అనుభూతి కవితా శిఖరం ఆ సాయంత్రం

సుప్రసిద్ధ అనువాదకుడు, ఆధునిక వచన కవిత్వం మీద బలమైన ముద్ర వేసిన ‘చెట్టుకవి’ ఇస్మాయిల్‌ గారి నిర్యాణాంతరం ఆయన అభిమానులు ‘ఇస్మాయిల్‌ కవితా పురస్కారం’ పేరిట అవార్డును స్థాపించి గత రెండు సంవత్సరాలుగా ప్రదానం చేస్తున్నారు. ఇప్పుడిపుడే కొత్తగా రాస్తూ సాహిత్యలోకానికి పెద్దగా తెలియక, అనుభూతి సాంద్రతతోనూ, తాత్విక గాఢతతోనూ కవిత్వం రాసే కవుల మొదటి సంపుటాలకు ఈ అవార్డు ఇవ్వడం విశేషం. మూడో అవార్డు గరికపాటి పవన్‌కుమార్‌ రాసిన ‘ఆ సాయంత్రా’నికి ఇటీవలే ప్రదానం చేశారు. 1988 నుండి 2003 వరకూ దాదాపు పదిహేను సంవత్సరాల కాలంలో రాయబడ్డాయి ఈ కవితలు. అలాగని ఈ సంపుటిలో వందలకొద్దీ కవితలున్నాయని భావిస్తే అది భ్రమే. ఇందులో ఉన్నవి మొత్తం ఇరవై ఐదు కవితలు. ఒకటి రెండు దీర్ఘ కవితలను మినహాయిస్తే మిగిలినవన్ని లఘు కవితలే. ఇవి పరిమాణానికి చిన్నగా కనిపిస్తున్నా అవి ప్రతిపాదించే భావాంశాల్లో తాత్వికతలో పెద్దవీ, గొప్పవీ కూడానూ. ఇస్మాయిల్‌ కవితా పురస్కారానికి అన్ని తానే అయిన ప్రముఖ కవీ, విమర్శకుడు తమ్మినేని యదుకుల భూషణ్ ఈ గ్రంథానికి మంచిపీఠిక సంతరించిపెట్టారు.

మాటల పొదుపరితనం, నూతన భావచిత్రాల పరికల్పన, భాషా సారళ్యం, అనుభూతి సాంద్రత, తాత్విక గాఢత మొదలైన లక్షణాలన్నీ ఇస్మాయిల్‌ కవిత్వం నుండి పుణికి పుచ్చుకున్న పవన్‌కుమార్‌ వాటిని తన కవిత్వంలో అత్యంతశక్తివంతంగా ప్రదర్శించాడు. ‘ఆ సాయంత్రం’ కవితలో
నల్లగా
కాటుక పులుముకున్న
ప్రియారాలి కనుబొమల్లా
మారినచెట్లు
మౌనంగా
తపస్సుమాధిలోకి
జారుతున్నకొండ
ఎర్రబడిన బుగ్గల
అందమైన / ఆకాశం నవ్వు.

అని సాయంసంధ్యలో ప్రకృతిలో జరిగే వర్ణరసాయనిక చర్యను గొప్పగా ఒక చిత్రీకరణాన్ని చిత్రించాడు. సాధారణ వస్తువును కవిత్వంగా మలచడం అందరూ ఎగిరిందే. ఇక్కడ ప్రత్యేకమైన వస్తువేదీలేదు. కేవలం వాతావరణాన్ని మాత్రమే తన మానసిక ఆవరణలోకి ఆవహించుకుని, పరిసరాలను కవిత్వం చేయడం ఇందులోని విశేషం. అంతేకాదు ఆ వాతావరణానికి మానవగుణారోపణ చెయ్యడం. ఇంగ్లిష్‌లో పర్సానిఫికేషన్ అనీ ఎలిగరీ అని వ్యవహరించి దీనిని తెలుగులో మానవీకరణగా పిలుస్తున్నారు. జడపదార్థలను చైతన్యం కలిగించడంతోపాటు మానవ సంన్వదనాలను వాటికి ఆరోపించడం ముఖ్య లక్షణం.

చెట్లు : కాటుక పులుముకున్న ప్రియురాలి కనుబొమల్లా నల్లగావోరటం, కొండ : ఒక ముని తపస్సు సమాధిలో లోనిగిపోవడం, ఆకాశం : ఎర్రబడిన బుగ్గలలో అందంగా నవ్వడం నవ్వుతున్నట్టుండే రోజు ఇవన్నీ మానవగుణారోపణలే. ఈ పని ప్రాచీనకవి అయిన అల్లసాని పెద్దన, ఆధునిక కవి ఇస్మాయిల్‌ కూడా చేసారు. పెద్దన మనుచరిత్రలోని ఈ సూర్యాస్తమయ వర్ణన పద్యం చూడండి :

తరుణి ననన్యకాంత నతి దారుణ పుష్పశిరీ ముఖ వ్యధా
భర వినశాంగి సంగభపు బారికి నగ్గము సేసి క్రూరుడై
యంగె మహీసుదాధము డహంకృతిలోనని, రోషభీషణ
స్ఫురణ వహించెనోయన నభమణి దాల్చె గషాయనీథితిన్‌

అస్తమించబోయె సూర్యుడు కాషాయరంగు కాంతిలో మెరిసిపోతాడు. అది ప్రాకృతిక ధర్మం. ఆ ధర్మానికి అంతకుముందు జరిగిన సంఘటనను కారణంగా చూపుతున్నాడు. ఆ సంఘటన ప్రవరాఖ్యున్ని వరూధిని కోరుకుంది. అతడు నిరాకరించాడు. ఆమె వేదనకు పొగరుంది. అహంకారంతో ప్రవరాఖ్యుడు ఈపని చేసినందుకు కోపంతో రోషభీషణ స్ఫురణ వహించాడా అన్నట్టు సూర్యుడు కాషాయరంగు తాల్చాడు అంటాడు పెద్దన. కోపం వచ్చినప్పుడు ముఖం ఎర్రబడటం అనేచర్యను సూర్యునికి ఆపాదించడం ద్వారా వరూధిని పట్ల సానుభూతి ప్రకటితమైంది. ఇస్మాయిల్‌ గారు కూడా బావి ని భూమి బుగ్గన నవ్వినసొట్టలా వుంది బావి అని మనుష్య ప్రవృత్తిఅయిన నవ్వును భూమికి ఆపాదిస్తారు. ‘ఒక చిన్ననాటి సాయంత్రం’ కవితలో ”వందల /పిట్టల విన్యాసాలు / చిన్న చెట్టుపైకి / వలయలతో తోకచుక్కలా / మాయమైపోయాయి” అంటాడు. మనం రోజూవారీ చూసే అతిసామాన్య దృశ్యం. చీకటి పడుతున్నప్పుడో, తెలవారుతున్నప్పుడో చెట్టుమీంచి వందలపక్షులు ఒకసారిగా వాలడం, లేదా ఎగరడం సర్వసాధారణ విషయం. కానీదాన్ని చూసి ఒడుపుగా పట్టుకునే కవికన్ను ఏది? ఇదిగో ఒక కృష్ణ దేవరాయలు, ఒక శివారెడ్డి, ఒక పవన్‌కుమార్‌ ఆ దృశ్యాన్ని తమ కెమెరా కలంలో బంధించారు.

ఆ ముక్తమాల్యద ప్రథమ ఆశ్వాసం లోని విల్లిపుత్తూరు వర్ణనలోని ఈ పద్యం చూడండి.
మలయపు గాలిరేలు వనమాలి విమానపరాక ఘల్లుమం
చులియ, బనిండిమువు గమినొక్కక్క మాటుగదల్పనుల్కి, మి
న్నలము, తదీయహేమ వరణాంచు చంపక శీలందు భక్షులు
రొదనేయ, వేగెనని వడుదు రల్కలు దేఱి దంపతుల్‌

ఇక్కడ పక్షులు రొదసేయడం (ఎగురుతూ) చెప్పబడింది. ఆ రొదసేయడానికి గలకారణాలను అందమైన ఊహతొ అల్లారు కృష్ణదేవరాయలు. దేవాలయం వుంది, దాని ప్రాంగణంలో ధ్వజస్థంభమూ వుంది. ఆ ధ్వజస్థంభము చివర బంగారు గంటలు వున్నాయి. దేవాలయ ప్రాంగణానికి ఆనుకుని సంపెంగపొద వుంది. అందులో వందల కొలదీపక్షులు నిద్రిస్తున్నాయి. ఇదీ నిశ్చల వాతావరణం. దీనిలో కదలిక వచ్చింది. దక్షిణం వేపునుండి వేగంగా గాలి వీచింది. ఆగాలికి ధ్వజస్థంభానికి వున్న గంటలు ఒక సారిగా మోగాయి. ఆ గంటల శబ్దానికి పక్కనే సంపెంగ పొదలో నిద్రిస్తున్న పక్షులు ఒక్కసారిగా ఉలిక్కి పడి అరుచుకుంటూ బయటకు ఎగిరాయి. ఆ పక్షుల విలవిలరావములు విని తెల్లవారిపోతుందని, అప్పటిదాకా కోపగించుకున్న దంపతులు దగ్గరయ్యారు. ఇదీ కథ. చెట్టుమీదనుండి పక్షులు ఎగరటం వాలటం అనే దృశ్యాన్ని కృష్ణదేవరాయలు చూసివుండక పోతే ఈ పద్యం వచ్చేదికాదు. శివారెడ్డి గారు రాసిన కవితలో వస్తువు ఇదే. హైదరాబాదులో కవి మాత్రులు కలిసే ద్వారాకాహోటల్‌ భవనాలు చతురస్రాకారంలో వుంటాయి. ఆ మధ్యలో పెద్ద పొగడచెట్టు వుండేది. దానిమీదకు సాయంత్రం అయితే చాలు వందల సంఖ్యలో పిచ్చుకలు ఒక్కసారీ వచ్చి చేరేవి, చిన్న అలికిడి అయితే అన్నిపక్షులూ ఒక్కసారి గాల్లోకి లేచేవి. ఆ దృశ్యాన్ని శివారెడ్డిగారితో పాటు ద్వారకకొచ్చే చాలామందికవులూ చూసేవుంటారు. కానీ దాన్ని పద్యంచేసింది ఒక్క శివారెడ్డిగారే. ఆ కవిత ఇలా ప్రారంభంఅవుతుంది.

పైనుంచి ఎవరో
గుప్పెడు విత్తనాల్ని
చెట్టునెత్తి మీద చల్లినట్టు పిచ్చుకలదండు దూకడం
ఎవరో ఒక మహావీరుడు, వేయి బాణాల్ని ఒకేసారి సంధించి వొదిలినట్టు
పిచ్చుకలదండు ఝవ్‌మని దోసుకెళ్లడం- (‘అజేయం’ కవితా సంపుటినుంచి)

తాము చూసిన ఒక సంఘటన తాలూకూ అనుభవాన్ని పైముగ్గురు కవులూ వారివారి స్థాయిలో దృశ్యీకరించారు. ఇందులోని కవితలకు భిన్నంగా వున్న కవిత ”ఒకసారివచ్చి పోరా”! ఉద్యమంలోకి వెళ్లి పోయిన కొడుకును తల పోతలతో ఎదురుచూసే తల్లి పలవరింతలను హార్థికమైన కవిత్వం చేసాడు పవన్‌. ఈ వస్తువుతో గతంలో వచ్చిన కొద్ది మంచి కవితల సరసన ఇదీ చేరింది. ఈ పాదాలుపరికించండి. ”నిన్నెవరో దారెపోతూ / మంచినీళ్లు అడిగానారు / నీలాగే వున్నాడు/ నాకళ్ళలోకి సూటిగా చూసిండు / నీకే అమ్మ పోస్తోందీ / మంచినీళ్లు ”అన్నప్పుడు గుండె కలుక్కుమంటుంది. నులకమంచం / వసారలో / వాడటంలేదు / రాత్రెపుడోవచ్చి / నిదురపోతానని / పొద్దునే లేచి నువ్వెళ్లిపోయాననుకుంటా” కన్నీళ్లు తిరిగే వాక్యాలు. అనుభూతి వాదంలోనూ సామాజికాంశంను ఎంత బలంగా, అర్థంగా పలికించవచ్చో నిరూపించిన కవిత. ఈ కవిత్వంలోని మరో విశేషం వర్ణాలపరివర్తన. వివర్ణం వర్ణంగా మారటం, వర్ణం వివర్ణంగా విస్తరించడాన్ని ఈ కవి బహు నేర్పుగా అక్షరాల్లో ఒడిసిపట్టుకున్నాడు.

”నల్లగా /  కాటుక అలుముకున్న / ప్రియురాలి కనుబొమ్మల్లా / మారిన చెట్లు (ఆసాయంత్రం) ”చిన్నగా నల్లరంగు పులుముకుంటోంది ఆకాశం (ఒకచిన్న నాటి సాయంత్రం) వంటివి తెలుపు నలుపుగా పరివర్తన చెందే క్రమాన్ని పట్టియిస్తే” నలుపు కరిగితెల్లవారింది-పారిపోయింది ఆకాశం పైపైకి (రాత్రి)., కోడి కూయగా లేచి, నలుపుపోయి తెలుపువస్త/ నిన్నకది రేపుకాబోలు” (రేపు) వంటి పక్తులు నలుపుగా తెలుపుగా మారే క్రమాన్ని తెలుపుతాయి. ఈ వర్ణనలు నలుపు తెలుపు సినిమాలా కంటికి హాయిని గొలుపుతాయి. ఇందులోని అనేక లఘు కవితలు చదివిన వెంటనే ఇస్మాయిల్‌గారి కవితలు గుర్తుకువస్తాయి. దీపాలు కవిత ‘సృష్టి’ కవితను, లాల్‌సా కవిత. టీకప్పుకవితను, ప్రమాదం కవితను, యాక్సిడెంట్‌ కవితను గుర్తుచేస్తాయి. వచన కవిత్వంలోనే కాదు ఇస్మాయిల్‌గారు తెలుగు కవిత్వానికి పరిచయం చేసిన హైకూ కవిత్వ రచనలోనూ పవన్‌, ఇస్మాయిల్‌ గారి అడుగుజాడల్లోనే నడిచాడని ఈ హైకూ రుజువుచేస్తుంది.

ఉరకలేసే సముద్రం
లంగరు వేసిన నౌక
ఎప్పుడో విడుదల.

కవులు స్వేచ్ఛా ప్రియులని ఇస్మాయిల్‌ లాగే నమ్ముకున్న పవన్‌కుమార్‌ ఇంకా ఇంకా రాయాలని, రాసింది అజ్ఞాతంగా కాక నలుగురిలోకీ తేవాలని కోరుకోవడం దురాశకేదనుకుంటాను

(నవంబరు 24న ‘ఆసాయంత్రం’ కవితా సంపుటికి ఇస్మాయిల్‌ కవితా సంపుటి ప్రదానసందర్భంగా చేసిన ప్రసంగ పాఠం).

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

Trackback URI | Comments RSS

మీ అభిప్రాయం తెలుపండి

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో