జనవరి2008
ప్రాణహిత
జనవరి ప్రాణహిత కు స్వాగతం. ప్రాణహిత పాఠకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.
21 వ శతాబ్దిలో మరో సంవత్సర కెరటం కాలసముద్రంలో కలిసిపోయింది. 2007 సంవత్సరం వెళ్తూ వెళ్తూ కొన్ని విషాదాలను మిగిల్చి పోయింది. మరీ ముఖ్యంగా సంవత్సరాంతంలో, మనందరికీ సుపరిచితుడు, ఆత్మీయుడూ అయిన ప్రముఖ నవలా రచయిత అల్లం రాజయ్య ఏకైక కుమారుడు అల్లం కిరణ్ కుమార్ అమెరికా లో లూసియానా స్టేట్ యూనివర్సిటీ కాంపస్ లో దొంగతనానికి వచ్చిన కొందరు దుండగులచే అతి దారుణంగా కాల్చి చంపబడ్డాడు. అతనితో పాటు సహ విద్యార్థి కొమ్మా చంద్రశేఖర్ రెడ్డి కూడా దారుణంగా హత్యకు గురయ్యాడు. మొత్తం చదవండి »
సంపాదకీయం
జనవరి2008
ప్రాణహిత
కవిత: సంచయనం - కల్పనా రెంటాల
కవిత: వైద్యో! రోగులు బలి! - కృపాకర్ మాదిగ
కవిత: జలియన్ వాలాబాగ్ - బెల్లంకొండ సంపత్ కుమార్
కవిత: రెక్కలక్కర లేదు - శివారెడ్డి
మొత్తం చదవండి »
సూచిక
జనవరి2008
కల్పన రెంటాల
గాయాలు కనిపించవు
గాయాలు మాట్లాడవు
గాయాలు సాక్ష్యమివ్వవు
ఈ చరిత్రకు దేహమే మొదలూ దేహమే చివరా!! మొత్తం చదవండి »
కవితలు
జనవరి2008
కృపాకర్ మాదిగ
ఇదేం అన్నాయం జూడా సాములూ
ఎవురి మీరో మీరు సమ్మెజేత్తే
అస్పటల్ల మా వూపిర్లు గల్లో కలిసినయ్!
పోత్తిళ్ళ నుంచి పరలోకానికి నేరుగా పంపినరే!
మీ పంతాలకు మా పేణాలు అంతం కావాలా సాములూ? మొత్తం చదవండి »
కవితలు
జనవరి2008
బెల్లంకొండ సంపత్ కుమార్
ఎండ నీడను
ఆకలిని తూటా
గుడ్డను రక్తం
నడిరోడ్డు కడిగేస్తది మొత్తం చదవండి »
కవితలు
జనవరి2008
కె.శివారెడ్డి
అన్నింటికి రెక్కల్లేవు
రెక్కలున్నవి గూడా ఇప్పుడు ఎగరలేవు
మెడలో రాయిగట్టినట్టు, దబ్బున పడిపోతున్నాయి.
ఒక స్వరమేదో
విషపుజ్వరంలా అల్లుకుంటోంది మొత్తం చదవండి »
కవితలు
జనవరి2008
పి. పరమేశ్వరి
1
చెరువునంతా
గుప్పిట్లో ఉంచుకొంది
తీరపు రేఖ మొత్తం చదవండి »
కవితలు
జనవరి2008
జూపాక సుభద్ర
అడివిల ఆకసోంటోల్లం. మేము వాల్ల జోలికిబోలే, వాల్ల వార్తకు బోలే, వాల్లను వాల్లను నల్లనండ్లే, తల్లనండ్లే, ఎత్తులు జిత్తులు ఎర్కలేనోల్లం. మా సందాల మేము మా అడివిల సెట్లోంగ సెలిమలోలిగ, పిట్టలోలిగ, తేనెతుట్టెలోలిగ బతుకుతున్నోల్లం. మీ బాస, మీవేషాలు తల్వనోల్లం. మాకంకెర వీనాలకు మేమొచ్చినమా, ఉత్తరిచ్చినమా, మీరి మీరెందుకు మా బతుకు సెరువుల బండలెత్తేస్తుండ్రు. మొత్తం చదవండి »
కథలు, గల్పికలు
జనవరి2008
పలమనేరు బాలాజి
”ఇదంతా అయ్యేపని కాదులేన్నా” నిష్ఠూరంగా అన్నాడు గోపాల్. ఎం.ఆర్.ఒ. ఆఫీసు ముందు జనం గుంపు చేరిపోయింది.
ఎండ చుర్రుమంటోంది. ఉదయం పదకొండు గంటలవుతున్నా ఎం.ఆర్.ఒ. జాడలేదు. ఆఫీసులో సిబ్బంది కూడా పలుచగా వున్నారు.
గోపాల్ మాటలకు బదులు చెప్పే ప్రయత్నం చెయ్యలేదు రమణ. అతడికి ముప్ఫై ఐదేళ్లుంటాయి. సన్నగా పొడవుగా వుంటాడు. అతడి తల్లోంచి చెమట కారిపోతోంది. మొత్తం చదవండి »
కథలు
జనవరి2008
చలం
చలికాలం. ఈ వూళ్ళో అదేమోకాని చలి ఎక్కువ. మంగమ్మ నా శాలువా కప్పుకొని నిద్రపోతోందనుకుంటా, మొగిణ్ని వెచ్చగా కావలించుకొని. నాకు ఇక్కడ చలి. నిద్రరాదు. కప్పుకోడానికా యేమీ లేదు. ఈ వెచ్చని పొయ్యి దగ్గర కూచుంటే కొంచం వణుకు నయం. కాని నేల ఇంకా ఆరలేదు- యెక్కడో ఇంకా చలిదేశాలు వుంటాయట. అక్కడెట్లా వుంటుందో?- చిన్నప్పుడు నాన్న ‘సిండరిల్లా’ కథ చెప్పేవాడు. అట్లా వుంది నా స్థితి యిప్పుడు. మొత్తం చదవండి »
కథలు, క్లాసిక్స్
జనవరి2008
కాత్యాయని
ముస్లిం సమాజాన్ని నిర్వచించటానికి ముస్లిమేతరులైన రచయితలూ, మేధావులూ సాధారణంగా రెండురకాల నమూనాలను అనుసరిస్తూ వుంటారు. ఒకటి - ముస్లింలందరూ అనాగరికులూ, మతోన్మాదులూ, దేశద్రోహులూ అనే అభిప్రాయం. ఇది హిందూమతోన్మాద భావజాలానికి చెందినదని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రెండవది - ముస్లింలు బాధితులూ, పీడితులూ, నిస్సహాయులూ కాబట్టి వాళ్లను ఆదుకుని, రక్షించే బాధ్యతను స్వీకరించాలని భావించే ధోరణి. ప్రజాస్వామిక ప్రగతిశీల దృక్పథం కలవారనుకునే చాలామంది రచయితల్లో ఈ దృక్పథం కనబడుతుంది. మొత్తం చదవండి »
పుస్తక సమీక్షలు
జనవరి2008
ఆడెపు లక్ష్మీపతి
తెలుగు సాహిత్యంలో చిరస్థాయిగా నిలిచిపోయే నవలలు, కథలు, నాటికలు అందించి వెళ్లిపోయారు రాచకొండ విశ్వనాథశాస్త్రి. ఆ గొప్ప రచయిత పేరు మీద నెలకొల్పిన ప్రతిష్టాకరమైన ‘రావిశాస్త్రి స్మారక సాహిత్య అవార్డు’ ను స్వీకరిస్తున్న సందర్భంగా నాకు చాలా ఆనందంగా వుంది. ఒక ఉన్నత పురస్కారం లభించినప్పుడు ఏ రచయిత ఐనా ఏ కళాకారుడైనా ఎలా స్పందిస్తాడో, ఎలా అనుభూతిస్తాడో నేనూ అలాగే స్పందిస్తున్నాను, అలాగే అనుభూతిస్తున్నాను. మొత్తం చదవండి »
ఉపన్యాసాలు
జనవరి2008
మేరీ బ్రేవ్ బర్డ్; అనువాదం: మమత
పాఠశాల వదిలేసిన తరువాత సెయింట్ ఫ్రాన్సిస్, పార్మలీ, మిషన్ లాంటి రిజర్వేషన్లలో ఎక్కువగా తిరిగేదాన్ని. జనాలు దౌర్జన్యం కింద ఎలా నలిగిపోతారో, నాశనమవుతారో ఈ ఊర్లు చక్కని ఉదాహరణ. ఇళ్లన్నీ తారు పేపరుతో, ఏది దొరికితే దానితో కట్టుకుంటారు. తుప్పుపట్టి, ఎక్కడికక్కడ పడిపోతున్న ఒక చిన్న హౌస్ ట్రెయిలర్ను తీసుకో. నారింజ పళ్ల క్రేట్లతో ఒక ఆవరణం తయారు చేసి, ఆ ట్రెయిలరుకు తగిలించు. అది మీ వంటగది అవుతుంది. మొత్తం చదవండి »
అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం
జనవరి2008
శిఖామణి
సుప్రసిద్ధ అనువాదకుడు, ఆధునిక వచన కవిత్వం మీద బలమైన ముద్ర వేసిన ‘చెట్టుకవి’ ఇస్మాయిల్ గారి నిర్యాణాంతరం ఆయన అభిమానులు ‘ఇస్మాయిల్ కవితా పురస్కారం’ పేరిట అవార్డును స్థాపించి గత రెండు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడిపుడే కొత్తగా రాస్తూ సాహిత్యలోకానికి పెద్దగా తెలియక, అనుభూతి సాంద్రతతోనూ, తాత్విక గాఢతతోనూ కవిత్వం రాసే కవుల మొదటి సంపుటాలకు ఈ అవార్డు ఇవ్వడం విశేషం. మొత్తం చదవండి »
ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు
జనవరి2008
డా. కొడవటిగంటి రోహిణీప్రసాద్
ప్రకృతిలో రోగాల బారినపడని ప్రాణి ఏదీ ఉండదు. బాక్టీరియాకూడా జీవరాశిలో భాగమే కనక ఇది వాటికీ తప్పదు. పీత కష్టాలు పీతవి అన్నట్టుగా వీటిని వెంటాడేవికూడా లేకపోలేదు. దీనికర్థం ఏమిటంటే మనకు కనబడని రోగక్రిముల్లో బాక్టీరియాకాక మరికొన్నికూడా ఉన్నాయని. వాటివల్ల బాక్టీరియాకు రోగాలు వచ్చినట్టే మనకు కూడా జబ్బులు పట్టుకుంటూ ఉంటాయి. మొత్తం చదవండి »
ధారావాహికలు, ప్రత్యేక వ్యాసాలు
జనవరి2008
హిమబిందు
ఆఖరికి పగవాడు మరణించినా…, మనిషన్నవాడికి అదొక కుదుపే! అందునా, మన ఆనవాళ్లు కనిపిస్తేనే ప్రాణం లేచొచ్చినట్టనిపించే పరదేశ జీవితంలో మనవాళ్ల తాలూకు దుర్ఘటనలు విన్నప్పుడు, లేదా చూసినపుడు చాలా దిగులుగా అనిపిస్తుంది. ఆ దుర్ఘటనకు చెందిన వ్యక్తులు వ్యక్తిగతంగా మనకు తెలియకపోవచ్చు. కానీ ఒకే మట్టికి చెందిన వాళ్లం కనుక… ఆయా కుటుంబాలు కోల్పోయే సంతోషం, జీవితాంతం పడే క్షోభ, పలకరిస్తే చాలు, కోల్పోయిన తమ బిడ్డల గురించి కన్నవారు చెప్పే ఊసులు, చనిపోయిన వారిపై ఆధారపడి ఉన్నవారు ఎదుర్కోబోయే ఆటుపోటులకు చెందిన అనేక అంశాలపై ఎంత వొద్దనుకున్నా మనసు పరిపరివిధాల పోతుంది. మొత్తం చదవండి »
చౌరస్తా, సాహిత్య వ్యాసాలు