Nov2007
దృశ్య శకలాలు వెంటాడుతున్నాయి…
దృశ్య శకలాలు వెంటాడుతున్నాయి…
పారిపోదామని ప్రయత్నిస్తూ
మళ్ళీ పంజరం లోకే వెళ్తున్నాను!
జీవితం లోని గత స్మృతులన్నీ
పదునైన శూలాల్ల హృదయాన్ని
గాయం చేస్తూ నెత్తుటి ప్రశ్నలు వేస్తున్నాయి!
ఇంద్రియాలు ఉన్న
జంతువుని అని మాత్రమే
నేను చదివిన పాఠ్యపుస్తకాలు
నన్ను తీర్చిదిద్దాయి!
నీజాయితిగా ఉండడం
నేతి బీరకాయలో నేతి
ఉన్నంత నిజం!
కృత్రిమ బ్రతుకులే
ప్లాస్టిక్ నవ్వులే నేటి
తరానికి శరణ్యం !
నా మనస్సు నా నుంచి
విడాకులు తీసుకుంది
శరీరం అంతా “విదేశిబ్రాండ్” లతో నిండి
నాలోని అమ్మతనం అమ్ముడుపోయింది !
నాకు రెండు రక్తపు బొట్లను ఇవ్వండి
మీ జీవితాలను సస్యశ్యామలంగా మార్చి
నూతన సమాజ సృష్టికి అంకురార్పణ చేసి
అక్షరాలను ఆయుధంగా మార్చి దుర్మార్గాన్ని
సంహరిస్తాను!
ప్రపంచీకరణ నా సర్వస్వం
దోచుకుంది మిగిలింది
కేవలం నా కళేభరాలు మాత్రమే!
November 5th, 2007 at 9:38 am
రచయిత గారికి,
మీలొ తడి ఆరని కడు చిక్కని కవిత్వం ఉంది.వాస్తవికతను చైతన్య స్రవంతిలొ చెబుతున్న మికు మంచి భవిష్యత్తు ఉంది.
November 5th, 2007 at 10:18 am
Rajashekar గారు కవికి మంచి ప్రొత్సాహం ఇచ్చినందుకు అభినందించాలి. ఐతె ద్రుశ్య శకలాలు కు బదులు “శకల ద్రుశ్యాలు” అని ఉంటె ఎలా ఉంటుందొ ఊహిమంచమని మనవి.నాక్కొంచెం నమ్మకమివ్వమని బైరాగి అన్నట్లు “నాకు రెండు రక్తపు బొట్లు ఇవ్వండి’ అనడం ఏమిటి? కొత్త కవుల్ని చైతన్య స్రవంతి etc అని చెబితె ఏం బాగుంటుందొ ఆలొచించమని మనవి….
November 7th, 2007 at 6:30 am
మీ కవిత బాగుంది.ప్రాణహిత కు అభినందనలు.
November 8th, 2007 at 12:06 pm
రచయిత గారికి,
మీ కవిత చాలా అర్తవంతంగా ఉంది.మంచి కవిత రాసి నందుకు మిమ్ము అభినందిస్తున్నాము.
November 17th, 2007 at 6:53 am
`మీ క వి త ఊ చా లా బాగున్నది.
November 22nd, 2007 at 1:33 am
వెంకటెష
నీ కవిత ప్రఫంచికరణను ఎండగడుతుంది.ముందు ముందు మరిన్ని మంచి కవితలు రాస్తావని
ఆషిస్తున్నాను.