చెదిరిన గూడు

కొమ్మల్ని కప్పేసిన పక్షులతో
కిలకిలలాడే మహావృక్షాన్ని
తల్లి వేరుకు దూరం చేసినట్లు
ఇప్పుడా బస్సు డిపో
ఖాళీ చేసిన అంగడైంది
దాన్యంలేని కల్లమైంది

పక్షులన్నీ పరాయి నీడని వెతుక్కున్నట్లు
బస్సులన్నీ చెల్లా చెదురయ్యాయి
ప్రకృతి నగిషీలని
ప్రపంచానికి అద్దిన ఎర్రబస్సు
ఆనవాలు మిగిలి అనుబంధమైంది

బస్సంటే పల్లెకూ పట్టణానికీ
అనుసంధాన ఆత్మీయ బంధం కదా!
బస్సంటే పాడి పంటల
ప్రగతి బాటకు ప్రతీక కదా!
”ఏ కాండీర్‌ ఇకెవర్‌ నన్‌ వాతోనా”
(ఏ పిల్లలూ నేను వచ్చాను రండి) అంటూ
వాగుల నుంచి వంకల నుంచి
ఇప్పపూల గంపని ఎత్తుకొస్తున్న
ఆదిమ తల్లిలా పిల్లల్ని అలుముకునేది

గుట్టల పొంటీ గూడాల పొంటీ
రెల్లు పొదల రేల పాటల పొంటీ
రోడ్డు మీది నుంచి వస్తుంటే
పల్లె పల్లంతా పేరంటమై ఎదురుచూసేది

”నాడితల్‌ బస్‌ వాయె బెరె
(రేపటి నుంచి బస్సు రాదట) అంటూ
ఇప్పుడా గూడాల కళ్లన్నీ
కమ్ముకున్న నల్లమబ్బులయ్యాయి
కోయదాదల చిరకాల స్వప్నం ఈ తల్లి బస్సు

ఏ మహానేత కారుకి అడ్డంకి కాలేదు
ఏ అధికారి కాసుల సంచికి చిల్లిలా మారలేదు
తీసివేతకూ, మూసివేతలకు
కోతలకు వాతలకు
దమ్ముకచ్చిన జనానికి
నిద్రను మూసేసే కనురెప్పలాగే
బతుకుల్ని మూసేసే కాలం దాపురించింది

దేన్ని నిషేధించాలో
దేన్ని నిర్మూలించాలో
తెలియనట్లు నటించే
పాలుకులున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో
పల్లె బస్సు
ప్రయివేటీకరణ వలకు చిక్కిన
అమాయకపు పక్షి

(ఆదిలాబాద్‌ జిల్లా గిరిజన ప్రాంతంలోని ఉట్నూరు బస్సు డిపోను మూసివేసిన సందర్బంగా)

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. krishna chaitanya Nov 4, 2007 1

    “దేన్ని నిషేధించాలో
    దేన్ని నిర్మూలించాలో
    తెలియనట్లు నటించే
    పాలుకులున్న ప్రజాస్వామ్య వ్యవస్థలో
    పల్లె బస్సు
    ప్రయివేటీకరణ వలకు చిక్కిన
    అమాయకపు పక్షి”

    డా.ఉదారి నారాయణ కవిత పాలక దురన్యాయాన్ని బట్టబయలు పరచింది.అలాగె కార్మిక సంఘాల బొలు తనాన్ని చెప్పకనె చెప్పినట్లైంది. కవికి అభినందనలు….క్రిష్ణ చైతన్య

  2. Rakesh Telangaan Nov 5, 2007 2

    చాన మంచిగున్నది.

    అన్నిట్లా profit-loss మతలబులే వెదుక్కునే ఈ ప్రభుత్వం వేలకోట్ల ప్రాజెక్టులకోసం ఎందుకు ఉరుకుతాందొ??

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో