డిసెంబర్ 2007 : సంపాదకీయం

చిత్రం: ఏలే లక్ష్మణ్
చిత్రం: ఏలే లక్ష్మణ్
ప్రాణహిత డిసెంబర్ సంచికకు స్వాగతం. ఈ సంచిక తీసుకు రావడంలో అనూహ్యంగా ఆలస్యమైనందుకు క్షంతవ్యులం. కొన్ని అనివార్య కారణాలు ఈ ఆలస్యానికి కారణం. ఐతే ఆలస్యమైనా ప్రాణహిత ఈ సారి అద్భుతమైన రచనలతో మీ ముందుకొస్తున్నది. తెలుగు నేల మీద జరుగుతున్న అపారమైన సాహిత్య కృషిని కొంతనైనా మీ ముందుకు తీసుకు రాగలుగుతున్నందుకు మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఈనాడు తెలుగులో వస్తున్న సాహిత్యం మీద మనం తరచూ కొన్ని అపవాదులు వింటూ ఉంటాం. సాధారణంగా ఈ అపవాదుల వెనుక ముఖ్య కారణం, ఈ నాడు వెలువడుతున్న సమకాలీన తెలుగు సాహిత్యం పూర్తిగా అందుబాటులో లేక పోవడమే. తెలుగులో వస్తున్న సాహిత్యాన్నంతా ప్రజా బాహుళ్యానికి, దేశదేశాల్లో ఉన్న సాహితీ ప్రియులకు అందడంలేదు. ఎక్కువగా తెలుగునేల మీదే ప్రచురింపబడుతున్న చిన్న చిన్న సాహితీ పత్రికల్లోనో, ఇంకా ఇంటర్నెట్ వెలుగు చూడని అనేకానేక పత్రికల పేజీల్లోనో, లేక పుస్తక రూపంలో వెలువడి ఏదో కొంత మంది మాత్రమే ఒక చోట చేరే ఆవిష్కరణ సభల్లోనో, సాహితీ సభల్లోనో సమకాలీన తెలుగు సాహిత్యం మరుగున పడిపోతున్నది. కవిత్వం, కథ, నవల, సాహితీ విమర్శా వ్యాసాలు, తదితర ప్రక్రియల్లో జరుగుతున్న కృషి ఖండాంతరాల్లో ఉన్న తెలుగు సాహితీ ప్రియులందరికీ అందుబాటులో లేదనే చెప్పాలి. అంత మాత్రాన అక్కడ జరుగుతున్న కృషిని, వెలువడుతున్న సాహిత్యాన్ని తక్కువ చేసి చూడడం సరైంది కాదు. అక్కడ అసలు సాహిత్యమే రావడం లేదనడం, వచ్చినా మంచి సాహిత్యం రావడం లేదనడం, తెలుగు సాహిత్యమంతా అనేక వాదాల సుడిగుండాల్లో చిక్కుకు పోయిందనడం సమంజసమైన వ్యాఖ్యలేవీ కావు. అవి అపవాదులే! ఎందుకంటే తెలుగు సాహిత్యం ఇవాళ్ళ ఒక గుణాత్మకమైన మార్పుని సాధించింది. తెలుగు సాహిత్యంలో అనేక అభిప్రాయాలు వెల్లివిరుస్తూ చాలా ఉన్నత స్థాయిలో ప్రజాస్వామికీకరణ చెందుతున్నది. అనేక భిన్న భావజాలాలు, భిన్న అభిప్రాయాలు, భిన్న స్వరాలు, గొప్ప వైవిధ్యం తెలుగు సాహిత్యంలో విరాజిల్లుతున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే తెలుగు సాహిత్యంలో వేయి పూలు వికసిస్తున్నాయి. అయితే ఈ పూల పరిమళాలను ఆస్వాదించాలంటే తప్పని సరిగా మనం మన స్థిరాభిప్రాయలను, జడాభిప్రాయలను మార్చుకోవడానికి సిద్ధపడాలి. మనం ముందే ఏర్పర్చుకున్న విలువల చట్రాలకు ఆవల ఆలోచించగలగాలి. మనం ఎంత విభేదించినా సరే, ఇతర అభిప్రాయాలను గౌరవించడం, వారికి అవి వెలిబుచ్చే హక్కుని గుర్తించడం, చర్చించడం ప్రారంభించాలి. ఇప్పటిదాకా ‘ఇది సాహిత్యమే కాదు’ అని ఏర్పర్చుకున్న దురభిప్రాయాలను వదిలిపెట్టి విభిన్న ప్రజా సమూహాలనుండి, వివిధ కోణాలనుండి, తెలుగు సమాజం నలుమూలలనుండీ వస్తున్న సాహిత్యాన్ని గుర్తించి, అందులోని మంచి చెడులని చర్చించాలి. అప్పుడే ప్రజాస్వామిక వాతావరణం సాహిత్యంలో మనగలుగుతుంది. తద్వారా సాహిత్యంలో ఉన్నత విలువలు, వస్తువు రీత్యానే కాక రూపం రీత్యా కూడా అభివృద్ధి చెందుతాయి. తెలుగు సాహిత్య విమర్శ సర్వతోముఖాభివృద్ధి చెందుతుంది.

ఈ డిసెంబర్ సంచికలో ప్రాణహిత మీకు సమకాలీన తెలుగు సాహిత్యంలోని వైవిధ్యాన్ని కొంతయినా అందించే ప్రయత్నం చేస్తున్నది. తెలుగు సమాజంలో ఇప్పటిదాకా అణచివేతకు గురయిన కులాలు వాటి స్థితిగతులనూ, సాంస్కృతిక ప్రత్యేకతలనూ సాహిత్యీకరిస్తున్నాయి. అట్లా ఒక అణచివేయబడిన కులానికి చెందిన గోగు శ్యామల ఆ కులంలోని డప్పు కొట్టటమనే ఒక ప్రత్యేక సాంస్కృతిక అంశాన్ని కథగా మల్చిన ‘జాడ’ ను మీకందిస్తున్నాం. మృత్యువూ, అస్తిత్వమూ, ఎల్లప్పుడూ వెంటాడే శవమూ – దైనందిన జీవన అస్తిత్వ వ్యథను కవితాత్మకంగా చెప్పిన ఎం. ఎస్. సూర్యనారాయణ కథ ‘గుర్తు తెలియని శవం’ చదవండి. ప్రముఖ తత్వవేత్త బెర్ట్రండ్ రసెల్ రాసిన కథకు ముక్తవరం ప్రార్థసారథి తెలుగు రూపం ‘సృష్టి’. అట్లే ఫ్లానరీ ఓ కానర్ రాసిన వ్యాసానికి పార్థ సారథి అనువాదం ‘కథలు రాయడం ఎలా’ చదవండి.

తెలుగులో స్వాతంత్ర్యానికి ముందు కవయిత్రులెవరు, వాళ్ళేమి రాసారు, వాళ్ళ సామాజిక స్థితిగతులేమిటి, వాళ్ళెంచుకున్న వస్తువులేమిటి, రూపమేమిటి, వాళ్ళెంచుకున్న వస్తువులను వారి సామాజిక స్థితిగతులెట్లా ప్రభావితం చేసాయి తదితర అనేక ప్రశ్నలను శోధించి కాత్యాయనీ విద్మహే, కందాల శోభారాణి రాసిన అరుదైన పరిశోధనా వ్యాసం ‘స్వాతంత్ర్యానికి పూర్వం తెలుగు కవయిత్రులు’ ఈ సంచికలో మీకందిస్తున్నాము. తెలుగులో సాహిత్య పరిశోధన ఉన్నత స్థాయిలో జరుగుతుందనడానికి ఈ వ్యాసం ఒక మచ్చుతునక. పాలో కోయిలో రాసిన ‘The Alchemist’ నవలను ‘పరుసవేది’గా తెలుగులో అనువదించారు. ప్రపంచ ప్రఖ్యాతి పొందిన ఈ నవలను ఎస్. జయ పరిచయం చేస్తూ రాసిన వ్యాసం ‘మనసులకు మెరుగుపెట్టే ‘పరుసవేది’‘చదవండి.

కవిత్వంలో శివారెడ్డి రాసిన దీర్ఘ కవిత ‘ముసురు’, పరమేశ్వరి రాసిన హైకూలు, విమల రాసిన ‘సముద్రంలా చందమామ’, డా|| కాసుల లింగారెడ్డి రాసిన ‘ఇడుపుగాయితం’, పి. లక్ష్మినారాయణ రాసిన ‘ఆకాశం’, వెంకటేష్ రాసిన ‘నగ్నంగా మాట్లాడ్డం నా హాబీ’ చదవండి.

ధారావాహికంగా సాగుతూ హృదయాలను కదిలించివేస్తున్న నేటివ్ అమెరికన్ జీవితాల గురించిన అద్భుత నవల ‘లకోట వుమెన్’ కి మమత అనువాదం మరుసటి అధ్యాయం ‘చెర్నాకోలతో సంస్కరణోద్యమం’ మీ కందిస్తున్నాం. అట్లే విజ్ఞాన శాస్త్రాన్ని నలుగురు చదివే రీతిగా ఆసక్తికరంగా అందిస్తున్న రోహిణీ ప్రసాదు గారి శాస్త్రీయ వ్యాసపరంపర లో తదుపరి వ్యాసం ‘బాక్టీరియాతో మన సంబంధాలు’ కూడా చదవండి.
ఎప్పటిలాగే ప్రాణహిత నాదరిస్తారని, ఆలస్యమయినందుకు మనస్ఫూర్తిగా క్షమిస్తారని మా విజ్ఞప్తి.


సంపాదకీయం

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో