November 2007 సంచిక

నవంబర్ 2007 : సంపాదకీయం

‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
నవంబర్ ఒకటి – ప్రముఖ సాహితీయోధుడు వట్టికోట ఆళ్వారుస్వామి జయంతి. 1915 లో తెలంగాణ లోని ఒక పల్లెటూర్లో జన్మించిన ఆళ్వారుస్వామి, తన 46వ ఏట 1961 లో మరణించారు. తన 46 ఏళ్ల పరిమిత జీవితంలోనే అపరిమిత విజయాలు సాధించారు. జీవితకాలమంతా సాహిత్య జీవనం, సంఘ కార్యాలు తన రెండు బుజాలుగా పనిచేసారు. ప్రజల మనిషి’, ‘గంగు’ – రెండు నవలలు రాసారు. ‘జైలు లోపల’ మరికొన్ని ఇతర కథలు రాసారు. ‘రామప్ప రభస’ అనే రాజకీయ వ్యంగ్య రచనలు చేసారు. ‘వీణ’, ‘తెలుగు తల్లి’ పత్రికలను నిర్వహించారు. ‘దేశోద్ధార గ్రంథమాల’ ను నెలకొల్పి దాదాపు 30 పుస్తకాలు తన ముద్రతో ప్రచురించారు. గ్రంథాలయోద్యమం లో క్రియాశీలకంగా పాల్గొని, రచయితగా అభ్యుదయ రచయితల సంఘం, తెలంగాణ రచయితల సంఘాల్లో పనిచేసారు. సామాజిక చైతన్యకారుడిగా ఆర్య సమాజం, ఆంధ్ర మహాసభల్లో, రాజకీయ కార్యకర్తగా స్టేట్ కాంగ్రెస్ , కమ్యూనిస్టు పార్టీల్లో, కార్మిక నాయకుడిగా ‘గుమస్తాల సంఘం’, ‘రిక్షాకార్మికుల సంఘం’, ‘రైల్వే కార్మికులసంఘం’ కార్యకలాపాల్లో అంకిత భావంతో పనిచేసారు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

నవంబర్ 2007 సూచిక

సూచిక:

అభిప్రాయాలు లేవు »సూచిక

మా వట్టికోట ఆళ్వారుస్వామి

అసలు ఆళ్వార్లు పన్నెండు మందే!
పదమూడో ఆళ్వార్ మా
వట్టికోట ఆళ్వారుస్వామి
నిర్మల హృదయానికి
మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

మూడవ చిత్తరువు

పొలం మధ్యలో నిలబడి
తలెత్తి సూర్యుడికి నమస్కరించి అతడనుకున్నాడు
”ఈ నేల నాది… ఈ నేల మీది ఆకాశం నాది
మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

చెదిరిన గూడు

కొమ్మల్ని కప్పేసిన పక్షులతో
కిలకిలలాడే మహావృక్షాన్ని
తల్లి వేరుకు దూరం చేసినట్లు
ఇప్పుడా బస్సు డిపో
ఖాళీ చేసిన అంగడైంది
దాన్యంలేని కల్లమైంది
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

నా కొక ఖిబ్లా కావాలి

అలా…
వెతుకుతూ ఎంత దూరమైన వెళ్లూ
నీకంటూ వారసుడొక్కడూ దొరకడు
దువా దోసిట్లోంచి జారిన నమ్మకం
వాడి చేతిలో కొత్తరకం ఆయుధమై
నిగనిగ మెరుస్తుంటుంది
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

జమీలా అడుగుల చప్పుడు

అగ్నికీలవి జమీలా
అశీర్షికవి… అస్మితవి
చీకటి చిత్రశాలలో
కరిగిన కేన్వాసువి
అయితేనేమి?
మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

బతుకమ్మ పాట

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నిలిచింది బతుకమ్మ ఉయ్యాలో
తెలుగోళ్ల పర్వంగా ఉయ్యాలో
మొత్తం చదవండి »

7 అభిప్రాయాలు »పాటలు

మున్సిపాల్టి థెరిస్సా…!

పక్షి ఎగిరిపోయినట్టు
చూస్తుండగానే
బతుకు చేజారిపోయింది.
నీదో,నాదో
లేదా ఇంకొకరిదో.
ఎవరిదైతేనేం….?
మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

దృశ్య శకలాలు వెంటాడుతున్నాయి…

దృశ్య శకలాలు వెంటాడుతున్నాయి…
పారిపోదామని ప్రయత్నిస్తూ
మళ్ళీ పంజరం లోకే వెళ్తున్నాను!
మొత్తం చదవండి »

6 అభిప్రాయాలు »కవితలు

ఆశ్రయం

అప్పుడు ఊళ్లో కొంపైనా ఉండేది, తిన్నా తినక పోయినా కొంపలో పడి ఉంటే అడిగేనాధుడే ఉండడు. రెక్కలు ముక్కలు చేసుకోని చేసినన్నాళ్లు చేస్తిని. వాడికి రెక్కలు తెస్తిని. రెక్కలు వొచ్చినియ్యని పైపైకి ఎగిరిపోతుండాడు. ఇంక నాకేడ అందుతాడు.

నేను కడతేరి పోయిందాకా ఆ కొంప అమ్మొద్దని చెబుతూనే ఉండా. ఇంకా ఊళ్లో అది ఎందుకమ్మా ఎవురో ఒకరు ఆక్రమించేసుకుంటారు. నేనింత ఆపీసర్ని అయి కూడా నువ్వు ఒక్క దానివే అక్కడ ఉంటే నాకు ఎంత నామోషీగా ఉంటుందని ఎంత నైత్రంగా చెప్పాడు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

సారీఘర్ (పురిటిగది)

వెచ్చపెట్టిన ఆముదంగిన్నె కుంపటిమీంచి దించి బల్లమీద పెట్టింది మంత్రసాని దాదమ్మ. అకస్మాత్తుగా మొదలయిన పురిటి నొప్పులతో అతలాకుతలమవుతున్న అదిలాదేవి అలవాటు కొద్దీ కాళ్ళు జాపుకోబోయి ఆ మధ్యగా వున్న మేరుపర్వతంలాంటి కడుపులో ఎక్కడో కలుక్కుమంటే ఒకసారి మూలిగింది. కళ్ళకు కట్టిన గంతలు జారిపోతుంటే బిగించి కట్టింది దాదమ్మ. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

చప్పుడు

“శీనుగా టీ తీసుకురా…”

రెడ్డి కేకేసాడు. ఆ కేకతో శీనుగాడు అనబడే కావాటి గునయ్య శ్రీనివాసులు అనబడే సర్పంచు రెడ్డిగారి ఇంట్లోకి పరుగున వెళ్లాడు.

రెడ్డిగారింట్లో హాల్లో ఎం.ఆర్‌.ఒ., ఎం.డి.ఒ., ఈ.ఒ.పి.ఆర్‌.డి., పంచాయతి సెక్రటరి, ఇంకా ఇద్దరు ముగ్గురు ఊరి పెద్దలనబడే వాళ్లు కూర్చుని ఉన్నారు. అందరిలోనూ ఏదో దర్పం తొంగిచూస్తోంది. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »కథలు

‘ప్రజల మనిషి’లో ప్రజల జీవితం

‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
‘ప్రజల మనిషి’ వట్టికోట ఆళ్వారుస్వామి
వట్టికోట ఆళ్వారుస్వామి ‘ప్రజల మనిషి’ ఉద్యమ నవలల్లో దాదాపు మొదటిది. ఆ తర్వాత ఎన్నో ఉద్యమ నవలలొచ్చాయి. వాటన్నిటినీ ఒక్క మాటలో తేలికగా తేల్చి చెప్పటం న్యాయం కాదు గానీ, వాటిలో ఉద్యమం మీద దృష్టి కనిపించినంతగా ప్రజలజీవితం మీద కనిపించలేదంటే, అంగీకరించవలసిందేననిపిస్తుంది. ఇప్పుడు పేరు పేరునా ఉదహరించలేను కానీ, మరీ కొన్ని రచనల్లోనైతే, ఆయా ఉద్యమాలు ఎవరికోసం జరిగినట్టో అర్థం కానంతగా ఉద్యమకాంక్ష అల్లుకుని ప్రధానంగా ఉండవలసిన ప్రజలజీవితం కంతల్లో కనిపించినట్టుగా అక్కడక్కడా మాత్రమే కనిపించిందంటే అసత్యం కానీ, అతిశయోక్తి కానీ కాదు. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సాహిత్య వ్యాసాలు

‘హిందూత్వ’ దాష్టీకాన్ని ప్రశ్నించిన ముస్లింవాద కవిత్వం

తెలుగు సాహిత్యంలో అస్తిత్వ ఉద్యమాలు ఊపందుకున్న కాలం ఇది. స్త్రీవాదం, దళితవాదం వరుసలో ముస్లింవాద సాహిత్యం తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని నిలబెట్టుకున్నది. అందుకు ఆ వాదం నుంచి వచ్చిన బలమైన సంకలనాలే సాక్ష్యం. 1991లో ఖాదర్‌ మొహియుద్దీన్‌ ‘పుట్టుమచ్చ’ దీర్ఘ కవిత, 1997లో విరసం ప్రచురణగా ‘జీహాద్‌’ ముస్లిం మైనారిటీ వుల కవితా సంకలనం, 1998లో స్కైబాబ సంపాదకత్వంలో నీలగిరి సాహితి ప్రచురణగా ‘జల్‌జలా’ ముస్లింవాద కవితా సంకలనం, మొత్తం చదవండి »

14 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

వట్టికోట ఆళ్వారుస్వామి – ఎం.వి. తిరుపతయ్య

తెలంగాణలో వట్టికోట ఆళ్వారుస్వామి రచనా సంప్రదాయానికి చెందిన రచయిత ఎం.వి. తిరుపతయ్య అంటే ప్రచార సంరంభంలో పడిపోయిన తెలుగు సాహిత్యరంగం అంగీకరించక పోవచ్చు. నవలా రచయితలుగానే తీసుకుంటే ఇద్దరూ చెరి రెండు నవలలు రాసారు. ఆళ్వారుస్వామి గారు 1930లలో, 40ల ఆరంభంలో తెలంగాణ పరిస్థితులు, ఉద్యమాలు కథావస్తువుగా పదిహేనేళ్లు పోయినాక రాస్తే తిరుపతయ్య తెలంగాణ పరిస్థితులు, ఉద్యమాలు కథావస్తువుగా వరంగల్‌ కేంద్ర బిందువుగా 1980ల గురించి పదిహేనేళ్లు, ఇరవై అయిదేళ్లు పోయాక రాసాడు. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »సాహిత్య వ్యాసాలు

గజ్జె కట్టిన ‘తెలంగాణ కవిత – 2006′

Painting by ‘Chitra’
Painting by ‘Chitra’
తెలంగాణ కొరకు ఉద్యమించిన ప్రజల ఆశల్నీ, ఆకాంక్షనీ శతవిధాల నీరు గార్చే ప్రభువుల మోసపూరిత పథకాలనీ, పన్నాగాలనీ ఇక ఎక్కడికక్కడ నిగ్గదీసి నిష్ఫలం గావించాల్సిన పతాక సన్నివేశంలోకి ప్రవేశించిన సందర్భమిది. విభేదాలనూ సన్న చిన్న విరుద్ధాభిప్రాయాలనూ జరూరుగా పక్కనబెట్టి ఒక్కటిగా నడవాల్సిన తరుణమిది. మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »పుస్తక సమీక్షలు

Next »