మున్సిపాల్టి థెరిస్సా…!

పక్షి ఎగిరిపోయినట్టు
చూస్తుండగానే
బతుకు చేజారిపోయింది.
నీదో,నాదో
లేదా ఇంకొకరిదో.
ఎవరిదైతేనేం….?
ఇప్పుడు జీవితమంటే
జాతర్లో తప్పిపోయిన
చిన్న పిల్లాడు.
అందరి ముఖాల మీద
సాక్ష్యంగా…
సజీవంగా….
ఆరిపోని రెండు కన్నీటి చారికలు
ముఖాలన్ని తెలిసినవే
లోలోపటి దుఃఖమంతా పరిచయమే.
ఓ ఏడుపు పాట
ప్రతీరాత్రి
గుండెల్ని
కెలుకుతుంటుంది.
నగర నాగరిక కన్య
ఒంటి మీద
చిక్కటి రాత్రిలో
జిగేలుమనే లైట్ల
వేడిమి వెలుతురులో
గాయమొకటి సలుపుతుంటుంది.
విశాల
పట్టణాన్ని
గుడిసె ముందటి
వాకిలి చేసి,
దేహంలోనుండి
మొలుచుకొచ్చిన రెక్కల్ని
శుభ్రత పరికరాలుగా
మలుచుకొని,
నీవల్లనో,
నా వల్లనో
పోగైన చెత్త,చెదారాన్ని
మన కన్న తల్లుల్లా
ఊడ్చేస్తుంటారు.
శరీరాల్ని
ప్రశ్నల గుర్తుల్ని చేసి
తెల్లవారే వరకు
భూమిలో పాతేసుకుంటారు.
చలి ఎముకల్ని కొరికినా,
వాన తుఫానై హొరెత్తినా…
సూర్యకిరణాలు
పలకరించేవరకు
వంచిన నడుము విల్లుల్ని
బతుకు యుద్దాన నిలుపుతుంటారు.
లోకం సేవలో
నిండా మునిగిన
మున్సిపాల్టీ థెరిస్సా
రెప్పపాటులో
రుధిరపు మడుగులో
చలనంలేని వస్త్రమై మిగిలిపోతుంటుంది.
ఆ తోలు తిత్తి నిండా
కొనఊపిరి ప్రవహిస్తున్నప్పుడు
కనీస వసతులు కల్పించలేని రాజ్యం
ఎక్స్ గ్రేషియానొకటి ప్రకటించి
దినపత్రిక ముఖాన
కపట సానుభూతుల్ని
నటిస్తుంటుంది.

(రాజధాని రాయదుర్గంలో తెలతెల్లవారుతున్నప్పుడు స్కూలువ్యాను ఢీ కొని నేలరాలిన మున్సిపాల్టీ స్వీపర్ యాదమ్మలాంటి ఎందరో థెరిస్సాలకు)

2 అభిప్రాయాలు »కవితలు

2 అభిప్రాయాలు

  1. krishna chaitanya Nov 4, 2007 1

    “కనీస వసతులు కల్పించలేని రాజ్యం
    ఎక్స్ గ్రేషియానొకటి ప్రకటించి
    దినపత్రిక ముఖాన
    కపట సానుభూతుల్ని
    నటిస్తుంటుంది.”

    కవిత ఆర్ద్రంగా ఉంది. మంచి కవిత. ప్రాణహిత కి ధన్యవాదాలు.

  2. khanna Nov 13, 2007 2

    చాలా బాగుంది

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో