బతుకమ్మ పాట

బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో
బంగారు బతుకమ్మ ఉయ్యాలో
నిలిచింది బతుకమ్మ ఉయ్యాలో
తెలుగోళ్ల పర్వంగా ఉయ్యాలో

నిన్నూ గొలిచినచో ఉయ్యాలో
నిండా శుభము మాకు ఉయ్యాలో
ఆనందముగ నీ చుట్టు ఉయ్యాలో
ఆడేము పాడేము ఉయ్యాలో

తంగేడు పూలెట్టి ఉయ్యాలో
తళతళలాడంగా ఉయ్యాలో
గునుగు పూలేట్టి ఉయ్యాలో
గుండ్రంగా తిరుగంగా ఉయ్యాలో

చామంతి పూలెట్టి ఉయ్యాలో
చప్పట్లు కొట్టంగ ఉయ్యాలో
కలువ పూలెట్టి ఉయ్యాలో
కోలాటమాడంగ ఉయ్యాలో

సీతజడల పూలెట్టి ఉయ్యాలో
సింగారింపంగ నిన్ను ఉయ్యాలో
పట్టుకుచ్చూ పూలెట్టి ఉయ్యాలో
పాటలూ పాడంగ ఉయ్యాలో

పట్టు చీరలూ కట్టి ఉయ్యాలో
పసుపుకుంకుమలతో ఉయ్యాలో
ఫలహారమియ్యంగ ఉయ్యాలో
పదిమందికీ మేము ఉయ్యాలో

చివరగా నిన్ను ఉయ్యాలో
చెరువులో విడువంగ ఉయ్యాలో
వీడ్కోలిచ్చాము నీకు ఉయ్యాలో
మళ్ళీ రమ్మంటూ నిన్ను ఉయ్యాలో

7 అభిప్రాయాలు »పాటలు

7 Responses to “బతుకమ్మ పాట”

  1. 1
    sreedasyam Says:

    telangana pandugallo athimukhyamaina bathukamma paduganu gurthuchestoo madarapu vanisri gaaru rasina bathukamma paata adbhuthangaa undi. kavayithrigaru rasina uyyalapata padukovataniki kooda anuvuga upyuktangaa undi.

  2. 2
    Anuradha Poddaturi Says:

    Bathukamma pata chala chala bagundi. Ilage migata pandugal meeda rayalani koruthunnanu.

  3. 3
    babji Says:

    సళామలెకుమ్
    నెను బాబజి అందరు ఎలావూనారు

  4. 4
    sumanth Says:

    బథుకమ్మకు పందుగకు ఎంథొ విషిది కని తెలంగన జిల్ల అయిన మహబుబ్నగర్ లొ బథుకమ్మ పందుగు నిర్వహించెవల్లు చల థక్కువ కబ్బతి ఎ పందుగ గురించి ప్రజ్జలొ చైతన్యమ్ తెవాలిఅయిన తెలంగన జిల్ల అయిన కరిమ్నగర్ లొ బొనలూ తెలియవూ

  5. 5
    kavitha Says:

    కలుసుకోవాలంటుంది
    రక్తనాళాలు గజిబిజి దారుల్లో
    తప్పిపోయెన్ ఒక్ రక్తపు బొట్టుని

  6. 6
    keerthi srinivas Says:

    చాల భగున్నయి. తెలంగన గురుంచి చెప్పె పాతలు రసవథరంగ వున్నయి. ఇఇన్కా చెపలని వుంధి కానీ సమయమ్ చాలక్ చెప్పలెక పొథున్నను.

  7. 7
    raki Says:

    telangaana udyama geetaalakai..www.raki9-4u.blogspot.com

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో