Jan2008
హైకూ (గత సంచిక తరువాయి)
1
చెరువునంతా
గుప్పిట్లో ఉంచుకొంది
తీరపు రేఖ
2
పూలు రాలిన
శబ్ధం వినలేకనేమో
చెట్టు కదిలింది
3
ఏండ్లకేండ్లుగా
ఎదలో తడిలేని
ఏటిలో రాయి
4
పగిలినా
తనపని చేస్తూనే
అద్దం
5
కొట్టుకొనిపోతున్నాయి
కాలము విషాదము
ఈ వర్షంలో
6
చినుకుల్ని
అడ్డుకొని
గొడుగే వద్దు
7
నాదే అయినా
పరిచయం లేనిది
8
ఒంటరి
సీతాకోక
ఎందాకా నీ పయనం
9
నన్ను నిశ్చలం చేసే
సూరీడు
వస్తూనో, పోతునో
10
చీకటి!
రాత్రికి మేల్కొందాం
తెల్లారబోతుంది
11
గుర్తుందో
సీతాకోకకు
గొంగలి పురుగైన గతం
12
సీతాకొక రెక్కల్ని
ఏం చేయలేకపోయింది
మృత్యువు
13
దుఃఖ మెప్పుడూ
కన్నీటి రెక్కలతో
ఎగిరిపోతుంది
14
చీకటి జాడలు
తెలియని వాడు
సూరీడు