడుపడనివ్వొద్దు
అమ్ముకోనూవద్దు
అనేవారు నాన్న
నేను చేయగలిగిందంతా చేస్తూనే ఉన్నాను
రోడ్లు కబ్జాల కన్ను పడనంతవరకే
నాదైనా
పిల్లలదైనా
కాలాన్ని కాలం
దూరాన్ని దూరం
మింగుతూనే ఉన్నట్టు
ఆశని ఆశ
October 4th, 2007 at 9:23 am
కవిత్వం శూన్యం.
October 13th, 2007 at 6:02 am
దూరాన్ని దూరమా? ఆశని ఆశా?? మొదలుకి చివరకి పొంతన లేదు. అసలు అర్ధం లేదు.
ఇలాంటి కవితలు ప్రచురించక పోవడం మంచిది.
October 14th, 2007 at 4:49 am
ఎడిటర్లు ముందు మాటలో ప్రస్తావించిన ఈ కవితలోని తాత్వికత ఏమిటో అర్ధం కాలేదు. “భూమి నాది అనిన భూమి ఫక్కున నవ్వు” అనడం తాత్వికత. ఎవడో భూమిని కబ్జా చేసాడని ఏడవడం కాదు. దూరాన్ని దూరం, ఆశని ఆశ అలాగే కవిత్వాన్ని కీర్తి దాహం ! అని సరిపెట్టుకోవాలేమో!
October 17th, 2007 at 4:04 am
అంత గొప్పగా ఐతే లేదు.
మల్లిఖార్జునరావు గారు, దూరాన్ని దూరం, కాలాన్ని కాలం మింగుతున్నట్లుగానే, తాత ఆశయం నుంచి తండ్రి ఆశ, ఆ పిదప తన ఆశా ఎలా మింగబడుతున్నాయనే విషయం చెప్పారు ఇక్కడ కవి.