నా కొక ఖిబ్లా కావాలి

అలా…
వెతుకుతూ ఎంత దూరమైన వెళ్లూ
నీకంటూ వారసుడొక్కడూ దొరకడు
దువా దోసిట్లోంచి జారిన నమ్మకం
వాడి చేతిలో కొత్తరకం ఆయుధమై
నిగనిగ మెరుస్తుంటుంది

నీ లాగే
ఈ భూమికీ సొంతమైందేదీ లేదు
చెట్లు – మొక్కలు – కొండలు – నీళ్లు – పువ్వులు
ఎవరి పేరు మీద రాయబడ్డాయో
ఎవరి కబ్జాలో కట్టుబడ్డాయో
ముక్కలు ముక్కలుగా పంచుకున్నదెవరో
పొక్కిలైన ఇసక గుండెల మీద
యుద్ధ టాంకరై నడిచి వెళ్లేదెవరో!

అంతరిస్తున్న పంటల మీద
ఆక్రమణకు గురవుతున్న నేల మీద
విస్తరిస్తున్న రోడ్లమీద
మొలుచుకొస్తునన సిమెంటు గుట్టలమీద
రహస్యంగా ఎవడి రాజముద్రలున్నాయో!

అచ్చంగా నీకులాగే
ఈ భూమికీ సొంతమంటూ ఏదీలేదు
పక్షులూ – జంతువులూ – మనుషులూ
నల్లవాళ్లూ – నంగిరివాళ్లూ – నీడలేనివాళ్లూ – నోరులేనివాళ్లూ
పరదేశులుగా ప్రచారమైనవాళ్లూ -

ఎవడి నసీబులోనూ
వెలుతురుకు తావులేదు!

ఎన్ని ఆలోచనలు సంఘర్షించినా
అంతరంగంలో అందరూ బానిసలే
అడ్డా లేబర్‌ లాంటి వీసా అంగడిలో
అమ్మకానికి సిద్ధమైన సరుకులే!

నిజంగా
ఈభూమికీ సొంతంగా మిగలబోయేదేదీ లేదు
పడమటి మేఘాలు
గొడ్జిల్లా నోళ్లతో భూమిని మింగుతుంటే
ఎంత దూరం పరుగెత్తినా
కనిపించని వలల ‘నెట్‌వర్కింగు వేట’
ఫైర్‌వాల్స్‌లేని మూడో ప్రపంచాన్ని
వైట్‌ హౌస్‌ వైరస్‌ సరికొత్త పేర్లతో కాటేస్తూనే వుంది!

స అసం
నాకిప్పుడు కొత్త ఖిబ్లా కావాలి
అందులో
ఏక ధృవ ప్రపంచాన్ని కలగుంటున్నవాడు
ఏకాకిగా మిగలాలి

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. Sk.S Nov 8, 2007 1

    ఖాజా సాబ్ మీ కవిత అద్భుతం.
    నీ లాగే
    ఈ భూమికీ సొంతమైందేదీ లేదు అన్నారు. చాలా నిజమైన వాస్తవాన్ని రాసారు.
    ఎవడి నసీబులోను వెలుతురుకు తావులేదన్నారు. ముస్లింల జీవితం గురించి చాలా చాలా బాగా చెప్పారు. ముస్లింల నించి వచ్చిన ఇంత మంచి గ్లోబలైజేషన్ కవిత నేను ఇంతకుముదు ఎవ్వరిదీ చదవలేదు. మీకవిత ముగింపు కూడా బహుత్ అచ్చాహై…!
    ఖుదా హాఫీజ్

  2. sabera Dec 29, 2007 2

    జనాబ్ ఖాజా గారి కవిత మంచిగాఉంది. చదువుతుంటే కండ్లల్లోనించి నీళ్ళు వచ్చాయి. ముస్లిములకు భూమి హక్కు లేదు. జిందగీ పూరా బర్ బాత్ అయి పోయి బతుకుతున్నరు.
    చాన కశ్టంల బతుకుతున్నరు. భారత్ల, బంగ్లాదేస్ల, పాకిస్తన్ల ఎక్కడైనా ఆడోల్ల బతుకు మరీ హీనం అయిపోయింది.
    ఖాజా సాబ్ షుక్రియా.

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో