రెక్కలక్కర లేదు

అన్నింటికి రెక్కల్లేవు
రెక్కలున్నవి గూడా ఇప్పుడు ఎగరలేవు
మెడలో రాయిగట్టినట్టు, దబ్బున పడిపోతున్నాయి.
ఒక స్వరమేదో
విషపుజ్వరంలా అల్లుకుంటోంది
దూర దూరానికి సాగిపోతున్న రోజులు
అకస్మాత్తుగా వెనక్కి వచ్చేస్తున్నాయి.
అగ్నిమాపక దళం రబ్బరు నీటి గొట్టంలా
వెనక్కి చుట్టుకుంటూ, వుండచుట్టుకు పోతున్నాయి.
తెల్లారగట్ట శుభపరిమళాలు
రకరకాల స్పర్శలు మెలకువలు
అన్ని దిక్కుల నుంచి వస్తున్న
చెత్తకుండీ పొగలో మునిగిపోతున్నాయి.
ఒక ఆదర్శ పురుషుణ్ని కనుగొనడం సాధ్యం కాదు.
ఎత్తులన్నీ కుంచించుకుపోతూ
మరుగుజ్జుతనం మార్గదర్శకమౌతుంది
రెక్కలక్కరలేదు
ఎగరనక్కరలేదు
నిలబడాలి కదా నిట్ట నిలువుగా నిలబడాలి
మానవజాతి మొత్తాన్ని సందిట ఖండించాలి
పెదవుల్ని ఊపిరేదో బయటికొచ్చి స్వరాన్ని బతికించాలి
సాగుతున్న చూపు సాగాలి
చెరువుమీంచి లేచే ఆవిర్ల పొగమంచు
నీ, నా వడుల్లో అంతర్ధానం కావాలి
రెక్కలక్కరలేదు
ఊహలుండాలి, పక్షుల్లాంటి ఊహలు
తొలిపొద్దులో వెలుగుతున్న చెట్ల లాంటి ఊహలు
కొండకొమ్ములనుంచి అలా లోయలోకి
పాకుతున్న మబ్బుల్లాంటి ఊహలు
కళ్లు మూసుకుని సర్వాన్ని వీక్షించే ఊహలు
ఆ పూల చెట్టు మొదట్లో కూచుని
పాదుచేస్తూ నీళ్లు కడుతున్న అమ్మాయి లాంటి ఊహలు
రెక్కలక్కరలేదు, ఊహలుండాలి.

అభిప్రాయాలు లేవు »కవితలు

Leave a Reply

(కీబోర్డు మ్యాపింగ్ చూపించండి తొలగించండి)


a

aa

i

ee

u

oo

R

Ru

~l

~lu

e

E

ai

o

O

au
అం
M
అః
@H
అఁ
@M

@2

k

kh

g

gh

~m

ch

Ch

j

jh

~n

T

Th

D

Dh

N

t

th

d

dh

n

p

ph

b

bh

m

y

r

l

v

S

sh

s

h

L
క్ష
ksh

~r
 

తెలుగులో వ్యాఖ్యలు రాయగలిగే సౌకర్యం ఈమాట సౌజన్యంతో