మూడవ చిత్తరువు

పొలం మధ్యలో నిలబడి
తలెత్తి సూర్యుడికి నమస్కరించి అతడనుకున్నాడు
”ఈ నేల నాది… ఈ నేల మీది ఆకాశం నాది
ఆరుగాలం శ్రమించి, దేహాన్నంతా స్వేదంగా రంగరించి
ఈ మట్టిలో బంగారం పండించగలను
రుణ భారాలను తొలగించుకుని
కడుపునిండా తిండి తినే
వొక ఆనందమయ జీవితం గడపగలను
పిచ్చివాడు నాయిన… అమాయక వేలిముద్రగాడు
విత్తనాలు, సాగునీరు, పురుగుమందులు
తాకట్టులు, వడ్డీలు, కనీస మద్దతుధరల నడుమ
యెక్కడో లెక్క తప్పినాడు…
లెక్కలు తెలిసిన చదువరిని నేను
నమ్ముకున్న తల్లినేల నట్టేట ముంచదు నన్ను

అతడిని ఆకాశం మోసం చేయలేదు
నమ్ముకున్న తల్లినేలా వంచించలేదు
కనిపించే లెక్కల మాటున
రెక్కలు కట్టుకు దాగిన మాయలెక్కయేదో
హఠాత్తుగా యెగిరొచ్చి ఆసాంతం మింగేసింది
మహాసముద్రమంత దుఃఖం… గుక్కెడు పురుగుల మందు
అతని అంతిమ ప్రయాణం కూడా
అతని తండ్రి నిష్క్రమించిన దారిలోనే

రుణభారం మరింత భారమై
అతని ఇంటి గోడల్ని ధ్వంసించింది
అతని భార్యా పిల్లలు, అతని ముసలి తల్లి
ఆసరా కోసం వూరిని విడిచి
అడవి వైపు సాగిపోయారు
ఇపుడతని కొడుకు చేతిలో రెండు చిత్తరువులు…

కవితలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో