గుర్తు తెలియని శవం

లోపల రూమ్‌లో శవాన్ని వదిలేసి, బయటపడ్డాను. నేవొఖ్కణ్నే దాన్ని మొయ్యలేను. పదిమందినీ పోగెయ్యలేను. ”రానూపోనూ ఇంత…” అని బేరాలాడలేను. పోనీ బతిమాల లేను.

ఏం చెయ్యనూ?

మెదడు మెయిన్‌ స్విచ్‌…ఆఫ్‌.

ఉన్నట్టుండి ‘రూమ్‌లాక్‌ చేసి’ బయలుదేరాను.

బిజీ రోడ్‌లో నడుస్తున్నానన్నమాటే గానీ…

‘ఎవరో’ వెంటాడుతున్నట్టు కంగారు.

ఎవరదీ? అడుగడుక్కీ వెంటాడేదెవరు?

రద్దీలో కలిసిపోతూ, చకచకా నడవడం మొదలెట్టాను. ఎవరో తరుముతున్న ఎఫెక్టు నా కళ్లలోంచి దూకుతోంది. దొరక్కూడదన్నట్టు… దడదడలాడుతున్న గుండెని చేత్తో పట్టుకుని… గబగబా నడుస్తున్నాను.

లోపలి’రూమ్‌’లో శవం.

దాని ముఖం గుర్తుకురావడంలేదు.

అస్పష్టంగా, అనివార్యంగా నా ‘గది’లో పడిఉందది… గుర్తు తెలియని శవం… అది.

కానీ… దాని ముఖం… స్పష్టాస్పష్టంగా వెంటపడుతోంది.

తెల్లటి దుప్పటీలోంచి – శవం ముఖం స్కెచ్‌లా ఉంది. రూమ్‌ లాక్‌ చేసి వచ్చాను.

కానీ – అది నన్ను ఫాలో అవుతోంది.

”అన్ని సంస్కారాలకన్నా
దహన సంస్కారం మిన్న”
ఎవరో కవిరాసిన లైన్లు గుర్తుకొచ్చాయి.

కపాలమోక్షం కోసమే కాబోలు శవం తాపత్రయం అంతా.

సరే…. ఈ శవానికి అంతిమ సంస్కారం చేసి, ఒక నమస్కారం పెడితే – బాగానే ఉంటుంది. కానీ – ఈ శవంతో నాకేమిటి సంబంధం? అనవసరంగా నా రూమ్‌లో ఎందుకుందిదీ?

”లోపల శవం నిద్రపోతోందని మర్చిపోకు” ఎవరో హెచ్చరిస్తున్నారు.

నిజానికి – రూమ్‌లో శవాన్ని లాకే చేశానని భ్రమపడుతున్నాను…

శవం దర్జాగా నా వెనకే వస్తోంది.

‘నా సంగతేవిటీ?’ అనడుగుతోంది.

భయంకరమైన ట్రాఫిక్‌లో…. రూల్స్‌కి వ్యతిరేకంగా… అన్నిటికీ అడ్డుపడిపోతూ… కంగారుగా నడుస్తున్నాను. నడుస్తూ ఆలోచిస్తున్నాను.

శవం కాదు, శవం ముఖమే అస్పష్టంగా వెంబడిస్తోంది.

తాళం పెట్టిన నా గదిలో ఇప్పుడు శవం కచ్చితంగా లేదు.

నన్ను వేటాడ్డమే తన ధ్యేయంగా పెట్టుకుందది.

గదిలో శవాన్ని బంధించి నేను సాధించిందేమిటి?

సరే…. ‘దానికో దారి’ చూపించాలి.

అయితే – దాని ముఖం కూడా ఎరగనే.

ముక్కూ, మొహమూ తెలీని…. గుర్తు తెలియని శవం….

నన్ను పీడించడం ఏమి న్యాయం?

అయినా – ఈ శవం పని మీదే కదా బయలుదేరానూ?

కాస్తయినా కనికరంలేకుండా ఇలా నన్ను వేధించడం…. ఇలా కుండల్లో గుర్రాలు తోలడం… ఏమైనా బాగుందా?

భారీ వాహనాలని తప్పించుకుంటూ, హడావుడిగా నడుస్తున్నాను.

ఎక్కడికో స్పష్టంగా తెలీదు.

ఒక అస్పష్ట, అపరిచిత మృత్యుముఖానికి అభిముఖంగా…. ఒకానొక సంస్కారంకేసి నడుస్తున్నానని మాత్రం తెలుసు.

నడుస్తున్నాను.

నడుస్తూ నడుస్తూండగా…

సడన్‌గా ఆగాలనిపించింది.

ఆగి, వెనక్కి తిరిగి చూశాను.

అంతవరకూ నన్ను వెంబడించిన మృత్యుముఖం మాయమైపోయింది.

ఎంత గుర్తుచేసుకున్నా, గుర్తురావడంలేదు.

కళ్లు మూసుకున్నాను.

కళ్లముందు ‘రూమ్‌’ కనిపించింది…

నా రూమ్‌… యథాతథంగానే ఉంది.

నీట్‌గా రేక్స్‌లో సర్దిన పుస్తకాలూ… నా జ్ఞాపికలూ… గోడలకి వేళ్లాడే తైల చిత్రాలూ… నా ఫైవ్‌ ఇన్‌వన్‌… నా ఫ్లేంక్‌… నా మైక్రోటిప్డ్‌ పెన్‌…. ఏ ఫోర్‌ వైట్‌ బాండ్‌ షీట్లూ…

అన్నీ అలాగే ఉన్నాయి.

గదిలో… మధ్యగా… శవం ఉంది.

తెల్లటి దుప్పటిలో కప్పి ఉంది…

దుప్పటీ తప్పించాను -

శవం ముఖం రహస్యంలా ఉంది.

శవం…. నవ్వుతున్నట్టు అనిపించిది కానీ…

ఏడుస్తున్నట్టు కూడా లేదు.

కళ్లు తెరిచాను.

ఎదురుగా… ఒక పెద్ద ఆర్చ్‌. పెద్ద స్వాగతద్వారంగా ఉంది. దాని గుండా లోపలికి నడిచాను.
ఇంకొంచెం నడిచాను… ఇంకాస్త ముందుకెళ్లాను…

హఠాత్తుగా… ఎదురుగా…

పూల సముద్రం కనిపించింది.

ఒక మహాద్భుత… అనంత… పూల సముద్రం.

నా ముందు -

పూల మహాసముద్ర పరిమళఘోషయాత్ర.

ఉవ్వెత్తున పడి లేస్తున్న పూలకెరటాలు.

మహోత్తుంగ పుష్పతరంగాలు…

లుంగలు చుట్టుకుంటూ తీరాన్ని తాకుతున్నాయి.

ఒడ్డున…

నేను.

ఆనందాశ్చర్యాలతో రెండు చేతులూ పైకెత్తి

అరిచాను… ‘పూల మహాసముద్రం’

హోరుమంటూ పడగ లెత్తిన మహాపూల కల్లోల కెరటం… నన్ను గుత్తులు గుత్తులుగా ముంచెత్తింది.

‘హో’ అని అరిచాను.

‘అహో’ అంటూ బదులిచ్చింది పూల మహాసముద్రం.

మల్లె… జాజి… గులాబీ… పారిజాతం… లిల్లీ…

కనకాంబరం… ఓహ్‌! ఎన్ని పరిమళాలు.

అన్నీ కలగలిసిన మహాసముద్ర పూల ఘోష.

స్పృహ తప్పి పడ్డాను.

ఒక పెద్ద పూల కెరటం నా ముఖాన్ని ముద్దిడింది…

మెలకువలోకొచ్చాను.

నన్ను చూసి – పూల అలలతో పుష్ప సముద్రం నవ్వింది.

సంభ్రమంతోలేచి నిలబ్డాను.

నా ముక్కు పుటాలకి శవం కాల్తోన్న వాసన వేసింది.

చూద్దును కదా… ఒక్క పక్క ఆ పూల సముద్రం పక్కనే -

శవాల్ని తగలేస్తున్నారు.

ఒక మహా పరిమళ సప్న సముద్రస్నానం.

అకారణంగా ముగిసినట్టు అనిపించింది నాకు.

పూల సముద్రపుటొడ్డున…

ఒక చెక్కబల్ల వేసుకుని…

దాని ముందు ఒక స్టూలుపైన కూర్చుని…

తలవొంచుకుని… ఏవో రాస్తున్నాడు ‘అతను’

‘ఎవరితనూ?’

ఎంత ఆలోచించినా అర్థం కాలేదు.

”ఇంతటి అద్భుతం ముందు దిష్టిబొమ్మలా ఏం చేస్తున్నాడు?” అనుకుంటూ అతని దగ్గరికి నడిచాను. అతని రాత బల్లపైకి దృష్టి సారించాను.

ఏవో లెక్కలవి.

సుదీర్ఘంగా వేటినో నమోదు చేస్తూ, తలొంచుకుని పనిలో ఉన్నాడు అనంతంగా.

‘హలో’ అన్నాను పలకరింపుగా.

చాలా వొత్తిడిగా తలపైకెత్తి -

‘ఏంటి?’ అన్నట్టు చూశాడు నాకేసి.

”ఏం లేదు… రూమ్‌లో శవం ఉంది…” అన్నాను ముక్తసరిగా.

నా చేతిలో ఒక అప్లికేషన్‌ ఉంటి, కొంచెం దూరంగా ఉన్న ఒక కౌంటర్‌ చూపించాడు.

అటు వెళ్లమన్నట్టు సంజ్ఞచేసి, మళ్లీ తన పనిలో పడిపోయాడు.

కౌంటర్‌ మహా రద్దీగా ఉంది.

అందరూ తమ తమ చేతుల్లో ఏవేవో రకరకాల ఫామ్స్‌ పట్టుకుని ఉన్నారు.

నా రూమ్‌లోపలి శవం క్లియరెన్స్‌ కోసం దరఖాస్తు రాసి, లైన్లో నుంచున్నాను. అప్పుడు నాకో విషయం బోధపడింది. అక్కడ క్యూలో ఉన్న వాళ్లందరి సమస్యలూ ఒకటి కాదని.

కౌంటర్‌కి దూరంగా – ఒక యాంబులెన్స్‌ లాంటి వాహనం ఆగి ఉంది…

”బహుశా, నా రూమ్‌లోంచి శవాన్ని ఈ వేన్‌లోనే తీసుకొస్తారేమో?”

అనుకుంటూ… అసహనంగా… లైన్లోనుంచున్నాను.

ఒక అభిప్రాయం »కథలు

ఒక అభిప్రాయం

  1. kranthi Dec 6, 2008 1

    beautiful story, chala manchi story rasina m suryanarayana gari ki thanks, mee poems lagane story new ga unnadi

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో