Jan2008
జలియన్ వాలాబాగ్
ఎండ నీడను
ఆకలిని తూటా
గుడ్డను రక్తం
నడిరోడ్డు కడిగేస్తది
రోడ్డు పేపర్ మీద
చివరి కాలం
ఘడియలు లెక్కించి
సంతకం చేస్తది
ప్రపంచం ఆగినచోట
కూడు గూడు గుడ్డ
చట్టసభలచుట్టు
గిల గిల కొట్టుకుంటుంది.
రాజ్యం పోలీసును
రాస్తారాజు చేస్తది
శకుని పగతో ఓడి గెలుస్తాడు
ఐదేండ్ల ఆకలి సొమ్మ,
ధర్మరాజు జూదం.
చరిత్ర పునరావృతమవుతుంది.
అది జులై 28 దో ఆగస్టు 28 దో
పేగులు కాలి
ఆకురాలిన చెట్టుతో కలిసి
గోడమీద మోడు బింబమవుతుంది.
మబ్బుచాటున
ఒక పండు వెన్నెల మోసం చేస్తుంది.
కరంటా? నందిగ్రామా? భూమా?
భిన్నధృవాల మధ్య బతకాలంటే
శీతోష్ణాలకు తట్టుకునే కవచాన్ని అన్వేషించాలె
March 30th, 2008 at 1:38 am
చాలా భగుంది