Feb2008
దళిత రాజ్యం
అనంతమైన ఆకాశంలో
మినుకు మినుకు మనే నక్షత్రాల్లా
అఆఇఈలు మనకు అందని చుక్కలైతే
నా అక్క అన్నలనీ అమ్మా నాన్నలనీ
నిలదీస్తాను నేను ఎందుకందుకోలేదని
అక్షరమన్నది ప్రజ్వలించే సూర్య బింబమైతే
ఆ అక్షరాన్ని కబలించి
నా దళిత జాతిని చీకటి
కోణంలోకి నెట్టేసిన
దగాకోరులను మంటలమై
మన మెందుకంట లేదని ప్రశ్నిస్తాను
నా గతాన్ని పదే పదే
తరతరాల చరిత్ర పుటల్లో
తగలెయ్య బడ్డ నా దళిత తత్వాన్ని
అంటరాని వాళ్ళమనే అలుసుతో
వెంటపడి వేదిస్తుంటే
చేతులు కట్టుకుని బాంచేన్ అన్న
బానిస బతుక్కు స్వస్తి చెప్తు
ఆత్మ వంచనను దరి చేరనీయక
అన్యాయులను వ్యతిరేకిస్తూ
దిక్కరిద్దాం పెద్దరికాల కుటిలత్వాన్ని
నిర్మిద్దాం దళిత రాజ్యాన్ని.
February 12th, 2008 at 12:58 am
జాజుల గౌరిగారి కవిత దళిత రాజ్యం నిర్మిద్దాం బావుంది. నాకు నచ్చింది.
తుల్లిమల్లి విల్సన్్ సుధాకర్,బెంగలూరు.
February 16th, 2008 at 4:40 am
ప్రశ్నిస్తేనే జవాబుకోసం వెదకులాట మొదలౌతుంది
అభినందనలు
జాన్ హైడ్ కనుమూరి
February 17th, 2008 at 6:27 am
కవిత బాగుంది , చదువుకు మీరు ఇచ్చిన రూపకం చాలా బాగుంది.
మీరు మీ పెద్దలను నిలదీయడం అంత మంచిది కాదని మనసికవైద్యులు అభిప్రాయపడవచ్చు. ఇక పోతే, సర్వసమాన రాజ్యం అయితే బాగుంటుందేమో :)
February 24th, 2008 at 12:51 am
మీకవిత చాలా బాగుంది. దళితులు అక్షరాలు నేరిస్తే వాళ్ళమనుగద కష్టం. అందుకేవాళ్ళు ఎప్పటికీ అణచివేయబదుతూనే వున్నారు. దళితుల అభివ్తృద్దికి కేటాయించిన నిధులు సైతం దారిమళ్ళుతున్నాయి. దీన్న ప్రశ్నించేస్టాయికి దళిత సోదరులు ఎదగాలి. అక్షరజ్ఞానం అలవర్చుకోవాలి. మీలాంటి కవులంతా దానికి స్పూర్తినివ్వాలి.
March 1st, 2008 at 8:44 am
జై తెలంగాణ