February 2008 సంచిక

ఫిబ్రవరి 2008 : సంపాదకీయం

Painting ‘Black History Month’
Painting ‘Black History Month’
ప్రాణహిత ఫిబ్రవరి సంచికకు స్వాగతం. ఈ నెలను బ్లాక్ హిస్టరీ మంత్ గా పిలుస్తారు. ఈ నెలంతా అమెరికా లో నల్ల జాతీయుల హక్కుల కోసం, స్వేచ్ఛా సమానత్వాల కోసం పోరాడిన వాళ్ళ జీవితాలనీ, చరిత్రలో ముఖ్య ఘట్టాలనీ తలుచుకుంటారు. అమెరికా చరిత్ర ని రెండు కోణాల్లో పరిశీలించవచ్చు.. ఒకటి సాధారణంగా ప్రధాన స్రవంతిలో ప్రచారంలో ఉన్న కోణం. ఇక్కడ పాలిస్తున్న వారి కోణం. ఇక్కడి ఆధిపత్య సమూహాల దృష్టి నుండి చరిత్రను చూసి చెప్పే పద్దతి. అంటే టూకీ గా చెప్పుకోవాలంటే కొలంబస్ రాక తో ఈ ఖండం మీద అడుగు పెట్టిన ‘యాత్రీకుల’ (తెల్ల వారి) చరిత్ర.. వారి విజయాల చరిత్ర. అట్లా వచ్చిన ‘యాత్రీకులు’ (pilgrims) ఇక్కడ తమ స్థిర నివాసాలనీ, రాజ్యాలనీ స్థాపించుకుని ఏర్పర్చుకున్న సామ్రాజ్యం దృక్కోణం నుండి చూసే చరిత్ర. రెండోది దీనికి పూర్తిగా భిన్నమైన కోణం. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »సంపాదకీయం

ఫిబ్రవరి 2008 సూచిక

కవితలు

అభిప్రాయాలు లేవు »సూచిక

దళిత రాజ్యం

అనంతమైన ఆకాశంలో
మినుకు మినుకు మనే నక్షత్రాల్లా
అఆఇఈలు మనకు అందని చుక్కలైతే
నా అక్క అన్నలనీ అమ్మా నాన్నలనీ
మొత్తం చదవండి »

5 అభిప్రాయాలు »కవితలు

రేప్‌ చేయబడ్డ నగరం

నగరం, కర్ఫ్యూలో కాల్చిన మాంసం సీకు
నగరం, వెన్నుపోటు పొడిచే మిత్రుడి బాకు
నగరం, అనుమానాల పుట్ట
మానవ కళేబరాల గుట్ట
మొత్తం చదవండి »

4 అభిప్రాయాలు »కవితలు

ఉరుకుతున్న గంగ

నీ ప్రవాహం
మా నేలమ్మకు జీవమనుకున్నం
మొక్కులు తీర్చి పూజలు చేసినం
అయినా
మానేటి తల్లీ మర్లి సూడనే సూడవు!

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

తెలంగాణ దండోరా

దండోరా వినపడదు
వినపడనట్టు కనపడటం
కనపడేలా కన్నీరు కార్చటం
ఓ కపట ప్రేమ మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

వెనకడుగు

 ఆ అడుగు ముందు కేస్తే
అంతా శూన్యమై పోతుందనుకున్నప్పుడు
భూమంతా అడుగు నేలకు
సరిపోతుంది.
శూన్యాల్ని కోరుకుంటూ
వేలు, లక్షల అడుగులు రోజూ… మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కవితలు

పడవ కాలిపోతోంది

వెన్నెల్లో చీకటి పడ్డట్లు
అప్పటిదాకా వెలిగిన
దీపమేదో నిశ్శబ్ధంగా
రాత్రిలోకి జారుకుంది. మొత్తం చదవండి »

2 అభిప్రాయాలు »కవితలు

ప్రజాస్వామ్యం

- లాం గ్స్టన్ హ్యూస్

ఇవాళ్ళ గానీ
రేపు గానీ
ప్రజాస్వామ్యం
భయమూ రాజీల ద్వారా రాదు

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »అనువాదాలు, కవితలు

నమ్మిక

గడీలు వొయినయి… బురుజులు వొయినయి – పల్లెలిడ్శిన దొరలంత పట్నంగడ్డెక్కిండ్రు. గాడ గడీలు లెవ్వుగని అంత్రాల బంగ్లాలచ్చినయి. సందులు గొందులు వొయి పెద్ద డాంబర్‌ రోడ్లయినయి… తీరొక్క మోటర్లచ్చినయి బుర్రు..బుర్రు.. రోడ్డు దాటనీకి ఎప్పుడూ సందే ఉండది. ఇగ ఎసుంటోల్లు గీ పట్నం తొవ్వనేవట్టవట్రి. అందరోలె అన్మంత్రావు దొర పట్నం కచ్చి బంగ్ల  గట్టిండు.. జాగలు గొన్నడు.. ప్యాట్రీల్ల పొత్తుల్వెట్కున్నడు.
ఎంత పనున్నా మొన్నటిదాంక దసురకో ఉగాదికో ఊర్లెకచ్చి పండుగ జేస్తుండె. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

నీడ చెదిరిన గూడు

”పత్తి కుప్పల మీద సుడిగాలి లేశినట్టు పింజలు పింజలుగ నీళ్లు నురుగులు గక్కుకుంట పైనించి దునుకుతున్నై, దగ్గర్దగ్గెర ఈన్నించి మన అన్నారమవతల పోతురాజు గుట్టంత దూరం దన్క తెంపులేకుంట పారుతున్నై నీళ్లు యాన్నుంచొస్తున్నయో ఏమోపాడయ్యి. ఒక్కటే బొయ్యిన మోత!

మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »కథలు

తోడేలు

కొంతకాలంగా నేనొక చెట్టుమీద తలదాచుకున్నాను. అక్కడ అలా ఉండి ఉండి విసిగిపోయాను. ఇప్పుడిక కిందికి దిగి రావాలని ఉంది. కాని నేల మీద నాకోసం తోడేలు కూచుని ఉంది. నా వైపు గుర్రుగా చూస్తూ ఉంది. నేనెప్పుడు కిందికి దిగుతానా నా మీద పడి ఎప్పుడు చీల్చి చెండాడుదామా అని, అది ఎదురు చూస్తోంది.
ఈ చెట్టు విచిత్రమైనంది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »అనువాదాలు, కథలు, ప్రపంచ సాహిత్యం

సర్రియలిజం అంటే…

రాత్రిపూట ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసీ మంచం మీదికి వాలుతూ, చీకటి మూసిన బెడ్‌రూంలో కాళ్లవైపు ఫ్లోరింగు తెల్లగా మెరుస్తూ టైల్స్‌ మీది డిజైన్‌ సైతం కనపడటం గమనిస్తాము. ఇంకో క్షణం పోయాక చూపులు తిన్నగా పైకి పోనిస్తే, లోకప్పు మీద ఫ్యాను రెక్కల నీడలు నల్లటి వలయాలుగా, గబ్బిలాల గుంపులాగా స్పష్టంగా తిరుగాడటం కనిపించి ఇంకా ఆశ్చర్యపోతాము. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు

మహిళ?!

అమెరికా అధ్యక్షపదవికి డెమోక్రాట్ల అభ్యర్థిని ఎంపికచేసుకునే ప్రక్రియలో ఆఫ్రో-అమెరికన్ జాతికి చెందిన మహిళలపై ‘జెండర్ సెన్సిటివిటీ కంటే జాతిపరమైన భావోద్వేగ ప్రభావమే ఎక్కువగా ఉందం’టూ ప్రముఖ న్యూస్ ఛానల్ సి ఎన్ ఎన్ ఒక స్టోరీని ప్రసారం చేసినపుడు, మొదట గందరగోళపడ్డప్పటికీ, ఆచరణలో లేదా మానసికంగా అది వాస్తవానికి దగ్గరేననిపించింది. మొత్తం చదవండి »

3 అభిప్రాయాలు »చౌరస్తా, సాహిత్య వ్యాసాలు

అపరాజిత 5: గమ్యం లేని ప్రయాణాల కాలం

నేను చాలావరకు ఒంటరిగా వుండేదాన్ని. బట్టలు , మేకప్ , పర్ఫ్యూమ్ వంటి వస్తువులు  చాలామంది అమ్మాయిలు ఇష్టపడినంతగా నన్ను ఆకర్షించేవి కావు. తెల్లవాళ్లంటే భయంవల్ల , జంకువల్ల వారితో ఎక్కువగా కలిసేదాన్ని కాదు. సంకరజాతి వాళ్లతో నూ  బాగా కలువలేక  పోయేదాన్ని. ఫుల్ బ్లడ్స్ నన్ను ఇష్టపడరేమోనని భయపడేదాన్ని. అమ్మ అభిప్రాయాలతో ఏకీభవించలేకపోయేదాన్ని. మొత్తం చదవండి »

ఒక అభిప్రాయం »అనువాదాలు, అపరాజిత, ప్రపంచ సాహిత్యం

సూక్ష్మజీవుల ప్రతాపం

బాక్టీరియా, ఇతర సూక్ష్మజీవులూ మన జీవితాలని ఎన్ని రకాలుగా ప్రభావితం చెయ్యగలవో పూర్తిగా అర్థం కావటంలేదు. పరిశోధనల్లో బైటపడుతున్న కొత్త విషయాల్లో వాటి గురించిన మంచీ, చెడూ కూడా తెలియవస్తోంది. ఒక్కటి మాత్రం నిజం. ప్రపంచంలో ప్రతిచోటా నిలదొక్కుకుని జీవిస్తున్న రకరకాల బాక్టీరియాను తప్పించుకోవడం అసాధ్యమైన పని. పనికిరాని చెత్తనూ, కుళ్ళిన జీవ పదార్థాలనూ ఎప్పటికప్పుడు విడగొట్టి మట్టిలో కలిపేసే బాక్టీరియా మనకు పనికొచ్చే ఆహారాన్ని కూడా “పాడు” చేస్తూ ఉంటాయి. మొత్తం చదవండి »

అభిప్రాయాలు లేవు »ప్రత్యేక వ్యాసాలు, సైన్స్