Dec2007
ఆకాశం
చాచిన అరచేయి ఆకాశం
చీకటి సముద్రం
చీలికలైన వస్త్రం ఆకాశం
ఛిద్రమైన హృదయం ఆకాశం
అవధులులేని శూన్యం
ఆవహించిన దైన్యం
తరతరాల దారిద్య్రం ఆకాశం
పొగచూరిన చరిత్ర
పేలికలైన జీవనం
సరిహద్దులు లేని స్మశానం ఆకాశం
యుద్ధోన్మాదం
దద్దరిల్లిన నేల
పాలిపోయిన కళేబరం ఆకాశం
పగిలిపోయిన నిలువుటద్దం
పలుకలేని నిజం
కనిపించే అబద్దం ఆకాశం
ప్రతి ధ్వనించే నిశ్శబ్దం ఆకాశం