హైకూ

1.

ఒకే దృశ్యం

కళ్లు మూసినా తెరచినా

దట్టమైన చీకటి

2.

సంభాషణ

ఎవ్వరూ లేరు

నాలో నేనే

3.

బజారునుండి వస్తూ

వెంట తెచ్చుకొన్న చంద్రుడిని

మా ఇంటిపైన వదిలాను

4.

తనని తాను

చూసుకొంది చెట్టు

వర్షం నీటిలో

5.

గలగల ఆకులతో

కలకల లాడిన చెట్టే

శిశిరం కదా

6.

అదే వాగు

నీళ్లు లేకున్నా

ప్రవహించే జ్ఞాపకాలతో

7.

తమ రోదనంతా

చీకటికి ఆపాదిస్తూ

కీచురాళ్లు

8.

అవని ఆకాశాలనే గాని

నక్షత్రాలను మూయలేని

చీకటి

9.

ఏది దేన్ని

మెరిపిస్తుందో

చీకటి , వెన్నెల

10.

పెంచుకొంటున్నాను

చేపలాంటి పాపను

నది నేనై నాలో

11.

మనసు కోయిల

కావేరి

మౌనరాగంలో

12.

కనుచూపు మేరంతా

కరిగిపోయింది

కన్నీటి తెరతో

13.

ప్రపంచం

ఎంత విశాలంగా ఉంది

చిరిగిన చీరలోంచి

14.

ఇంద్రధనుసు

ఆ వైపునా

అన్నీ రంగులేనా ?

15.

నడుస్తున్నాయి

బజారుల వెంబడి

సిగలో పూలు

16.

గుచ్చుకున్నాయి

మనసు శకలాలు

దుఃఖ సమయం

9 అభిప్రాయాలు »కవితలు

9 Responses to “హైకూ”

  1. 1
    Hanumantha Reddy K (Hrk) Says:

    చాల బాగున్నయ్ హైకూలు. చిన్న చిన మాటలతో మనసు తలుపులు తట్టగలిగాయి మాటల బొమ్మలు. పరమేస్వరి గారికి అభినందనలు….హెచ్చార్కె.

  2. 2
    Rakesh Says:

    చాన మంచిగున్నయి.

  3. 3
    vinayakam Says:

    చాల బాగున్నాయండి.
    నే నిప్పుడిప్పుడె మొదలెట్టాను నా బ్లాగు..

  4. 4
    ఆరి సీతారామయ్య Says:

    హైకులు చాలా బాగున్నాయి. పరమేశ్వరి గారి గురించీ, వారి ఇతర రచనల గురించీ నాలుగు పరిచయ వాక్యాలు రాసుంటే బాగుండేది.

  5. 5
    Viswa K Says:

    6,7,14 బాగున్నాయండి.

  6. 6
    chandrashekar Says:

    chaana bagunnavi mee hikulu, elane meeru continue chesthundandi
    enka manchi manchi hikulu rasthu undali

  7. 7
    chandrashekar Says:

    chana bagunnavi mee hikulu elage rasthundandi

  8. 8
    chandrashekar Says:

    అన్నిమంచిగా ఉన్న్వి

  9. 9
    p.srinivas goud Says:

    hello parameswari garu,
    your haiku are good. you know, i too haiku poet.i want your address.if you read this,
    plz cont.9949429449.

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో