Dec2007
December 2007 సంచిక
Dec2007
డిసెంబర్ 2007 సూచిక
సూచిక:
కవిత: ముసురు – శివారెడ్డి
కవిత: హైకూ – పి. పరమేశ్వరి
కవిత: సముద్రంలా చందమామ – విమల మొత్తం చదవండి »
Dec2007
ముసురు
1
ఎప్పటికయినా
తెరపి ఉంటుందంటావా -
ఉంటుందనుకుంటా,
తెరపివ్వక పోతే
ముసురుతో బతకటమెట్టాగో
తెలుసుకుంటావు మొత్తం చదవండి »
Dec2007
సముద్రంలా చందమామ
ఒకే రాత్రి,
ఆ రాత్రి నునుసిగ్గుల నవవధువు
బుగ్గలపై పూసిన గోరింటలా చందమామ
ఆ రాత్రి పురానాపూల్ కమాను వద్ద
ఆకలితో బిచ్చగత్తె ఆత్రంగా తింటున్న
మాడిన రొట్టెముక్కలా నల్లటి చందమామ మొత్తం చదవండి »
Dec2007
ఇడుపుగాయితం
పుస్తెలతాడు కట్టించి
తన్నుకు చావమని
సాపెన పెట్టిండు సచ్చినోడు.
1
తాటికమ్మల గుడిసన్నా లేదని
రాజప్రసాదంల ఆశ్రయమిచ్చిన. మొత్తం చదవండి »
Dec2007
ఆకాశం
చాచిన అరచేయి ఆకాశం
చీకటి సముద్రం
చీలికలైన వస్త్రం ఆకాశం
ఛిద్రమైన హృదయం ఆకాశం మొత్తం చదవండి »
Dec2007
నగ్నంగా మాట్లాడటం నా హాబి
నగ్నంగా మాట్లాడటం నా హాబి
అగ్నితో ముద్దాడటం నా కిష్టం
ఒంటరి గదిలో చిక్కటి చీకటిలో
కిటికీలకు కిటుకులు
నేర్పడం మరింత ఇష్టం! మొత్తం చదవండి »
Dec2007
గుర్తు తెలియని శవం
లోపల రూమ్‌లో శవాన్ని వదిలేసి, బయటపడ్డాను. నేవొఖ్కణ్నే దాన్ని మొయ్యలేను. పదిమందినీ పోగెయ్యలేను. ”రానూపోనూ ఇంత…” అని బేరాలాడలేను. పోనీ బతిమాల లేను.
ఏం చెయ్యనూ?
మెదడు మెయిన్ స్విచ్…ఆఫ్.
ఉన్నట్టుండి ‘రూమ్‌లాక్ చేసి’ బయలుదేరాను. మొత్తం చదవండి »
Dec2007
జాడ
సావు అయినా, పెండ్లి అయినా, ఇంటికొగరు పోవాలె. పాలోల్ల దాంట్ల ఎవ్వరు సచ్చిన గానీ నాలుగయిదు డప్పులు తీస్కోని పోవుడు గూడ తరీక. ఇంటికొగరు వోయి మన్ను జేసి రావాలె.
పాలోల్ల దాంట్ల నర్సప్పోల్ల ఇంటి ఆడ్విల్ల అందరికి ఆడ్విల్లనే. పాలోల్ల కందరికి సుట్టమే. అంతెందుకు ఊరికే ఆడ్విల్ల అయితది. ఏజ్ బారయి కాలం జేసింది. ఇంతకుముందే సావుసిద్ది ఒచ్చింది. అప్పటివరకు గొంగడి బొంత కప్పుకొని సలిమంట కాపుకుంటున్న నర్సప్ప హుషారైండు. బిగించుకొని కూసున్న గొంగడి బొంతను సర్రున గుంజి బుజం మీదేసుకున్నడు. మెసులుట్ల పక్కల కూసున్న మన్మరాలు సెంద్రమ్మకు తాత మోసేయి తాకి అడ్డం పడిపోయింది. ఎమె ముసలోడా నన్ను మొత్తం చదవండి »
Dec2007
సృష్టి
మూలం: బెర్ట్రండ్ రసెల్
ఒకనాడొక ప్రముఖ వేదాంతి తను మరణానంతరం స్వర్గోన్ముఖుడై ప్రయాణిస్తున్నట్లు కలగన్నాడు. వివిధ ఆధ్యాత్మిక గ్రంథాలతో పరిచయముండటం వల్ల దారి కనుక్కోవటంలో ఇబ్బందేమీ కలగలేదు. స్వర్గ ద్వారాన్ని తట్టగానే తలుపులు తెరుచుకున్నాయి.
ఎదురుగా తనను సూక్ష్మపరిశీలన చేస్తున్న వ్యక్తిని చూసి, “నాకు ప్రవేశం కావాలి… నా పవిత్ర మానవ జీవితమంతా భగవంతుని కీర్తి ప్రతిష్ఠలను ఇనుమడింప చేయడానికే ధారపోశాను” అన్నాడు వేదాంతి. మొత్తం చదవండి »
Dec2007
స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కవయిత్రులు
Dec2007
కథలు రాయటమెలా?
- (ఫ్లానరీ ఒ’ కానర్ వ్యాసానికి స్వేచ్ఛానువాదం)
కథలు రాయటం కష్టమని కొందరెందుకనుకుంటారో అర్థం కాదు. చిన్నప్పుడు మనం అమ్మల దగ్గరా, అమ్మమ్మల దగ్గరా ఎన్ని కథలు వినలేదు! క్లిష్టమైన విషయం వుందని ఎప్పుడైనా అనిపించిందా? బహుశా మనం స్వయంగా ఎన్నోసార్లు ఎంతోమందికి ఎన్నో కథలు చెప్పే వుంటాం. కాని మళ్ళీ రాయటానికి కూర్చుంటే ‘కథలు రాయటమెలా’ అనుకుంటాం.
కాని కొందరు రాసిన కథలు చదివితే వాళ్ళకు రాయటమెలాగో తెలియదని అనిపిస్తూనే వుంటుంది. అంతే కాదు. కొందరు మరికొందరి కన్నా బాగా రాయగలరని కూడా తెలుస్తుంది. మొత్తం చదవండి »
Dec2007
మనసులకు మెరుగుపెట్టే ‘పరుసవేది’
ఏ ఒడిదొడుకులు, వత్తిళ్లు లేకుండా ప్రశాంతంగా సాగిపోవడమే జీవితమని భ్రమపడే మందజీవుల్లో ఒకడు కాదు శాంటియాగో అనే యువకుడు. అతనికి ప్రయాణాలంటే ఇష్టం. గొర్రెల కాపరిగా కొత్త కొత్త ప్రదేశాలు చూడొచ్చని తండ్రి ద్వారా తెలుసుకుని, తండ్రి ఇచ్చిన మూడు బంగారు నాణేలతో గొర్రెలను కొని ప్రయాణాలు సాగిస్తుంటాడు. తన గొర్రెలకు పుస్తకాలు చదివి వినిపిస్తూ, తాను చూసిన వింతలను వాటికి వర్ణించి చెబుతుంటాడు. అలా రెండేళ్లు గడిచిపోతుండగా అతన్ని ఒక కల వెన్నాడుతుంది. స్పెయిన్ లో ఒక పాడుబడిన చర్చిలో గొర్రెలతో పాటు నిద్రించిన ఆ యువకుడికి ఆ రాత్రి రెండోసారి అదే కల వచ్చింది. మొత్తం చదవండి »
Dec2007
అపరాజిత 3: చెర్నాకోలతో సంస్కరణోద్యమం
పాత ఇండియన్ బోర్డింగు స్కూలు ఎంత ఘోరంగా వుంటుందో సానుభూతిపరులైన తెల్లవాళ్లకు కూడా వివరించడం కష్టమే. ఆ వాతావరణంలోకి హఠాత్తుగా నెట్టబడ్డ ఇండియన్ పిల్లలు ఎలాంటి భయాలకు లోనవుతారో, ఎంత నిస్సహాయంగా వుంటారో, అక్కడినుంచి బతికి బయట పడేలోగా ఎన్ని కష్టాలు పడతారో వివరించడం చాలా కష్టం. మధ్యతరగతి అమెరికన్లకు నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో తమ అనుభవాలను చెప్పుకోవడానికి ప్రయత్నించే యూదుల్లా వుంటారు బోర్డింగు స్కూల్ల లోని ఇండియన్ పిల్లలు. ఈ మధ్య ఆ పాఠశాలల్లో చాలా మార్పు వచ్చింది. మొత్తం చదవండి »
Dec2007
బాక్టీరియాతో మన సంబంధాలు
బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ అనేవి అసలు ఉన్నాయని తెలియడానికి భౌతికశాస్త్రంలో కొంత ప్రగతి అవసరమైంది. రకరకాల కటకాలతో మైక్రోస్కోప్‌లు తయారైన తరవాతనే సంగతులన్నీ బైటపడసాగాయి.
ఆధ్యాత్మిక ధోరణి ఉన్నవారు మానవమాత్రులను ఆడించే శక్తిని గురించి తలుచుకుంటూ ఉంటారు. ఎవరి కంటికీ కనబడని ఆ శక్తి ఏమిటో ఎవరికీ అంతుచిక్కదు గాని సైన్సుకు తెలిసినంతవరకూ అటువంటి శక్తేదో బాక్టీరియాకు ఉన్నట్టుగా కనిపిస్తుంది. మొత్తం చదవండి »
సంచికలు
పేజీలు
తాజా అభిప్రాయాలు
- రెండు మనః ప్రపంచాలు : కేతు రెండు నవలలు
హెచ్చార్కె, a - పిండాల బావి
ravikiran, satyadarshana, rutwika, vishvasi [...] - మనం మళ్లీ వెనక్కి వెళ్ళిపోదాం...!
Nutakki raghavendra Rao, K.Rohiniprasad, nutakki raghavendra rao, Raja R Kappera - రాయలసీమ జానపద సాహిత్య సౌరభం
పవనకుమార్, తవ్వా ఓబుల్ రెడ్డి, clnraju - పచ్చ సంచి
manchikanti, Prasad Mandava, Vishnu Veerapaneni - నల్ల నినాదం అతని కవిత్వం!
manchikanti, ramnarsimha, msnaidu, satyadarshana
- రెండు మనః ప్రపంచాలు : కేతు రెండు నవలలు
ప్రాణహిత సందర్శకులు


