Dec2007
నగ్నంగా మాట్లాడటం నా హాబి
నగ్నంగా మాట్లాడటం నా హాబి
అగ్నితో ముద్దాడటం నా కిష్టం
ఒంటరి గదిలో చిక్కటి చీకటిలో
కిటికీలకు కిటుకులు
నేర్పడం మరింత ఇష్టం!
పుస్తకాలలో వాటిలోని అక్షరాలలో
అణువణువులో ఆనందం వెతుక్కుంటూ
వెర్రిగా కేరింతలు వేయడం
నా కిష్టం!
ఎవరూ లేని రహదారిపై
అడుగులో అడుగువేస్తూ
మైలురాళ్ళను లెక్కపెట్టడం
నా కిష్టం!
కఠిన శిలలలో కారుణ్యపు
కాంతిరేఖలు చూడడం
మనిషిలో మానవత్వాన్ని
ప్రేమను, ప్రేమించే తత్వాన్ని
మానవులలో, మట్టిలో
నాటటం నా కిష్టం!
ఆకాశానికి భూమికి నిచ్చెన వేసి
వాటికి మూడు ముళ్ళు వేయించడం
మేఘాల మెడలు వంచి
వాటి గర్వాన్ని తగ్గించడం
రైతుల ఆత్మహత్యలు లేని పేపరు
చదవడం నా కిష్టం
కాలుష్యపు సాహిత్యంలో
మలయమారుతపు కవిత్వాన్ని
ఊదటం నా కిష్టం కాదు
నా ప్రాణం!
December 12th, 2007 at 3:02 am
అయ్యా
నగ్నంగా మాట్లాడుతూ ఉందడండి.
అభినందనలు
December 12th, 2007 at 5:09 am
చాలా బాగుంది మీ కవిత.ఇలాంటి మంచి కవితలు మీ కలం నుండి ఇంకా ఎన్నొ జారువాలలని కొరుకుంటూ….
December 12th, 2007 at 5:51 am
మీరిలా కవిత్వం రాయడం మాకిష్టం.
December 18th, 2007 at 2:49 am
కవిత చాలా బాగుంది.ప్రాణహిత కు అభినందనలు.
December 26th, 2007 at 6:31 am
“అద్భుతమయిన వ్యక్తీకరణ ” వెంకటేష్ గారికి అభినందనలు.
January 13th, 2008 at 7:15 am
ఇందులో కవిత్వం తప్ప, మీకిష్టమైనవన్నీ ఉన్నట్లున్నాయి.
February 28th, 2008 at 9:22 pm
కవిత చాలా బగుంది . కాని ఆకాశానికి భూమికి పెళ్ళీ వద్దు ఎందుకు అంతె రెండూ కలవవు కదా……..
at last your poem wil and good and we get a lot of informaion .. and we know about ur desires..
keep going like this poems
special thanks for pranahta…
.